Posted in తెలుగు, సలాం హైద్రాబాద్ on Jan 25th, 2010
13 1969 జూన్ నెలను తెలుగు పంచాంగం ‘రక్తాక్షిమాసం’ అని పేర్కొంది. ఆ పేరుకు తగ్గట్టు నిజంగనే తెలంగాణాల ఆ నెల అంతా రక్తం ప్రవహించింది. ఆ రక్తాక్షి మాసమంత పోలీసుల కాల్పులతోటి, తెలంగాణా ప్రజల బలిదానాలతోటి దద్ధరిల్లిపోయింది. జూన్ రెండవ తేదీ సోమవారం నుండి నాలుగు రోజులు కొనసాగిన అల్లర్లు, మారణకాండల ప్రభుత్వ లెక్కల ప్రకారమే నగరంల 30 మందికి పైగా మరణించినారు. వందలాది మందికి గాయాలైనాయి. అండ్ల కొందరు శాశ్వతంగ అవిటివారైనారు. అనధికార లెక్కలు [...]
Read Full Post »
Posted in తెలుగు, సలాం హైద్రాబాద్ on Jan 18th, 2010
12 అట్ల ఆ డిమాండ్స్ డే – మే డే ఒక బ్లాక్ డేగ నగర చరిత్రల నిలిచిపోయింది. తెల్లారి మే రెండున జంటనగరాలల్ల సంపూర్ణ హర్తాల్, బంద్ జరిగింది. ఆ రోజు కూడా మళ్లీ అల్లర్లు జరిగినై. ఆ రోజు రాత్రి సికింద్రాబాద్‌ల జేమ్స్ స్ట్రీట్ నుండి ఓల్డ్ ఘాస్‌మండీకి పోతున్న పోలీసు వ్యాన్ మీద ఇద్దరు యువకులు బాంబులు విసిరితే ఒక జవాను అక్కడికక్కడే మరణించినాడు. వ్యాన్‌ల ఉన్న మిగిలిన వారు గాయపడినారు. నరేందర్ [...]
Read Full Post »
Posted in తెలుగు, సలాం హైద్రాబాద్ on Jan 11th, 2010
11 “ఈ చిలుక పలుకదేమీ మనతో మాటాడదేమీ మనతో నిన్న మొన్నటి దాకా ఈ చిలుక మాటలాడెను బాగా” అర్ధరాత్రి దాటింది. నట్టింట్ల జెఫ్రీ శవం. అనంతశయనం. అతి దీర్ఘమైన పెను నిద్దుర. పెను విశ్రాంతిలకు పోయిన జోసెఫ్ మార్క్వెజ్ జెఫ్రీ కండ్లు తెరుచుకునే ఉన్నయి – రాబోయే తెలంగాణా కోసం నిరీక్షిస్తున్నట్లు. ప్రాణం పోయిన కొద్దిసేపట్లనే కనురెప్పల్ని మూయాలంట. లేకపోతే కండ్లు అట్లనే తెరుచుకొని ఉంటవని ఎవరో ముసలమ్మ అంటుంది.
Read Full Post »
Posted in తెలుగు, సలాం హైద్రాబాద్ on Jan 4th, 2010
10 ఆ రోజు మేడే. చికాగో వీధులల్ల తమ హక్కుల కోసం కార్మికులు రక్తం ధారపోసిన రోజు. తమ రక్తవర్ణంతోటి అరుణపతాకాన్ని సృష్టించిన రోజు. ఆ రోజుననే హైద్రాబాద్, సికింద్రాబాద్ జంటనగరాలల్ల తెలంగాణా ప్రజా సమితి ‘డిమాండ్ డే’ కోసం పిలుపిచ్చిన రోజు. తెలంగాణా కోసం ఊరేగింపు జరుపవలసిన రోజు. స్వామి ఇక్బాల్ హోటల్ల కూచున్నడు. “బోలో సాబ్ క్యా హుకూం హై” సర్వర్ పలకరింపుకు ఉలికిపడి ఈ లోకంలకు వచ్చినాడు స్వామి. నహారి, ఖుల్చా, పాయారోటీ, [...]
Read Full Post »