Feed on
Posts
Comments

We’d like to share with our readers on this ‘Telangana Veelinam Roju’ 17th September 2008 that ‘Discover Telangana’ is now registered as a non-profit organization in the United States of America as ‘Discover Telangana Incorporated‘ (Tax-ID # 26-3320796). We do not have a Tax exempt status yet, this procedure may take about an year, the readers will be duly notified once we obtain the status.

We’ll soon be furnishing you the details of the boards, by-laws and the activities ‘Discover Telangana Incorporated‘ (or DT Inc.) is planning. We encourage the readers to share their suggestions & participate actively in our future endeavors.

* * *

తెలంగాణ భాష గురించి మాట్లాడుకుంట ప్రజాకవి కాళోజి, “ఆనాడు రాఘవాచారి, తెలంగాణలో కవులే లేరన్నడు గాని ఇవ్వాళ తెలంగాణల తెలుగే లేదంటున్నరు, మళ్ళిపుడు ప్రామాణిక భాష అంటున్నరు. ఏది ప్రామాణికం? ఏది వ్యవహారం? 23 జిల్లలల్ల ఎవని వ్యవహారం వానిదే. రెండున్నర జిల్లాల భాషనే అందరు రాయలన్నదే శాసనం. తప్పంటున్న నేను. తెలంగాణ మాండలీకం అనుడు తప్పు, తెలంగాణ భాష అనాలె. ఎవని యాసల, ఎవని భాషల వాడు రాయాలె. తెలుస్తదా అన్నది లేనే లేదు. ఎంత గిచ్చుకున్నా, ఎంత రాసుక పూసుక తిరిగినా తెలంగాణలోని రచయితలకు, కవులకు కోస్తాల గుర్తింపులేదు. మన కవులను రచయితలను మనం గుర్తించి గౌరవించుకోవాలె”, అన్నడు.

శతాబ్దాలుగా అసమానతలకు గురి అయ్యి తెలంగాణ భాష, సాహిత్యం, సంస్కృతి ఎంత న్యూనతకు లోనయ్యిందో మనందరికీ ఎరుకనే.  తెలంగాణ ఆత్మగౌరవం కాపాడుకోవాలంటె జనంల చేతనం రావలె, అందుకే చాన మంది రచయితలు, కవులు, కళాకారులు  మస్తుగ పుస్తకాలు, కథలు, కవితలు, పాటలు రాస్తున్నరు. అవన్నీ వీలైనంత వరకు ఈ సైట్‌ల పెట్టనీకి ప్రయత్నం చేస్తం.

తెలంగాణల అసలు ఏం అయ్యిందో, ఇప్పుడేమయితుందో తెలుసుకోవాలని ప్రతి తెలంగాణ బిడ్డకు మనసుల మెదులుతనే ఉంటది. ఏమున్నా లేకున్నా ఆ పెద్ద పత్రికలోళ్ళు రాసిందే సదవాలె. వాళ్ళు రాసేదాంట్ల ఎంత నిజమున్నదో, లేదో ఎట్ల తెల్వాలె?

మనకు జరుగుతున్న అన్యాయాలని మనమే గొంతెత్తి చెప్పుదామని తెలంగాణ మీద ఉన్న ప్రేమ తోటి కొంత మంది పత్రికలు నడుపుతున్నరు.  కాని అవి అందరికి చేరుతలేవు. ఇంటర్‌నెట్‌ల పెడితే ఎంతో కొంత మందికి చేరుతయని మేము అనుకుంటున్నం. అందుకే ఈ సైట్ మొదలు పెడుతున్నం. మెల్లమెల్లగ పాత సంచికలన్నీ ఇక్కడ పొందుపరుస్తం.

అట్లనే తెలంగాణ భాష, సంస్కృతి, ప్రజల గురించి, తెలంగాణకు సంబంధించిన అన్ని విషయాల గురించి ఇక్కడ పొందుపరచాలన్నది మా ఆశ. అయితే ఈ పని ఏ ఒక్కరి తోటో సాధ్యమయ్యేది కాదు, దీనికి అందరి సాయం మాకు కావాలె. తెలంగాణకు సంబంధించి రచనలు గాని, ఎటువంటి విజ్ఞాన విశేషాలు గాని ఎవరు పంపినా ఈ సైట్ లో ఒక్క చోట పొందుపరుస్తం.

మన ఈ ‘డిస్కవర్ తెలంగాణ’ సైట్‌ను ‘తెలంగాణ విజ్ఞాన సర్వస్వంగా’ తీర్చిదిద్దనీకి అందరూ సాయ పడుతరు గదా?

Comments are closed.

Managed by Discover Telangana Inc., a registered nonprofit organization in USA.

All opinions and views expressed by third party content providers and shown here as preview are not that of Discover Telangana.

If you find any Content that is infringing, libelous, defamatory, obscene, abusive, offensive or otherwise violation of copyright law, alert us by emailing us at discover.telangana(at)gmail.com