Feed on
Posts
Comments

Monthly Archive for November, 2009

ఓరియంట్‌లాంగ్మన్‌ వారు ప్రచురించిన “నాంపల్లిరోడ్‌ నవల చదవని వారు తప్పక చదవాలి. హైదరాబాదు గతవైభవం, సమకాలీన జీవితం అలా అలవోకగా అందులో గుమ్మరించారు రచయిత్రి మీనా అలెగ్జాండర్‌”. ప్రముఖ ఇండో ఆంగ్లికన్‌ కవయిత్రి, రచయిత్రి అయిన మీనా రాసిన తొలి నవల అది! ‘నాంపల్లిరోడ్‌’ అనే ఇంగ్లీషు నవలలోని కథా నాయకకు ఇంగ్లీషు మహాకవి వర్డ్స్ వర్త్ ఆరాధ్యుడు. తనుకూడా ఈ హైదరాబాదు నగర సౌందర్యానికి స్పందించి, వర్డ్స్ వర్త్ లాగా కవిత్వం రాయాలనుకుంటుంది.

Read Full Post »

5 స్వామి ఆలియా స్కూలు వద్ద బస్సు దిగంగనే నిజాం కాలేజీలకు ఉరికినాడు. ఇంకా నయం. ఊరేగింపు బయలుదేరనే లేదు. సాలార్‌జంగు హాలు ఎదురుంగ ఉన్న చెట్ల దగ్గరికి చేరుకున్నడు. ఈ ఉద్యమ సందర్భంల సిటీ కాలేజీ విద్యార్థులంతా కలుసుకునే సంకేత స్థలం అదే. తన మిత్రబృందంఅంతా అక్కడనే వుంది. “ఏం రా లేట్‌ లతీఫ్‌! ఇంత ఆలస్యంగ వచ్చినవ్‌?” అని గోపి విసుక్కున్నడు. “ఆప్‌కే ఇంతజార్‌ మే హమ్‌ ఇంతెఖాల్‌ హోగయే” అని అశోక్‌ ఆట [...]

Read Full Post »

4 పదిహేడు సంవత్సరాలు గడిచిన తర్వాత మళ్లీ ఇప్పుడు 1969ల ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ‘పునరుత్తానంగ’ ప్రారంభమయ్యింది. ఆ రోజు స్వామి సరిగ్గ కాలేజీకి పోకుండ నారాయణగుడా విఠల్‌వాడీల వున్న గోపి ఇంటికి బయలుదేరినాడు. విఠల్‌వాడీల రాగిచెట్టు కింద అమ్మవారి గుడి ఎదురంగ వాళ్ల ఇల్లు. వాళ్ల నాన్న ఎలక్ట్రిసిటీ బోర్డులో ఉద్యోగం చేస్తడు. వాళ్లది స్వంత ఇల్లే అయినా చాలా ఇరుకు. వాళ్ల ఇంట్ల సిటీ కల్చర్‌ స్పష్టంగ కనబడుతది. దక్కన్‌ క్రానికల్‌, ఆంధ్రభూమి దినపత్రికలు [...]

Read Full Post »

3 చిరుగాలికి చలించే చిగురాకువంటి స్వామి తనకు తెలియకుండనే, తన ప్రమేయం లేకుండనే ఇప్పుడు 1969ల మొదలైన ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉప్పెనల తలనిండా మునిగి కొట్టుకపోతున్నడు. స్వామి ఆ రోజు ఉత్సాహంగ నిద్ర లేచినాడు. ”ఇంత పొద్దున్నే ఎందుకు లేచినవురా?” అని అమ్మ ఆశ్చర్యపోయింది. ఆమె అప్పటికే నిద్ర లేచి వంటింట్ల మట్టిపొయ్యిని ఎర్రమన్నుతోటి చక్కగ అలికి, దానికి తెల్లటి ముగ్గు పిండితోటి వంకీలు వంకీలుగ ముగ్గులేసి వాటి మధ్య చుక్కల ముగ్గులేసింది. బొగ్గులు రాజేసి [...]

Read Full Post »

2 ప్రతి పిల్లగాలి తెమ్మెరకు చిగురాకు వోలె చలించిపోయే హృదయం స్వామిది. ప్రతి చిన్న సంఘటనకు ‘అసంకల్పిత ప్రతీకారచర్య’ వోలె స్పందించే హృదయం స్వామికి ఎక్కడి నుండి వచ్చింది? బహుశా పాలు తాగే పసిడి ప్రాయంలోనే స్వామికి ఆ గుణం అమ్మ ఒడిలనే అబ్బిందేమొ! * * * అమ్మ పక్కల వెచ్చగ నిద్రపోతున్న స్వామి కళ్లు తెరిచినాడు. అమ్మ చీరె కొంగు వాడి ముఖంపై పడి ఉక్కిరిబిక్కిరై కాళ్లు చేతులు తసబిసా కొట్టుకున్నడు. హమ్మయ్య కొంగు [...]

Read Full Post »

Dear Friends, Telangana History Society (THS ) is bringing out a book titled “1969 Telangana Movement-Historical Documents” a 450 page book. We have collected valuable and precious documents published during 1969-73 which include booklets, essays, Leaflets, editorials of magazines published during the agitation, rare photographs of movement and martyers. It is gigantic work we have [...]

Read Full Post »

2005 జూన్‌ 10 శుక్రవారం. మధ్యాహ్నసమయం. మక్కా మసీదుల నమాజ్‌లు చదువుతున్న సమయం. నాలుగు వందల సంవత్సరాల నగరచరిత్రకు ప్రత్యక్షసాక్షిగ, ప్రథమసాక్షిగ నిలుచున్న ‘చార్‌మినార్‌’. ‘చార్‌మినార్‌’కు ఎదురుంగ లార్డ్‌ బజార్‌ సందు మలుపుల ‘ఇక్బాల్‌’ హోటల్ల స్వామి. కాలం శూలం దాడికి గురి కాక అట్లనే నిలుచున్న నైజాం కాలంనాటి అతి పురాతన ఇక్బాల్‌ హోటల్‌. అండ్ల ఎంతసేపట్నుంచి కూచున్నడో ఆయనకే తెలుస్తలేదు. చాయ్‌ల మీద చాయ్‌లు తాగుకుంట ఎదురుంగ నిలబడ్డ ‘జిగ్రీ దోస్త్‌ చార్‌మినార్‌’తోటి అంతులేని [...]

Read Full Post »

పురాతన హైద్రాబాద్‌ నగర సంస్కృతీ సంప్రదాయాలను ప్రేమించేవారందరి తరఫున ఈ నవల రాసినాను. హైద్రాబాద్‌ గురించి చర్చ జరుగుతున్న ఈ సందర్భంలో ఒక కర్తవ్యంగ ఒక బాధ్యతగ ఈ నవల రాసినాను. చరిత్ర రథచక్రాలు ముందుకు పోవడంలో నా వంతు ప్రయత్నమే ఈ నవల. ఢిల్లీ, లక్నో నగరాలకు సంబంధించి బోలెడంత సాహిత్యం అనేక భాషలలో వచ్చింది. ఆ రెండు నగరాలకు ధీటైన, సమవుజ్జీ నగరమైన హైద్రాబాద్‌ నగరం గురించి ముఖ్యంగా తెలుగులో కొన్ని కథలు, రెండు [...]

Read Full Post »

”బిష్ణు అజ్‌ నై చూఁ హికాయత్‌ మీకునద్‌” ”పిల్లనగ్రోవి ఏదో కథ చెప్తున్నది. విను.” అంటూ జగత్ప్రసిద్ధమైన తన మస్నవీ కథలు చెప్పటం మొదలు పెట్టినాడు మోలానా రూమీ. వెదురుపొదలోంచి వేరు చేయబడిన వెదురుముక్క మూగగా పడి వున్నది. ఉలుకదు – పలుకదు. ఎవరైనా పలికించాలని ఊదితే బర్‌ – బర్‌ అనే సవ్వడే కాని ఒక్క సుస్వరం వెలువడదు. అన్నీ అపస్వరాలే.

Read Full Post »

Managed by Discover Telangana Inc., a registered nonprofit organization in USA.

All opinions and views expressed by third party content providers and shown here as preview are not that of Discover Telangana.

If you find any Content that is infringing, libelous, defamatory, obscene, abusive, offensive or otherwise violation of copyright law, alert us by emailing us at discover.telangana(at)gmail.com