Posted in తెలుగు, సలాం హైద్రాబాద్ on Feb 22nd, 2010
17 రెసిడెన్సీ నుండి స్వామి మళ్లీ నడక సాగించినాడు. ఆంధ్రా బ్యాంకును దాటి సుల్తాన్ బజార్ లేన్‌ల నుండి నడుస్తున్నడు. కాలు పెట్ట సందులేదు. అన్నీ ఫుట్‌పాత్ దుకాణాలు నడిచొచ్చి నడిరోడ్డును ఆక్రమించుకున్నై. సైకిళ్లు, రిక్షాలు పద్మవ్యూహంల అభిమన్యుడిలాగ సందు చేసుకొని ముందుకు దూసుకపోతున్నై. సకలం సమస్త సామానులు సరసమైన ధరలకే అక్కడ అమ్మబడును. పేదోళ్ల షాపింగు సెంటర్ మదీనా బజార్ లేదా జుమ్మెరాత్ బజార్. దండోళ్ల షాపింగు సెంటర్ ఆబిడ్స్.
Read Full Post »
Posted in తెలుగు, సలాం హైద్రాబాద్ on Feb 15th, 2010
16 కాలేజీలు తెరిచినారు. ఉద్యమం ప్రారంభం అయ్యేనాటికి, ఇంకా మూడు నెలల సిలబస్ పూర్తి కావాల్సి ఉండేది. ఇప్పుడు ఒక నెలలనే హడావిడిగ సిలబస్ కంప్లీట్ చేసి డిసెంబరు నెలల పరీక్షలు నిర్వహించినారు. ఎంత చేసినా అప్పటికే ఒక విద్యా సంవత్సరం నష్టం అయ్యింది. ప్రాణత్యాగాలు కష్టనష్టాలతో పాటు ఇది కూడా ఒక త్యాగమే. విద్యార్థుల జీవితంల విలువైన ఒక సంవత్సరం వృధా కావటం వలన జీవితంల అన్ని రంగాలల్ల వారు ఒక సంవత్సరం వెనుకబడిపోయినారు. స్వామి [...]
Read Full Post »
Posted in తెలుగు, సలాం హైద్రాబాద్ on Feb 8th, 2010
15 1969 జూన్ 27న ఉదయం 9 గంటలకు ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి తన పదవికి రాజీనామ చేసినాడు. ఆ రాజీనామా లేఖను రాష్ట్ర గవర్నర్‌కు పంపకుండ ఢిల్లీలోని కాంగ్రెస్ అధ్యక్షుడు నిజలింగప్పకు పంపినాడు. అదీ ఆయన కుటిల నీతి. ఆరు నెలల సుదీర్ఘ తెలంగాణా ఉద్యమ పోరాట ఫలితమే ముఖ్యమంత్రి రాజీనామా. ఇది తెలంగాణ ప్రజల నైతిక విజయం.
Read Full Post »
Posted in తెలుగు, సలాం హైద్రాబాద్ on Feb 1st, 2010
14 ఏ బొంబై కా తమాషా దేఖో ఏ చార్ దిన్‌కా తమాషా దేఖో ఏ కల్‌కత్తా కాళీ మాతా దేఖో ఏ బెజ్వాడా కనకదుర్గా దేఖో ఏ చారానా తమాషా దేఖో ఏ బార్ బార్ తమాషా దేఖో ఏ బొంబై కా తమాషా దేఖో స్వామి తన మిత్రబృందంతోటి ఆ బొంబై కా తమాషా ముందు నిలబడి ఉన్నడు.
Read Full Post »