దేనికైనా సిద్ధమే
డిసంబర్ 2nd, 2009 by డిస్కవర్ తెలంగాణ
- సిద్ధార్థ పాములపర్తి
ఉవ్వెత్తున ఎగిసింది ఉద్యమం మల్లి చూడు
విప్లవ చిరు జల్లుల్లు వీధి వీధిలల్ల జూడు
||ఉవ్వెత్తున||
రాజ్యాంగపు హక్కులుతో రాచరికం తిక్క కుదిరే
ప్రజాస్వామ్య గర్జనకు భూస్వాముల గుండెలదిరే
మ్రోగుతున్న డప్పులది ఆగదింక చప్పుడూ
వర్నకులాలకతీతంగా వర్ధమానమిప్పుడూ
||ఉవ్వెత్తున||
అమరవీరుల ఆత్మత్యాగం రక్తమై ఉడుకుతుంది
సత్యాగ్రాహమ్ము తోటి పల్లె నడుం బిగుస్తుంది
సాగుతున్న సమ్మెలతో పట్నం నిలబడ్డది
జిల్ల జిల్లల జనం నిద్రలేచి తిరగబడ్డది
||ఉవ్వెత్తున||
విద్యార్ధుల విజ్ఞానపు విద్ధ్యుత్తే ఇంధనమై
రైతన్నల కన్నీళ్ళే మండే అగ్గితునకలై
కార్మికుల కష్టాలే కదులుతున్న చక్రాలై
ఉరుకుతుంది బండి మనది ఆపేవాళ్లింక ఎవరు?
||ఉవ్వెత్తున||
తెలంగాణా నినాదాలు నింగిదాక వినబడాలే
తెలంగాణా జెండాలు జగమంత కనబడాలే
తెలంగాణా వచ్చే దాక దేనికైనా సిద్ధమే
తెలంగాణా వచ్చే దాక దేనికైనా సిద్ధమే
||తెలంగాణా||




దిక్కులు పెక్కటిల్లేలా అదిరింది నీ నినాదం
కంచు కోటలు ప్రకంపించేల దద్దరిల్లింది తెలంగాణం
అప్రజాస్వామ్యపు కోఱల్లో అణచివేయబడ్డ న్యాయం
అమాయకులపై వలసపాలకుల్లో అక్కసుగక్కిన దిక్కారం
ఉత్తండమారుతంలా తిరగబడ్డ తెలంగాణ జనం
ప్రతిఘటించి ప్రళయతాండవమాడే మధుర క్షణం
కాదేది ప్రళయ జ్వాల రగిల్చేందుకు అనర్హం
శాంతింపజేసే ప్రయత్న ఘట్టాలు శూన్యం
గుర్తించండి దాగివున్న అసలుసిసలైన ఘోర కలికం
ఇంకెందుకీ ముసుగుల వెనక దాపరికం
దిక్కులు పెక్కటిల్లేలా అదిరింది నీ నినాదలు
జై నల్గొండ జై జై నల్గొండ
నాకు ప్రత్యేక నల్గొండ కావలె
మీరు ఇలా సిద్ధమే సిద్ధమే అంటే ఎవడైనా ఇంకో పది సంస్త్రాలు వరకు సిద్ధమే నా కాబట్టి తెలంగాణా బిడ్డ మాటలు ఆపు మనమే గెలిపించము ఐ ప్రబుత్వాన్ని మరి అది మనకే నచ్చలేదా అంటే వోటు వేసినప్పుడు ఏమి చేసావు
దేనికైనా సిద్దమే అన్నావ్ కదా ఓ 20 ఏళ్ళు ఆగరాదే
ఓటు వేసేప్పుడు ఏ నాయకుడు జెప్పలే “తెలంగాణ ఇవ్వం” అని
ఒక్కడి కైనా ధైర్యముందా చెప్పడానికి.
“ఒక జాతి పోరాటాన్ని గౌరవించలేనివాడు ఐక్యతకు ఎప్పుడూ నాంది పలుకలేడు” — జూలూరు గౌరీశంకర్
“నవంబర్ ఒకటి గడ్లె కలిపిన రోజు యాదికస్తే యాన్నో కాల్సుకస్తది” — అన్నవరం దేవేందర్
“కళలకే పుట్టుక నా తెలంగాణా, నా తెలంగాణా
పాటగాచిన పట్టు నా తెలంగాణా , నా తెలంగాణా” — నందిని సిధా రెడ్డి
“వీర తెలంగాణ నాది వేరు తెలంగాణ నాది” — కాళోజి
“లేకే రహేంగే లేకే రహెంగే తెలంగాణా లేకే రహేంగే… లాఠీ గోలీ ఖాయింగే తెలంగాణా లాయేంగే !” — సలాం హైద్రాబాద్
“యాసను భాష ఎక్కిరిచ్చింది తెలుగును చూసి ఇంగ్లీష్ ఇకిలిచ్చింది” — అన్నవరం దేవేందర్
“ఇక్కడి ప్రజలకు ఇప్పటి ప్రజాస్వామ్యం మీద నమ్మకం పోయింది” — శ్రీధర్ రాజు
“గలీజొళ్ళం లుచాగాల్లం బేవార్సుగాల్లం మమ్మల్ని వదిలి వెళ్ళండి మాతో మీకెందుకు స్నేహం మా మూతులు ఎందుకునాకుతాండ్రు” - జనార్ధన్
“నా గొడవ ఆ పౌరుని స్థితి
నేనంటే ఒక వోటరు
నా గొడవ వోటేసేవాడు
నేనంటే తిరుగుబాటు దారు
నా గొడవ మన తిరుగుబాటు” — కాళోజి