Feed on
Posts
Comments

Monthly Archive for December, 2009

9 టాంగు టంగు, టాంగు టంగు – చిట్కుం చిట్కుం రకరకాల సమ్మెట పోట్లు. కర్వాయిలకు సర్వలను, చెంబులను దూర్చి సుత్తెతోటి మట్నగొట్టే చప్పుళ్లు. పొగరతోటి రంధ్రాలు చేస్తున్న ధ్వనులు. సుత్తి, డాకలి, కొరడు, రకరకాల పట్టకారుల సంగీత నాదాలు. సికింద్రాబాద్‌ కంచరి బస్తీల ఆ ‘బాడా’లో శ్రామిక జనజీవన సౌందర్య సంగీతం. శ్రమతో, అద్భుత కళానైపుణ్యంతోటి సృష్టించబడుతున్న గంగాళాలు, తాంభాళాలు, కొప్పెరలు, నీళ్లు కాగబెట్టుకునే బైలర్లు, బిందెలు, చెంబులు, తలెలు, పాన్‌దాన్‌లు – ఒగల్‌దాన్లు. అదొక [...]

Read Full Post »

8 స్వామి ఇంటికి చేరుకొనేసరికి ఇంట్ల ‘భూకంపం’ వచ్చినంత పరిస్థితిని గమనించాడు. క్రిందటి రాత్రి స్వామి ఇంటికి రాకపోయేసరికి ఇల్లంత అతలాకుతలం అయిపోయింది. పోలీసులు అరెస్టు చేసి జైల్ల పడేసినారేమో, కాకపోతే ఏదైనా టక్కర్‌ అయ్యి దెబ్బలు తగిలి దవాఖాన్ల పడిండేమో అని అమ్మ ఏడుపులు. అరుపులు. నెత్తి కొట్టుకొని క్రింద నేలపై పడిపోయింది. స్వామి గురించి భయమేందోగని బాపుకు అమ్మను సముదాయించడమే కష్టమైపోయింది. ‘నా కొడుకును సక్కగ ఇంటికి తీసుకు రాకపోతివో నీ ముందే నా [...]

Read Full Post »

పరిష్కారం ఏదైనా ప్రజలే గెలవాలి రొమాంటిక్‌ రంగు పులమడం అర్థరహితం సమస్య పట్ల అవగాహనా, భావోద్వేగాలకు లోనుగాకుండా తార్కికంగానూ దూరదృష్టితోనూ పరిష్కారం ఆలోచించగల వివేచనా కనిపించడం లేదు. ‘సమైక్యాంధ్ర’ బోలు నినాదం. ప్రత్యేక తెలంగాణ అంత తేలిగ్గా ఇవ్వరన్న నమ్మకంతో ఇన్నాళ్లూ అందుకు మద్దతు పలికిన రాజకీయ పార్టీలూ, ఉద్యమం జరుగుతున్నన్నాళ్లూ చోద్యం చూస్తూన్న ఇతర ప్రాంత ప్రజలూ ఇప్పుడు సమైక్యాంధ్ర అంటూ గొంతు చించుకోవడం విచిత్రం. Read Completely >>

Read Full Post »

7 ఆ రోజు పొద్దుపొద్దున్నే స్వామి ఇంకా నిద్ర లేవకముందే గోపి సైకిలేసుకుని, చెమటలు కారంగ, దమ్ములు పోసుకుంట శాలీబండాకు వచ్చినాడు. శాలీబండా చడావ్‌ మీద సైకిల్‌ తొక్కడమంటే మజాక్‌ కాదు. కాళ్ల పిక్కలల్ల మస్తుగ బలం ఉండాలె. శరీరానికి తాఖత్‌ గావాలె. కలేజాల ఖువ్వత్‌ ఉండాలె. అమ్మ వాడిని దివాన్‌ఖానాల ఉన్న ఆరామ్‌ కుర్చీల కూచుండబెట్టి కాశీ నుండి తెచ్చిన రాగిచెంబుల చల్లటి మంచి నీళ్లు, గుండ్రటి తెల్లటి కోపుల పొగలు గక్కే గరం గరం [...]

Read Full Post »

6 జనవరి ఇరవై నాలుగున సదాశివపేటల పోలీసులు కాల్పులు జరిపినారు. పద్నాలుగు మందికి దెబ్బలు తగిలినాయి. ఆ కాల్పులలో శంకర్‌ అనే పదిహేడు సంవత్సరాల యువకుడు మరణించినాడు. 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమంల శంకర్‌ తొలి అమరవీరుడు. శంకర్‌ అంత్యక్రియలలో మూడు వేల మంది విద్యార్థులు పాల్గొన్నరు. మిగిలిన క్షతగాత్రులందరినీ సికింద్రాబాదులోని గాంధీ దవాఖానాకు తరలించినారు. అక్కడ వాళ్లు కొసప్రాణాలతో మృత్యువుతో పోరాటం చేస్తున్నరు. శంకర్‌ సంస్మరణ సభ ఆ రోజు హైద్రాబాద్‌ల ఆర్ట్స్‌ కాలేజీ ముందు [...]

Read Full Post »

- అందెశ్రీ [Audio clip: view full post to listen] జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లీ నీరాజనం పది జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ ॥జయ జయహే॥

Read Full Post »

అమరుడు కాసోజు శ్రీకాంత్ అమర్ హై ! YouTube link of martyr Kasoju Srikanths Funeral at Gunpark, Hyderabad Picasa Photos link of martyr Kasoju Srikanths Funeral శ్రీకాంత్ అమర్ హై !

Read Full Post »

తెలంగాణా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గన్ పార్క్ వద్ద మూడో రోజు వికలాంగుల హక్కుల వేదిక వారి నిరాహార దీక్ష గన్ పార్క్ వద్ద మంత్రి శ్రీధర్ బాబు శవయాత్ర చేసి దిష్టిబొమ్మ దగ్ధం చేసిన ఎబివీపి కార్యకర్తలు కాసోజు శ్రీకాంత్ భౌతిక కాయం పోస్ట్ మార్టం కొరకు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు

Read Full Post »

-ముస్కు రాము జోహార్ శ్రీకాంతన్నా !! తెలంగాణ నేల పై జన్మించిన ఓ పులిబిడ్డ ఆఖరి జంగ్ లో అమ్మ కోసం బలి దానం చేసి నింగి కెగసి ప్రకాశించే తారావయ్యావా ! || జోహార్ శ్రీకాంతన్నా…||

Read Full Post »

జాతీయ రహదారి పై విద్యార్ధుల రాస్తారోకో వరంగల్ జిల్లాలో సీఎం దిష్టిబొమ్మ దగ్ధం వరంగల్ లో వికలాంగుల దినోత్సవం సందర్భంగా వికలాంగుల ధర్నా వరంగల్ జిల్లా ములుగు సెంటర్లో కాలేజీ విద్యార్ధుల భారీ ర్యాలీ వరంగల్ లో కాకతీయ మెడికల్ కాలేజీ విద్యార్ధుల భారీ ర్యాలీ

Read Full Post »

- సిద్ధార్థ పాములపర్తి ఉవ్వెత్తున ఎగిసింది ఉద్యమం మల్లి చూడు విప్లవ చిరు జల్లుల్లు వీధి వీధిలల్ల జూడు ||ఉవ్వెత్తున|| రాజ్యాంగపు హక్కులుతో రాచరికం తిక్క కుదిరే ప్రజాస్వామ్య గర్జనకు భూస్వాముల గుండెలదిరే

Read Full Post »

- సిద్ధార్థ పాములపర్తి క్రూర శక్తుల కృత్రిమ హింసకు బలి కావొద్దు అరవై తొమ్మిది ఆవేదనలు మల్లి రావొద్దు రక్తపుబొట్లను నరముల లోనే ఉడకనియ్యి విద్యాలయములో వీధిలో వాడలో కారనియ్యకు!

Read Full Post »

Managed by Discover Telangana Inc., a registered nonprofit organization in USA.

All opinions and views expressed by third party content providers and shown here as preview are not that of Discover Telangana.

If you find any Content that is infringing, libelous, defamatory, obscene, abusive, offensive or otherwise violation of copyright law, alert us by emailing us at discover.telangana(at)gmail.com