- మొహమ్మద్ ఇర్ఫాన్
![]()
ప్రపంచంలో కెల్లా అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం మనది. ఇక్కడ జరిగే ఎన్నికల్లో ప్రతిసారి విదేశాలలో నివసిస్తున్న లక్షలాది మంది ప్రవాస భారతీయులు ఒకింత నిరాశకు గురికావడం ఒక అనవాయితీగా మారింది. దేశ దశ, దిశ నిర్దేశించే ఏ ఎన్నికల్లోనూ వీరికి ఓటు హక్కు లేకపోవడం ఇందుకు కారణం. అమెరికా, బ్రిటన్, రష్యాలతో పాటు ఫిలిప్పీన్స్, దక్షిణాఫ్రికా తదితర దేశాలకు చెందిన వారు విదేశాలలో నివసిస్తూ తమ దేశాల రాయబార కార్యాలయాలలో ఏర్పాటు చేసే పోలింగ్ బూత్‌లలో ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటున్నారు. అలాంటి అవకాశం మన ప్రవాసీయులకు లేకపోవడం బా«ధాకరం.
గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి మనదేశంలో ప్రత్యేకించి మన రాష్ట్రంలో జరిగిన ఎన్నికల కసరత్తులో భాగంగా జరిగిన సర్వేలో ఓటర్ల జాబితా నుంచి మరణించిన వారి పేర్లు, ప్రవాసీయుల పేర్లు తొలిగించడానికి ఎన్నికల కమిషన్ గట్టిగా కృషిచేసింది. దీంతో తమకు దేశంలోని అధికార వ్యవస్థ నుంచి ఉన్న ఏకైక గుర్తింపు కూడా లేకుండాపోయిందనేది వీరి ఆవేదన. తొలి విడుత పోలింగ్ జరిగిన తెలంగాణ ప్రాంతం నుంచి అధిక సంఖ్యలో గల్ఫ్ దేశాలలో ప్రవాసీయులు పనిచేస్తున్నారు. రెండవ విడుతలో పోలింగ్ జరిగిన కడప, అనంతపురం, చిత్తూరు, ఉభయ గోదావరి, విశాఖపట్నం జిల్లాల నుంచి కూడా ఓటర్లు పెద్ద సంఖ్యలో గల్ఫ్ దేశాలలో ఉన్నారు. అయితే వీరికి ఇక్కడ స్థిర నివాసం గాని, ఉపాధి హామీగాని లేదు.
దశాబ్దాలుగా ఇక్కడ నివసించినా గల్ఫ్ రాజ్యాలు విదేశీయులకు పౌరసత్వం హక్కు కల్పించవు. ఉన్నంత కాలం వీసాపై ఉండవలసిందే. ఏ క్షణం లోనైనా స్వదేశానికి పయనం కావల్సిన తెలియని పరిస్థితులుంటాయి. వీరందరు విదేశాలలో ఉన్నప్పటికీ వీరిలో అత్యధికుల పేర్లు స్వదేశంలోని ఓటర్ల జాబితాలో ఉన్నా యి. అందులో కొందరికి ఓటరు గుర్తింపు కార్డు ఉండగా మరికొందరికి లేదు. ప్రజాప్రాతినిధ్య చట్టం 1950 సెక్షన్ 19 ప్రకారం ఒక స్థలంలో ఆరునెలల పాటు నివసించని వ్యక్తి పేరు జాబితాలో ఉండడానికి వీలుండదు. కొద్దికాలంగా జాబితాలలో చోటు చేసుకునే తతంగం కొనసాగుతున్నది. ఫోటో గుర్తిం పు కార్డులపై ఎన్నికల సంఘం క్రమేణా ఒత్తిడి చేస్తుండడంతో ఈ అంశం వెల్లడయింది.
1985లో మెట్‌పల్లి నియోజకవర్గం నుంచి బిజెపి అభ్యర్థిగా సిహెచ్. విద్యాసాగర్ రావు 372 ఓట్లతో గెలుపొందారు. ఈ ఎన్నికను ప్రశ్నిస్తూ ఆయన ప్రత్యర్థి సంజయ్ విచార్ మంచ్ నుంచి పోటీచేసిన కొమిరెడ్డి రాములు హైకోర్టులో కేసు దాఖలు చేశారు. గల్ఫ్ దేశాలలో నివసిస్తున్న వారి ఓట్లు కూడా పోలయ్యాయి కాబట్టి ఈ ఎన్నికను రద్దు చేయాలని వాదించారు. అయితే పోలింగ్ సమయంలో చేయాల్సిన పనిని ఇప్పుడు హైకోర్టు చేయదని కేసును కొట్టివేసింది. రాష్ట్రానికి చెందిన కొందరు ప్రవాసీయులు తమ పేర్లు ఓటర్ల జాబితాలో ఉండడంతో వారు చట్టసభలకు ఎన్నికకాగా, మరికొంద రు ఎన్నికల పోరులో నిలబడగలిగారు. కానీ ప్రాతినిధ్య చట్టం ప్రకారం ఆరునెలలకు పైగా నివాసముండని వ్యక్తి పేరు తొలిగించాలని ఉన్నా వీరి పేర్లు ఓటర్ల లిస్టులో ఏ రకంగా చోటు చేసుకున్నాయో అర్థం కాని ప్రశ్న. విదేశాలలో ఉండికూడా ఓటర్ల జాబితాలో పేరు ఉండాలనుకోవడం అనైతికం.
కానీ మాతృభూమికి తిరిగి వచ్చిన ప్రవాసీయులు తాము నివసిస్తున్న చిరునామాపై ఫారం-6 ద్వారా ఓటరుగా నమోదు చేసుకునేందుకు మొదటి నుంచి వీలుంది. అయితే దీన్ని ఈ దఫా ఎన్నికల కమిషన్ విస్తృతంగా ప్రచారం చేయడంతో చాలా మంది దరఖాస్తు చేసుకున్నా, అనేక మంది పేర్లు జాబితాలో చేర్చలేదు. భారత్‌లో ప్రవాసీయుల కు ఓటు హక్కు కల్పించాలని కొద్ది కాలంగా డిమాండ్ ఉంది. తమ ప్రవాసీయులకు ఓటు హక్కు కల్పించాలని కేరళ శాసన సభ ఏకగ్రీవంగా తీర్మానం కూడా ఆమోదించిం ది. పంజాబ్ రాష్ట్ర మంత్రివర్గమూ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. ఎన్డీఏ హయాం లో అమెరికాలోని సంఘ్‌పరివార్ అనుకూల ప్రవాసీ గుజరాత్ లాబీ ఒత్తిడితో ఎన్డీఏ ప్రభుత్వం కొంత వరకు ప్రయత్నం కూడా చేసింది.
అనేక చిక్కులు, రాజ్యాంగబద్ధమైన సమస్యల వల్ల ముందుకు వెళ్లలేకపోయింది. 2006లో హైదరబాద్‌లో జరిగి న ప్రవాస భారతీయ దినోత్సవ వేడుకలో కూడా ప్రధాని మన్మోహన్ గల్ఫ్ దేశాలలోని ప్రవాస భారతీయులకు ఓటు హక్కు కల్పించే విషయంపై తాము ప్రయత్నిస్తున్నట్టు ప్రకటించారు. గల్ఫ్ దేశాలలో ఉన్నవారిలో చాలామంది ముస్లింలు, ఈశాన్య ఆసియా దేశాలలోని వారిలో తమిళులు ఎక్కువగా ప్రయోజనం పొందుతారని దానికనుగుణంగా ఈ సిద్ధాంతాల ప్రచారం విదేశాలలో జోరుగా జరుగుతుందని అది జాతి శ్రేయస్సుకు హితవు కాదని నిఘా వర్గాలు హెచ్చరించాయి.
భారతీయ దౌత్యవేత్తల అభిప్రాయంతో ఓటు హక్కు కల్పించలేదు. రాచరిక వ్యవస్థ అమలులో ఉండే గల్ఫ్లో భారతీయ రాజకీయ పక్షాల ప్రచారంలో జరిగే పరిణామాలు చివరకు భారతీయుల మెడకు చుట్టుకుని వారి మనుగడకే ప్రమాదమనే ఉద్దేశంతో కేంద్రం ఈ దశగా ముందుకు కదలలేదు. చట్టబద్ధమైన ఓటు హక్కు లేకున్నా గుజరాత్, కేరళ రాష్ట్రాల్లో బిజెపి, మార్సిస్టు, ముస్లింలీగ్‌ల టికెట్ల పంపిణీ, అనేక స్థానాల్లో గెలుపు ఓటమి అంశాలు ప్రవాసీయులు ప్రభావి తం చేశారు. గుజరాత్‌లో నరేంద్రమోడి విజయం వెనుక ప్రవాస గుజరాతీయుల ప్రభావం చాలా వరకు ఉందన్న విషయం మరచిపోకూడదు.
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి; 24 ఎప్రిల్ 2009, ఆంధ్రజ్యోతి సౌజన్యంతోటి)
April 30th, 2009 at 9:50 am
There are a few questions i would like to ask Mr. KCR. i am a strong supporter of telangana movement and in the intial stage of the formation of the TRS party i was very confident that KCR can bring us the most wanted seperate state but very soon after the 2004 elections i was totally convinced that KCR cannot bring Telangana state.
The following are some of the points which are a cause of concern
1. how many people in telangana are aware of the need of seperate telangana state. What did TRS do to bring awareness in the public
2. why is it that even after Krishna & Godavari flowing in 8 districts of telangana public in Mahaboobnagar and Nalgonda are suffering from lack of drinking water leave alone irrigation
3. how many instances have been brought to light where the farmers of telangana have sold there cattle to the buttchers for not been able to feed them water.
4. how much percentage of water has to be utilized in telangana and how much of it is been used now and where is the rest been diverted too.
5. why is it that the sriram sagar project canals are not completed even after more than 20 years of the project been started.
6. what is the capacity of sriram sagar project when it started and what is its capacity
7. why did the capacity decrease. how many years has it been that the silt which gets deposits has been removed
these are some of the questions i want to answer but there are also some personal questions to KCR which i will ask in the next mail