- గుండెబోయిన శ్రీనివాస్
![]()
ఎవరినెక్కడ పెట్టవలనో
ఎవరి పని ఇక పట్టవలెనో
నీళ్లు నములుడు మానుకొని
జర.. నిర్ణయిద్దామా !
ఒక్క ఓటుకు రెండు నాల్కలు
కొత్త రాష్ట్రపు పాత హామీ
రేకులూడిన ‘పూల’ వగపుల
సోకు చూద్దామా !
అడుగు అడుగుకు గొడుగు మార్చే
అద్భుతపు హైటెక్కు ‘టెక్కు’ల
వెనుక దాగిన ‘దేశ’ మర్మము
విప్పి చెబుదామా ?
నోట వరముల మూట పెట్టుకు
నొసటితో ఎగతాళి చేసే
చేతి వాటపు వికట చేష్టకు
‘చెక్కు’ పెడదామా ?
కుండ మార్పిడి కూట నీతికి
రెండు వైపుల దరువులేసే
సుత్తి, కొడవలి సత్తువెంతో
చూపి వద్దామా ?
పాత పొత్తులు కొత్త కత్తులు
గొంతు కోసే గొప్ప జిత్తులు
వేసి మోసము చేయువారికి
షాకు లిద్దామా ?
(20 ఎప్రిల్, 2009, ఆంధ్రజ్యోతి వివిధ సౌజన్యంతోటి)