ధర్మ పోరాటం
డిసంబర్ 1st, 2009 by డిస్కవర్ తెలంగాణ
- సిద్ధార్థ పాములపర్తి
క్రూర శక్తుల కృత్రిమ హింసకు బలి కావొద్దు
అరవై తొమ్మిది ఆవేదనలు మల్లి రావొద్దు
రక్తపుబొట్లను నరముల లోనే ఉడకనియ్యి
విద్యాలయములో వీధిలో వాడలో కారనియ్యకు!
విధ్వంసాలు వీపరీతాలకు దారి తీయకు
శాంతియుతంగా అహింసతోనే సాగించాలే ఈ పోరు.
ఆవేశాలు హద్దులు దాటితే ఆలోచించే తెలివి ఉండదు
గళమొక్క పాట అయితే వినిపించేది కీచు గొంతులే
కలిసి కట్టుగా అందరు ఒకటిగా ముందుకుపోదాం.
విద్యార్ధులు విప్లవ శంఖంతో పురుడు పోసిన ఉద్యమమిది
ఉద్యోగులు తమ కలాలు దింపి ఊపిరూదిన ఉద్యమమిది
కుట్ర కుతంత్రాల దొంగ దౌర్జన్యం ఇగ సాగదు
తెలంగాణా వచ్చేవరకు ఈ ధర్మ పోరాటం ఆగదు
-
తెలంగాణా పోరాటంలో తమ ప్రాణాలను పణంగా పెట్టిన విద్యార్థులు శ్రీకాంత్, భుక్య ప్రవీణ్, పృథ్వీ రాజ్, ఆయువు కోల్పోయిన కానిస్టేబుల్ కిష్టయ్యలకు అంకితంగా ఈ చిన్న కవిత. ఉస్మానియా, కాకతీయ, ఇతర విశ్వవిద్యాలలో, కళాశాలల్లో ఉద్యమబాట పట్టిన విద్యార్థులకు ఈ కవిత్వం అంకితం. 1969 లో కోల్పోయిన విలువైన ప్రాణాలు, ఈ ఉద్యమంలో కోల్పోవద్దు. అహింస తోనే పోరాటం సాగాలే అనే ఉద్దేశ్యంతో రాసిన పంక్తులు ఇవి.




సిద్దార్థ,
శాన మంచిగుంది. మనండ్లమనము ఒక్క తాటిగుండి పోరాడుదాం
తెలంగాణోళ్ళ గుండెల్లో రగులుతున్న అగ్నిహోత్రాలను అదుపులో పెట్టుకుని శాంతీయుతంగని ఉద్యమం సాగడానికుపయోగపడే పంక్తులివి.
శ్రీధర్ రాజు - చికాగో
కవిత చాలా బాగుంది.జయ్ తెలంగాణా జయ్ జయ్ తెలంగాణా
అలి
sridhar anna, ali bhai, thank you very much! Jai Telangana, Jai Jai Telangana.