తెరవే మహాసభలు
జూన్ 18th, 2009 by డిస్కవర్ తెలంగాణ
‘తెలంగాణ రచయితల వేదిక’ (తెరవే) 5వ రాష్ట్ర మహాసభలు ములాఖాత్ పేరిట ఈ నెల 21వ తేదీన సుందరయ్య విజ్నాన కేంద్రం, హైదరాబాద్ లో జరుగుతాయి. ఉదయం 10 గంటలకు జెండా ఆవిష్కరణ జూకంటి జగన్నాథం చేస్తారు. చుక్కా రామయ్య గండదీపం వెలిగిస్తారు. అల్లం రాజయ్య ప్రారంభోపన్యాసం చేస్తారు. జూకంటి అధ్యక్షోపన్యాసం చేస్తారు. జూలూరు గౌరీ శంకర్ కార్యదర్శి నివేదిక చదువుతారు. ముఖ్య అతిథులుగా కె.శ్రీనివాస్, టంకశాల అశోక్, మల్లె పల్లి లక్ష్మయ్య, అల్లం నారాయణ పాల్గొంటారు. ‘సోయి’ ప్రత్యేక సంచికను నందిని సిధారెడ్డి ఆవిష్కరిస్తారు. చిన్న రాష్ట్రాల ఆవశ్యకత- తెలంగాణ, చత్తీస్గడ్ రాష్ట్ర పర్యటన-ఒక విశ్లేషణ, తెలంగాణ భాష- సంస్కృతి, స్థానికవాదం- సాంస్కృతిక, రాజకీయ చైతన్యం అంశాలపై ఉపన్యాసాలుంటాయి. వివిధ సెషన్‌లకు జింబో, దామెర రాములు, బన్న ఐలయ్య, వేణు సంకోజు అధ్యక్షత వహిస్తారు. వక్తలుగా ఇనుకొండ తిరిమలి, లోకేశ్వర్, నలిమెల భాస్కర్, సీతారాం పాల్గొంటారు. సాయంత్రం ఊరుడి మల్లికార్జున్ గొల్ల సుద్దులు, విమల బృందం పాటలు వినిపిస్తారు.
- జూలూరి గౌరీశంకర్, తెరవే కార్యదర్శి



