Feed on
Posts
Comments

-ముస్కు రాము

జోహార్ శ్రీకాంతన్నా !!
తెలంగాణ నేల పై జన్మించిన ఓ పులిబిడ్డ
ఆఖరి జంగ్ లో అమ్మ కోసం బలి దానం చేసి
నింగి కెగసి ప్రకాశించే తారావయ్యావా !

|| జోహార్ శ్రీకాంతన్నా…||

అగ్నికి అహుతి అవుతూ జంకు బోంకు లేకుండా
తెలంగాణ కోసమని తెగువ చూపి
అమర వీరుడ వయ్యావా !!

|| జోహార్ శ్రీకాంతన్నా…||

నాల్గు కోట్ల గంజి బతుకుల ఆకాంక్ష సాకారానికి
బలి పీట మేక్కి కన్న వాళ్ళని త్యాగ మయులను చేశావా !!

|| జోహార్ శ్రీకాంతన్నా…||

కాలిన శరీరంతో మైకుల ముందు
జై తెలంగాణ అని చెప్పిన ధీరుడవయ్యావా!!

|| జోహార్ శ్రీకాంతన్నా…||

తెలంగాణ అమరవీరుల చరిత్ర పుటల్లోకెక్కి
మాకు కన్నీళ్లే మిగిల్చి వెళ్ళావా!!

|| జోహార్ శ్రీకాంతన్నా…||

తెలంగాణ లడాయికి ఊపిరిలుదె
“ఉస్మానియా” సిపాయిలకు
శక్తినిచ్చే యుక్తిడివయ్యావా!
తెలంగాణ తల్లి విముక్తికి బలి ధానుడవయ్యావా!!

|| జోహార్ శ్రీకాంతన్నా…||

నీ త్యాగం మేం మరవం జన్మాంతం
నీవు లేని ఈ ప్రపంచం మాకు ఏకాంతం
నీ రూపం భావి తెలంగాణకు ప్రతి రూపం!
అన్నా..!నిన్ను కన్న అవ్వ,అయ్యాకు
ఆర్పిస్తున్నాం శిరస్సు వంచి పాదాభివందనం!!!

|| జోహార్ శ్రీకాంతన్నా…||

స్వర్గంలో వీరునివై!నింగిలో మెరిసే తారవై!!
మా పోరులో శక్తీవై!మా అడుగుల్లో అడుగువై!
నీ జ్ఞాపకమె మాకు ఉపిరివయ్యావా!!

|| జోహార్ శ్రీకాంతన్నా…||

గమ్యం చేరే వరకు ఆపం మన పోరు
ఉప్పెనలా లేస్తున్న తెలంగాణలోని ఊరు ఊరు
అందుకో మేము అర్పిస్తున్న శొకతప్త ఆశ్రు నివాళి..!!

|| జోహార్ శ్రీకాంతన్నా…||

అమర హై శ్రీకాంతన్నా!
జై తెలంగాణ!!
జై జై తెలంగాణ!!!

… అమరవీరుడు కాసోజు శ్రీకాంత్ కోసం

(జాగో తెలంగాణ బ్లాగ్ సౌజన్యం తోటి)

5 Responses to “జోహార్ శ్రీకాంతన్నా !!”

  1. 1
    Raj Says:

    అమర వీరా నీ త్యాగమ్ వృధా కాదు….. అతి పెద్ద సాహసమ్ చేశావు….

    మేమున్నాము…. మరవము నీ త్యాగము…

    జరగాలి పోరాటమ్ … రావాలి తెలంగాణ…. పోవాలి తెలియని బానిసత్వమ్

    కాసోజు శ్రీకాంత్ అమర్ రహే …

    జై తెలంగాణ…జై జై తెలంగాణ

  2. 2
    Mohan Says:

    జోహార్ శ్రీకాంతన్న

  3. 3
    pindiga srinivas Says:

    వీరుల అమరత్వం సాక్షిగా
    సాదిస్తాం తెలంగాణ
    జై తెలంగాణ…జై జై తెలంగాణ

  4. 4
    Ramulu Says:

    ఈనాటి తెలంగాణ ఉద్యమంలో 400 మందికంటే ఎక్కువ మందే ఆత్మార్పణ చేశారు. ఐనా తెలంగాణ ఇంకా రాలేదు.ఇంకో 400 మంది బలిదానానికి సిద్ధ పడితే వస్తుందన్న గ్యారంటీలఏదు.తెలంగాణ ఉద్యమకారులు తాము బలికాకుండా అడ్డుతగులుతున్నవాళ్ళనే తన్ని తగలెయ్యాలి.అడ్డుతగిలేవాళ్ళు తెలంగాణావాళ్ళే ఐనా వదులొద్దు.

  5. 5
    raj Says:

    పువ్వు పువ్వు కో వర్ణం . ప్రతి వర్ణం సువర్ణం .అన్ని రంగులు కలగలసిన బతుకమ్మ …తెలంగాణ కొంగు బంగారం. బతుకును అమ్మగా బావించి, పూలలో, ఆకుల్లో, నీటిలో, ప్రకృతిలో ఆమెను దర్శించి తొమ్మిదిరోజులపాటు ఆటపాటలతో కొలవడం తెలంగాణలో మాత్రమే ఉన్న సంప్రదాయం. బతుకమ్మ పాటలో సామూహిక గానం ఉంది. సంగీతం ఉంది. నృత్యం ఉంది. జీవితం ఉంది .సంతోషం ఉంది. విషాదము ఉంది. ఆ పాటలతో తెలంగాణ స్త్రీలు తమ తతుకును పాడుకుంటరు. తమ ఆనందాలను విషాదాలను తవ్వి పోసుకుంటరు. ఏడేడు తరాల కథలను వినిపిస్తారు. ప్రకృతి వైపరిత్యపు కడగండ్లను సామూహికంగా శ్రుతి చేసుకుంటారు. జీవితం లో సంతోషాన్ని …పిల్లల ముద్దు ముచ్చట్లను… పంటచేల వయ్యారాలను.. వీరుల త్యాగాలను.. ధేవతల దయను కరుననూ బతుకమ్మ పాటలలో కలగలిపి తలపోసుకుంటరు …

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Managed by Discover Telangana Inc., a registered nonprofit organization in USA.

All opinions and views expressed by third party content providers and shown here as preview are not that of Discover Telangana.

If you find any Content that is infringing, libelous, defamatory, obscene, abusive, offensive or otherwise violation of copyright law, alert us by emailing us at discover.telangana(at)gmail.com