Posted in తెలుగు, సలాం హైద్రాబాద్ on మార్చ్ 8th, 2010
19
తిరుగుబాటు వీరుడు తుర్రేబాజ్‌ఖాన్ జ్ఞాపకాల విషాదంతో స్వామి కోఠీ చౌరస్త నుండి బయలుదేరి బ్యాంక్ స్ట్రీట్‌ల ఉన్న ఫిరోజ్‌గాంధీ పార్క్‌లకు ప్రవేశించినాడు. నరేష్, వేణు ఇంక రాలేదు.
ఎదురుగ పిల్లలగుంపు. పదిపన్నెండు సంవత్సరాల మధ్యల ఉన్నరు. పచ్చగడ్డిల ఎగురుతున్నరు. కలకల నవ్వుతున్నరు. గాలికి కదిలే పువ్వుల మాదిరి త్రుళ్లుతున్నరు. రకరకాల ఆటలు ఆడుతున్నరు. గోలగోలగ అరుస్తున్నరు. చెమటలు కారుతున్న వాండ్ల ముఖాలల్ల మిలమిల మెరుస్తున్న కండ్లు. పకపక నవ్వుతుంటే తెల్లగ మెరుస్తున్న పండ్లు. స్వామికి వాళ్లను చూస్తుంటె ముచ్చటేసింది. […]
Read Full Post »
Posted in తెలుగు, సలాం హైద్రాబాద్ on మార్చ్ 1st, 2010
18
1857 జూన్ 13 మధ్యాహ్న సమయం.
జుహర్ నమాజుల కోసం మక్కా మసీదు ప్రాంగణంల అందరూ సమావేశమవుతున్నరు. కాని అందరి ముఖాలల్ల ప్రశాంతత కరువైంది. ఆందోళన, భయం అందర్నీ కమ్ముకొని ఉంది. దానికి కారణం మక్కా మసీదు గోడల మీద, తలుపుల మీద అంటించిన పెద్ద పెద్ద చేతిరాతల పోస్టర్లు. తెల్లని కాగితాల మీద ఆకుపచ్చ రంగుల రాతలు.
Read Full Post »
Posted in తెలుగు, సలాం హైద్రాబాద్ on ఫిబ్రవరి 22nd, 2010
17
రెసిడెన్సీ నుండి స్వామి మళ్లీ నడక సాగించినాడు. ఆంధ్రా బ్యాంకును దాటి సుల్తాన్ బజార్ లేన్‌ల నుండి నడుస్తున్నడు. కాలు పెట్ట సందులేదు. అన్నీ ఫుట్‌పాత్ దుకాణాలు నడిచొచ్చి నడిరోడ్డును ఆక్రమించుకున్నై. సైకిళ్లు, రిక్షాలు పద్మవ్యూహంల అభిమన్యుడిలాగ సందు చేసుకొని ముందుకు దూసుకపోతున్నై. సకలం సమస్త సామానులు సరసమైన ధరలకే అక్కడ అమ్మబడును. పేదోళ్ల షాపింగు సెంటర్ మదీనా బజార్ లేదా జుమ్మెరాత్ బజార్. దండోళ్ల షాపింగు సెంటర్ ఆబిడ్స్.
Read Full Post »
Posted in తెలుగు, సలాం హైద్రాబాద్ on ఫిబ్రవరి 15th, 2010
16
కాలేజీలు తెరిచినారు.
ఉద్యమం ప్రారంభం అయ్యేనాటికి, ఇంకా మూడు నెలల సిలబస్ పూర్తి కావాల్సి ఉండేది. ఇప్పుడు ఒక నెలలనే హడావిడిగ సిలబస్ కంప్లీట్ చేసి డిసెంబరు నెలల పరీక్షలు నిర్వహించినారు. ఎంత చేసినా అప్పటికే ఒక విద్యా సంవత్సరం నష్టం అయ్యింది. ప్రాణత్యాగాలు కష్టనష్టాలతో పాటు ఇది కూడా ఒక త్యాగమే. విద్యార్థుల జీవితంల విలువైన ఒక సంవత్సరం వృధా కావటం వలన జీవితంల అన్ని రంగాలల్ల వారు ఒక సంవత్సరం వెనుకబడిపోయినారు.
స్వామి మనస్సంతా కేంద్రీకరించి శ్రద్ధతో […]
Read Full Post »
Posted in తెలుగు, సలాం హైద్రాబాద్ on ఫిబ్రవరి 8th, 2010
15
1969 జూన్ 27న ఉదయం 9 గంటలకు ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి తన పదవికి రాజీనామ చేసినాడు. ఆ రాజీనామా లేఖను రాష్ట్ర గవర్నర్‌కు పంపకుండ ఢిల్లీలోని కాంగ్రెస్ అధ్యక్షుడు నిజలింగప్పకు పంపినాడు. అదీ ఆయన కుటిల నీతి.
ఆరు నెలల సుదీర్ఘ తెలంగాణా ఉద్యమ పోరాట ఫలితమే ముఖ్యమంత్రి రాజీనామా. ఇది తెలంగాణ ప్రజల నైతిక విజయం.
Read Full Post »
Posted in తెలుగు, సలాం హైద్రాబాద్ on ఫిబ్రవరి 1st, 2010
14
ఏ బొంబై కా తమాషా దేఖో
ఏ చార్ దిన్‌కా తమాషా దేఖో
ఏ కల్‌కత్తా కాళీ మాతా దేఖో
ఏ బెజ్వాడా కనకదుర్గా దేఖో
ఏ చారానా తమాషా దేఖో
ఏ బార్ బార్ తమాషా దేఖో
ఏ బొంబై కా తమాషా దేఖో
స్వామి తన మిత్రబృందంతోటి ఆ బొంబై కా తమాషా ముందు నిలబడి ఉన్నడు.
Read Full Post »
Posted in తెలుగు, సలాం హైద్రాబాద్ on జనవరి 25th, 2010
13
1969 జూన్ నెలను తెలుగు పంచాంగం ‘రక్తాక్షిమాసం’ అని పేర్కొంది. ఆ పేరుకు తగ్గట్టు నిజంగనే తెలంగాణాల ఆ నెల అంతా రక్తం ప్రవహించింది. ఆ రక్తాక్షి మాసమంత పోలీసుల కాల్పులతోటి, తెలంగాణా ప్రజల బలిదానాలతోటి దద్ధరిల్లిపోయింది. జూన్ రెండవ తేదీ సోమవారం నుండి నాలుగు రోజులు కొనసాగిన అల్లర్లు, మారణకాండల ప్రభుత్వ లెక్కల ప్రకారమే నగరంల 30 మందికి పైగా మరణించినారు. వందలాది మందికి గాయాలైనాయి. అండ్ల కొందరు శాశ్వతంగ అవిటివారైనారు. అనధికార లెక్కలు తెలుసుకుంటే […]
Read Full Post »
Posted in తెలుగు, సలాం హైద్రాబాద్ on జనవరి 18th, 2010
12
అట్ల ఆ డిమాండ్స్ డే - మే డే ఒక బ్లాక్ డేగ నగర చరిత్రల నిలిచిపోయింది. తెల్లారి మే రెండున జంటనగరాలల్ల సంపూర్ణ హర్తాల్, బంద్ జరిగింది. ఆ రోజు కూడా మళ్లీ అల్లర్లు జరిగినై. ఆ రోజు రాత్రి సికింద్రాబాద్‌ల జేమ్స్ స్ట్రీట్ నుండి ఓల్డ్ ఘాస్‌మండీకి పోతున్న పోలీసు వ్యాన్ మీద ఇద్దరు యువకులు బాంబులు విసిరితే ఒక జవాను అక్కడికక్కడే మరణించినాడు. వ్యాన్‌ల ఉన్న మిగిలిన వారు గాయపడినారు. నరేందర్ అనే […]
Read Full Post »
Posted in తెలుగు, సలాం హైద్రాబాద్ on జనవరి 11th, 2010
11
“ఈ చిలుక పలుకదేమీ మనతో
మాటాడదేమీ మనతో
నిన్న మొన్నటి దాకా ఈ చిలుక
మాటలాడెను బాగా”
అర్ధరాత్రి దాటింది. నట్టింట్ల జెఫ్రీ శవం. అనంతశయనం. అతి దీర్ఘమైన పెను నిద్దుర. పెను విశ్రాంతిలకు పోయిన జోసెఫ్ మార్క్వెజ్ జెఫ్రీ కండ్లు తెరుచుకునే ఉన్నయి - రాబోయే తెలంగాణా కోసం నిరీక్షిస్తున్నట్లు. ప్రాణం పోయిన కొద్దిసేపట్లనే కనురెప్పల్ని మూయాలంట. లేకపోతే కండ్లు అట్లనే తెరుచుకొని ఉంటవని ఎవరో ముసలమ్మ అంటుంది.
Read Full Post »
Posted in తెలుగు, సలాం హైద్రాబాద్ on జనవరి 4th, 2010
10
ఆ రోజు మేడే. చికాగో వీధులల్ల తమ హక్కుల కోసం కార్మికులు రక్తం ధారపోసిన రోజు. తమ రక్తవర్ణంతోటి అరుణపతాకాన్ని సృష్టించిన రోజు. ఆ రోజుననే హైద్రాబాద్, సికింద్రాబాద్ జంటనగరాలల్ల తెలంగాణా ప్రజా సమితి ‘డిమాండ్ డే’ కోసం పిలుపిచ్చిన రోజు. తెలంగాణా కోసం ఊరేగింపు జరుపవలసిన రోజు.
స్వామి ఇక్బాల్ హోటల్ల కూచున్నడు.
“బోలో సాబ్ క్యా హుకూం హై” సర్వర్ పలకరింపుకు ఉలికిపడి ఈ లోకంలకు వచ్చినాడు స్వామి.
నహారి, ఖుల్చా, పాయారోటీ, శీర్మాల్, బోటీ కబాబ్, ఖీమా, […]
Read Full Post »
Posted in తెలుగు, సలాం హైద్రాబాద్ on డిసంబర్ 28th, 2009
9
టాంగు టంగు, టాంగు టంగు - చిట్కుం చిట్కుం రకరకాల సమ్మెట పోట్లు. కర్వాయిలకు సర్వలను, చెంబులను దూర్చి సుత్తెతోటి మట్నగొట్టే చప్పుళ్లు. పొగరతోటి రంధ్రాలు చేస్తున్న ధ్వనులు. సుత్తి, డాకలి, కొరడు, రకరకాల పట్టకారుల సంగీత నాదాలు. సికింద్రాబాద్ కంచరి బస్తీల ఆ ‘బాడా’లో శ్రామిక జనజీవన సౌందర్య సంగీతం. శ్రమతో, అద్భుత కళానైపుణ్యంతోటి సృష్టించబడుతున్న గంగాళాలు, తాంభాళాలు, కొప్పెరలు, నీళ్లు కాగబెట్టుకునే బైలర్లు, బిందెలు, చెంబులు, తలెలు, పాన్‌దాన్‌లు - ఒగల్‌దాన్లు. అదొక ‘ఆర్టిసాన్స్’ […]
Read Full Post »
Posted in తెలుగు, సలాం హైద్రాబాద్ on డిసంబర్ 21st, 2009
8
స్వామి ఇంటికి చేరుకొనేసరికి ఇంట్ల ‘భూకంపం’ వచ్చినంత పరిస్థితిని గమనించాడు. క్రిందటి రాత్రి స్వామి ఇంటికి రాకపోయేసరికి ఇల్లంత అతలాకుతలం అయిపోయింది. పోలీసులు అరెస్టు చేసి జైల్ల పడేసినారేమో, కాకపోతే ఏదైనా టక్కర్ అయ్యి దెబ్బలు తగిలి దవాఖాన్ల పడిండేమో అని అమ్మ ఏడుపులు. అరుపులు. నెత్తి కొట్టుకొని క్రింద నేలపై పడిపోయింది. స్వామి గురించి భయమేందోగని బాపుకు అమ్మను సముదాయించడమే కష్టమైపోయింది. ‘నా కొడుకును సక్కగ ఇంటికి తీసుకు రాకపోతివో నీ ముందే నా ప్రాణమిస్త’ […]
Read Full Post »
Posted in తెలుగు, సలాం హైద్రాబాద్ on డిసంబర్ 14th, 2009
7
ఆ రోజు పొద్దుపొద్దున్నే స్వామి ఇంకా నిద్ర లేవకముందే గోపి సైకిలేసుకుని, చెమటలు కారంగ, దమ్ములు పోసుకుంట శాలీబండాకు వచ్చినాడు. శాలీబండా చడావ్ మీద సైకిల్ తొక్కడమంటే మజాక్ కాదు. కాళ్ల పిక్కలల్ల మస్తుగ బలం ఉండాలె. శరీరానికి తాఖత్ గావాలె. కలేజాల ఖువ్వత్ ఉండాలె. అమ్మ వాడిని దివాన్‌ఖానాల ఉన్న ఆరామ్ కుర్చీల కూచుండబెట్టి కాశీ నుండి తెచ్చిన రాగిచెంబుల చల్లటి మంచి నీళ్లు, గుండ్రటి తెల్లటి కోపుల పొగలు గక్కే గరం గరం ఛా […]
Read Full Post »
Posted in తెలుగు, సలాం హైద్రాబాద్ on డిసంబర్ 7th, 2009
6
జనవరి ఇరవై నాలుగున సదాశివపేటల పోలీసులు కాల్పులు జరిపినారు. పద్నాలుగు మందికి దెబ్బలు తగిలినాయి. ఆ కాల్పులలో శంకర్ అనే పదిహేడు సంవత్సరాల యువకుడు మరణించినాడు. 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమంల శంకర్ తొలి అమరవీరుడు. శంకర్ అంత్యక్రియలలో మూడు వేల మంది విద్యార్థులు పాల్గొన్నరు. మిగిలిన క్షతగాత్రులందరినీ సికింద్రాబాదులోని గాంధీ దవాఖానాకు తరలించినారు. అక్కడ వాళ్లు కొసప్రాణాలతో మృత్యువుతో పోరాటం చేస్తున్నరు. శంకర్ సంస్మరణ సభ ఆ రోజు హైద్రాబాద్‌ల ఆర్ట్స్ కాలేజీ ముందు మైదానంల […]
Read Full Post »
Posted in పుస్తక పరిచయం, వార్త, తెలుగు on నవంబర్ 30th, 2009
ఓరియంట్‌లాంగ్మన్ వారు ప్రచురించిన “నాంపల్లిరోడ్ నవల చదవని వారు తప్పక చదవాలి. హైదరాబాదు గతవైభవం, సమకాలీన జీవితం అలా అలవోకగా అందులో గుమ్మరించారు రచయిత్రి మీనా అలెగ్జాండర్”. ప్రముఖ ఇండో ఆంగ్లికన్ కవయిత్రి, రచయిత్రి అయిన మీనా రాసిన తొలి నవల అది! ‘నాంపల్లిరోడ్’ అనే ఇంగ్లీషు నవలలోని కథా నాయకకు ఇంగ్లీషు మహాకవి వర్డ్స్ వర్త్ ఆరాధ్యుడు. తనుకూడా ఈ హైదరాబాదు నగర సౌందర్యానికి స్పందించి, వర్డ్స్ వర్త్ లాగా కవిత్వం రాయాలనుకుంటుంది.
[…]
Read Full Post »
Posted in తెలుగు, సలాం హైద్రాబాద్ on నవంబర్ 30th, 2009
5
స్వామి ఆలియా స్కూలు వద్ద బస్సు దిగంగనే నిజాం కాలేజీలకు ఉరికినాడు. ఇంకా నయం. ఊరేగింపు బయలుదేరనే లేదు. సాలార్‌జంగు హాలు ఎదురుంగ ఉన్న చెట్ల దగ్గరికి చేరుకున్నడు. ఈ ఉద్యమ సందర్భంల సిటీ కాలేజీ విద్యార్థులంతా కలుసుకునే సంకేత స్థలం అదే. తన మిత్రబృందంఅంతా అక్కడనే వుంది.
“ఏం రా లేట్ లతీఫ్! ఇంత ఆలస్యంగ వచ్చినవ్?” అని గోపి విసుక్కున్నడు. “ఆప్‌కే ఇంతజార్ మే హమ్ ఇంతెఖాల్ హోగయే” అని అశోక్ ఆట పట్టించినాడు. జెఫ్రీ […]
Read Full Post »
Posted in తెలుగు, సలాం హైద్రాబాద్ on నవంబర్ 23rd, 2009
4
పదిహేడు సంవత్సరాలు గడిచిన తర్వాత మళ్లీ ఇప్పుడు 1969ల ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ‘పునరుత్తానంగ’ ప్రారంభమయ్యింది.
ఆ రోజు స్వామి సరిగ్గ కాలేజీకి పోకుండ నారాయణగుడా విఠల్‌వాడీల వున్న గోపి ఇంటికి బయలుదేరినాడు. విఠల్‌వాడీల రాగిచెట్టు కింద అమ్మవారి గుడి ఎదురంగ వాళ్ల ఇల్లు. వాళ్ల నాన్న ఎలక్ట్రిసిటీ బోర్డులో ఉద్యోగం చేస్తడు. వాళ్లది స్వంత ఇల్లే అయినా చాలా ఇరుకు. వాళ్ల ఇంట్ల సిటీ కల్చర్ స్పష్టంగ కనబడుతది. దక్కన్ క్రానికల్, ఆంధ్రభూమి దినపత్రికలు రెండూ తెప్పిస్తరు. […]
Read Full Post »
Posted in తెలుగు, సలాం హైద్రాబాద్ on నవంబర్ 16th, 2009
3
చిరుగాలికి చలించే చిగురాకువంటి స్వామి తనకు తెలియకుండనే, తన ప్రమేయం లేకుండనే ఇప్పుడు 1969ల మొదలైన ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉప్పెనల తలనిండా మునిగి కొట్టుకపోతున్నడు.
స్వామి ఆ రోజు ఉత్సాహంగ నిద్ర లేచినాడు. ”ఇంత పొద్దున్నే ఎందుకు లేచినవురా?” అని అమ్మ ఆశ్చర్యపోయింది. ఆమె అప్పటికే నిద్ర లేచి వంటింట్ల మట్టిపొయ్యిని ఎర్రమన్నుతోటి చక్కగ అలికి, దానికి తెల్లటి ముగ్గు పిండితోటి వంకీలు వంకీలుగ ముగ్గులేసి వాటి మధ్య చుక్కల ముగ్గులేసింది. బొగ్గులు రాజేసి దాని మీద […]
Read Full Post »
Posted in తెలుగు, సలాం హైద్రాబాద్ on నవంబర్ 9th, 2009
2
ప్రతి పిల్లగాలి తెమ్మెరకు చిగురాకు వోలె చలించిపోయే హృదయం స్వామిది. ప్రతి చిన్న సంఘటనకు ‘అసంకల్పిత ప్రతీకారచర్య’ వోలె స్పందించే హృదయం స్వామికి ఎక్కడి నుండి వచ్చింది? బహుశా పాలు తాగే పసిడి ప్రాయంలోనే స్వామికి ఆ గుణం అమ్మ ఒడిలనే అబ్బిందేమొ!
* * *
అమ్మ పక్కల వెచ్చగ నిద్రపోతున్న స్వామి కళ్లు తెరిచినాడు. అమ్మ చీరె కొంగు వాడి ముఖంపై పడి ఉక్కిరిబిక్కిరై కాళ్లు చేతులు తసబిసా కొట్టుకున్నడు. హమ్మయ్య కొంగు తొలిగింది. గాలి ఆడుతుంది. […]
Read Full Post »
Posted in తెలుగు, సలాం హైద్రాబాద్ on నవంబర్ 2nd, 2009
2005 జూన్ 10 శుక్రవారం. మధ్యాహ్నసమయం.
మక్కా మసీదుల నమాజ్‌లు చదువుతున్న సమయం.
నాలుగు వందల సంవత్సరాల నగరచరిత్రకు ప్రత్యక్షసాక్షిగ, ప్రథమసాక్షిగ నిలుచున్న ‘చార్‌మినార్’.
‘చార్‌మినార్’కు ఎదురుంగ లార్డ్ బజార్ సందు మలుపుల ‘ఇక్బాల్’ హోటల్ల స్వామి. కాలం శూలం దాడికి గురి కాక అట్లనే నిలుచున్న నైజాం కాలంనాటి అతి పురాతన ఇక్బాల్ హోటల్. అండ్ల ఎంతసేపట్నుంచి కూచున్నడో ఆయనకే తెలుస్తలేదు. చాయ్‌ల మీద చాయ్‌లు తాగుకుంట ఎదురుంగ నిలబడ్డ ‘జిగ్రీ దోస్త్ చార్‌మినార్’తోటి అంతులేని ముచ్చట్లు. ఎడతెగని నిరంతర […]
Read Full Post »