Feed on
Posts
Comments

Category Archive for 'పుస్తక పరిచయం'

- రావి ప్రేమలత

స్త్రీ చైతన్యంపై ఉత్తమ పరిశోధన
తెలంగాణ ఉద్యమంలోని స్త్రీల చైతన్యాన్ని నవలలు చిత్రించినట్లు మరే సాహిత్య ప్రక్రియ చిత్రించలేదు. తెలంగాణ పోరాటాన్ని ఇతివృత్తంగా తీసుకున్న నవలలు 21 వరకున్నాయి. వాటిలో 10 నవలలను డా. దేవకి “తెలంగాణ విమోచనోద్యమ నవలల్లో స్త్రీ చైతన్యం” అనే అంశాన్ని పరిశోధించడానికి ఎంచుకున్నారు. ఉత్తమ పరిశోధనకు గాను తెలుగు విశ్వవిద్యాలయం నుండి స్వర్ణ పతకాన్ని కూడా అందుకున్నారు.

Read Full Post »

డిట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్ పుస్తక చర్చా సమీక్ష
పుస్తకం: సలాం హైద్రాబాద్ (తెలంగాణ నవల),
రచయిత: లోకేశ్వర్ ; గాంధి ప్రచురణలు, హైద్రాబాద్ (2005)
ఈ నవల గురించి రచయిత తన ముందు మాటగా చెప్పుకున్న వివరాల ప్రకారం, ఈ నవలాకాలం 1578 నుండి జూలై 10, 1970 వరకు. ఇందులోని ముఖ్య వస్తువులు హైద్రాబాద్ చరిత్ర, నగరంలో నడిచిన ఉద్యమాలు, స్వామి అనే ఒక పి. యు. సి. విద్యార్ధి ఆత్మకథ. ఈ మూడు వస్తువుల్నీ కలిపి జడలాగా […]

Read Full Post »

- దుప్పల రవికుమార్
పొరిగింట్లో జామిచెట్టు కొమ్మ మన ఇంట్లోకి వాలిందనుకోండి. ఆ కొమ్మపై పళ్లు మనవా? వాళ్లవా? మనింట్లో జామిచెట్టు కొమ్మ పొరిగింటి పిట్టగోడ మీదుగా వెళ్లిందనుకోండి, అక్కడి పళ్లు మనవా? వాళ్లవా? ఎదురింటి వాళ్ల జామికొమ్మ వాల్ల పక్కింటిలోకి వాలితే ఆ పళ్లు ఎవరివి? చెప్పండి చూద్దాం. మొదటి రెండింటికి జవాబు మనవి. మూడో ప్రశ్నకు జవాబు ఆ రెండిళ్లలో మనకు దగ్గరి వాళ్లు ఎవరైతే వారివి.

Read Full Post »

చారిత్రక ఆనవాళ్లివిగో…

ఈ పుస్తకాన్ని తిరగేసిన తరువాత ‘మనకు తెలియని భాగ్యనగరం ఇంకా ఇంతుందా?’ అని ఆశ్చర్యంతో ముక్కున వేలు వేసుకోవలసి వస్తుంది. చారిత్రక, కళాత్మక, వారసత్వపు కట్టడాలపై సమగ్రమైన సమాచారాన్ని అందించారు. హైదరాబాద్‌ చరిత్రపై రీసర్చ్‌ చేయాలనుకునే వారికి ఇదొక గైడ్‌లా పనిచేస్తుంది. చక్కటి ఛాయాచిత్రాలు, వాటి చారిత్రక నేప«థ్యాలు ఉన్నాయి. హైదరాబాద్‌ అనగానే ఒక చార్మినార్‌, ఒక గోల్కొండే కాదు … అలాంటి అద్భుతమైన కట్టడాలు ఎన్నో ఉన్నాయని చెబుతూ వాటి ఆనవాళ్లను పట్టిచ్చే అపురూప […]

Read Full Post »

హైదరాబద్ పై “పోలీసు చర్య” జరిగి ఈ సెప్తెంబర్ 17కు 60 యేళ్ళు నిండుతున్నాయి. ఈ “పోలీసు చర్య”ను విమోచన, విలీనం, విముక్తి, ఆక్రమణ, దాడి, దండయాత్ర పేరిట చరిత్రకారులు, విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ భిన్నభిప్రాయలు ఒక్క దగ్గరకు తీసుక వచ్చి పాఠకులు తమ అవగాహనను పెంచుకునేందుకు వీలుగా “తెలంగాణ హిస్టరీ సొసైటీ” “17 సెప్టెంబర్, 1948 : బిన్న దృక్కోణాలు” అనే పుస్తకాన్ని ప్రచురించింది. ఈ అంశంపై ఇటివల వెలుగు చూసిన వాస్తవాలను అందరికీ […]

Read Full Post »

తెలంగాణలో శ్రమజీవులను ‘పనిపాటలోల్లు’ అని వ్యవహరిస్తుంటారు. శ్రామికుల పనితోపాటు పాట సాగుతుంటుంది. పొలం పనుల్లో, ఇంటి పనుల్లో, వృత్తి పనుల్లో పాటలు వినిపిస్తూనే ఉంటాయి. పనిలోని అలసటను తగ్గించి, శ్రమను మరిపించి, ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని పంచి ఉత్పత్తిని పెంచే శక్తి పాటకుంది. పనిలోని లయననుసరించి, శ్రామికుని ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు అనుగుణంగా పాటకు లయ ఛందస్సు లేర్పడుతుంటాయి. శ్రామికుని జీవిత విధానం, మనోభావాల ఆధారంగా పాటలోని వస్తువు రూపుదిద్దుకుంటుంది. ఇటువంటి పనిపాటలు ప్రపంచంలోని అన్ని భాషల్లోనూ ప్రాంతాల్లోనూ వినిపిస్తుంటాయి.

[…]

Read Full Post »

Managed by Discover Telangana Inc., a registered nonprofit organization in USA.

All opinions and views expressed by third party content providers and shown here as preview are not that of Discover Telangana.

If you find any Content that is infringing, libelous, defamatory, obscene, abusive, offensive or otherwise violation of copyright law, alert us by emailing us at discover.telangana(at)gmail.com