నీళ్లు-నిజాలు : కవర్ పేజ్
Posted in తెలుగు, నీల్లు నిజాలు, పుస్తకాలు on Jan 24th, 2006
నీళ్లు-నిజాలు (వ్యాసాల సంకలనం) ఆర్. విద్యాసాగరరావు చీఫ్ ఇంజనీరు (రిటైర్డ్) కేంద్ర జల సంఘం తెలంగాణ విద్యావంతుల వేదిక తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం (USA) జనవరి 2006
మన తెలంగాణను తెలుసుకుందాం!
Posted in తెలుగు, నీల్లు నిజాలు, పుస్తకాలు on Jan 24th, 2006
నీళ్లు-నిజాలు (వ్యాసాల సంకలనం) ఆర్. విద్యాసాగరరావు చీఫ్ ఇంజనీరు (రిటైర్డ్) కేంద్ర జల సంఘం తెలంగాణ విద్యావంతుల వేదిక తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం (USA) జనవరి 2006
Posted in తెలుగు, నీల్లు నిజాలు, పుస్తకాలు on Jan 24th, 2006
నీళ్లు-నిజాలు : కవర్ పేజ్ జలవిజ్ఞాన సర్వస్వం : కొండుభట్ల రామచంద్రమూర్తి ‘ఆంధ్రజ్యోతి’ సంపాదకుడు మనసులో మాట : ఆర్. విద్యాసాగరరావు ఒకటవ భాగము భారతదేశంలో జలసంపద – అభివృద్ధి – సమస్యలు 1.01) నీటి లభ్యత 1.02) నదీ బేసిన్లు 1.03) సాగునీరు 1.04) వరదలు-నియంత్రణ 1.05) విద్యుత్ సంపద
Posted in తెలుగు, నీల్లు నిజాలు on Jan 24th, 2006
ప్రకృతిప్రసాదించిన జీవనదులు దేశాల మధ్యా, రాష్ట్రాల మధ్యా మైత్రీహారాలుగా, సుహృద్భావ సేతువులుగా ఉండవలసింది పోయి మనిషి స్వార్థం, సంకుచిత రాజకీయ ప్రయోజనాల కారణంగా వివాదాలు రగిలిస్తున్నాయి. 21వ శతాబ్దంలో యుద్ధాలు నీటికోసమే జరుగుతాయంటూ ఈజిప్టు సామాజిక శాస్తవ్రేత్త ఇస్మాయిల్ సెరాగెల్డిన్ చెప్పిన జోస్యం నిజమయ్యే ప్రమాదం కనిపిస్తున్నది. ఆంధ్రప్రదేశ్, కర్నాటకల మధ్య కృష్ణా జలాలకు సంబంధించి అలమట్టి సమస్య, కర్నాటక, తమిళనాడు మధ్య కావేరీ జలకలహం, పంజాబ్, హర్యానా, రాజస్థాన్ మధ్య రావి-బియాస్ జలవివాదం ఎప్పుడు ముదిరి [...]
Posted in తెలుగు, నీల్లు నిజాలు on Jan 24th, 2006
నీళ్ల పైన నేను రాస్తాననిగాని, రాయాలనికాని ఎన్నడూ అనుకోలేదు. చిన్నతనం నుంచీ నేను రాసింది కవిత్వం, కథలు, నాటికలు – వేసింది స్టేజిపైన నాటకాలు, రేడియో, దూరదర్శన్లో నాటికలు. ఈ రేడియో పిచ్చి ఎంతదాకా వెళ్లిందంటే నేను క్యాసువల్ ఆర్టిస్ట్‌గా రేడియోలో వార్తలు చదవడం, అనౌన్సర్‌గా పని చేయడం మొదలుకుని భారత ప్రభుత్వ ప్రచార కార్యక్రమాలు తెలుగులో వేయికిపైగా రేడియోలో నాటికల రూపంలో దశాబ్దానికి పైగా రాయడం ప్రసారం చేయడం వరకు సాగింది. నా రచనా వ్యాసంగం [...]
Posted in తెలుగు, నీల్లు నిజాలు on Jan 24th, 2006
ప్రపంచ వ్యాప్తంగా నీటి వనరులు నానాటికీ తగ్గిపోతున్నాయన్నమాట వాస్తవం కాదు. ఐక్యరాజ్యసమితి అంచనాల ప్రకారం భూమిపై ఉన్న నీరు 140 కోట్ల ఘనపు కిలోమీటర్లు. అంటే ఆ నీటిని మన భూమిపైన విస్తరింపజేస్తే అది మూడు కిలోమీటర్ల ఎత్తుంటుంది. అయితే ఈ నీటిలో 97శాతం పైగా ఉప్పునీరు. సముద్రాలలో దాగుంది. మిగిలిన స్వచ్ఛమైన నీటిలో సుమారు 77.6 శాతం ధృవాలలో మంచురూపంలో, 21.8 శాతం భూగర్భంలో చాలా లోతున నిక్షిప్తమై ఉంది. అంటే మనకు లభ్యమయ్యే నదులలో, [...]
Posted in తెలుగు, నీల్లు నిజాలు on Jan 24th, 2006
నది అనేది హైద్రాలాజికల్ సిస్టంలో సహజమైన ఉనికి గల ఒక వివేషం (Entity). దానికి భౌగోళికపరమైన సరిహద్దులుంటాయి. నదిని మొత్తంగా పరిగణనలోకి తీసుకుని అభివృద్ధి పథకాలు చేపట్టడమనేది శ్రేష్ఠమైన పని. కాని దురదృష్టవశాత్తూ రాజకీయం కారణంగా అది సాధ్యమయ్యే పని కాదు. మన దేశంలో ఆయా రాష్ట్రాలు, తమ సరిహద్దుల్లోని నదులపై అభివృద్ధి పథకాలను రూపొందించి కేంద్ర జల సంఘానికి పంపటం రివాజు. అంతేగాని నదీబేసిన్‌పై సమగ్ర అభివృద్ధి పథకాలను (ఏ రాష్ట్రం, ఎంత నీరు అన్నది [...]
Posted in తెలుగు, నీల్లు నిజాలు on Jan 24th, 2006
మన దేశంలో మొత్తం సాగుకాగల భూమి 13.988 కోట్ల హెక్టేర్లుగా (ఒక హెక్టారనగా సుమారు రెండున్నర ఎకరాలు) అంచనా వేసారు. ఇందులో భారీ, మధ్య తరహా ప్రాజెక్టుల ద్వారా 5.846 కోట్ల హెక్టేర్లు మిగతా 8.142 కోట్ల హెక్టేర్లు చిన్నతరహా ప్రాజెక్టుల ద్వారా జరగవలసి ఉంది. భూగర్భ జలాల నుండి సాగయ్యే 6.40 కోట్ల హెక్టేర్లు చిన్నతరహా ప్రాజెక్టు కోవకే చెందుతాయి. మార్చి 2005 నాటికి భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల ద్వారా 4 కోట్ల మూడు లక్షల [...]
Posted in తెలుగు, నీల్లు నిజాలు on Jan 24th, 2006
ఇంత సువిశాల దేశంలో, వైవిధ్యం కలిగిన వాతావరణం, పోకడలలో దేశంలో ఏదో ఓ మూల వరద, మరోచోట దుర్భిక్షం ఏక సమయంలో సంభవించడం అసహజమేమీ కాదు. ఒకేసారి ఒకే రాష్ట్రంలో కొన్నిచోట్ల వరదలు సంభవిస్తుంటే కొన్ని ప్రాంతాలు క్షామానికి గురై తల్లడిల్లడం కూడా గమనిస్తున్నాం. ఆదినుండీ, మానవుడు వరదతో సహజీవనం సాగిస్తున్నాడు. అయితే పూర్వపు రోజుల్లో మనుషులు తక్కువ ఉండేవారు. పారిశ్రామిక కార్యకలాపాలు అంతగా లేకపోవడం, వరద ప్రాంతాలలో (ఫ్లడ్ ప్లెయిన్స్)లో అభివృద్ధి కార్యక్రమాలు చోటు చేసుకోకపోవడంవల్ల [...]
Posted in తెలుగు, నీల్లు నిజాలు on Jan 24th, 2006
మన దేశంలో అపారమైన జల విద్యుత్ సంపద ఉంది. 1987 సంవత్సరంలో కేంద్ర విద్యుత్ సంస్థ (సిఇఎ) వారు చేపట్టిన అధ్యయనం ప్రకారం మన దేశంలో 84 వేల 44 మెగావాట్ల జలవిద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం (60 శాతం లోడ్ ఫ్యాక్టర్ ప్రాతిపదికన) ఉంది. చిన్న చిన్న విద్యుత్ పథకాలు, పంప్ స్టోరేజి పథకాలు ఉత్పత్తి చేసే విద్యుత్తును కూడా కలుపుకుంటే మన దేశంలో సుమారు 94 వేల మెగావాట్ల జల విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం (60 [...]
Posted in తెలుగు, నీల్లు నిజాలు on Jan 24th, 2006
ఒకానొక కాలంలో మన దేశంలో అన్ని రవాణా వ్యవస్థల్లోకెల్లా నదీరవాణా అగ్రగామిగా ఉండేది. అయితే రైలుమార్గాలు అధునాతన సాంకేతికతో రహదార్లు పుంజుకోవడంతో దీనికితోడు నదీరవాణా సేవ నిర్వహణ లోపాలు తోడయ్యి నదీరవాణా తన ప్రాధాన్యతను కోల్పోయింది. ఇప్పటికీ అంతో ఇంతో మెరుగ్గా నదీరవాణా నిర్వహిస్తున్న రాష్ట్రాలుగా గోవా, పశ్చిమబెంగాల్, అస్సాం, కేరళలను చెప్పుకోవచ్చు.
Posted in తెలుగు, నీల్లు నిజాలు on Jan 24th, 2006
ఉపరితల జలాలు రాజ్యాంగంలో 246 అధికరణంలో ఏడవ షెడ్యూల్‌లో మూడు జాబితాలున్నాయి. కేంద్రజాబితా: ఇందులో జతపరిచిన విషయాలకు సంబంధించిన చట్టాలను చేసే అధికారం పార్లమెంటుకే ఉంది. రాష్ట్రజాబితా: ఇందులో పొందుపరిచిన విషయాలపై చట్టాలను రూపొందించే అధికారం ఆయా రాష్ట్ర శాసన సభలకే ఉంది. ఉమ్మడి జాబితా: ఇందులో ఉటంకించిన విషయాలపై చట్టాలు చేసే అధికారం పార్లమెంటుకు, శాసనసభకు ఉభయులకూ ఉంది.
Posted in తెలుగు, నీల్లు నిజాలు on Jan 24th, 2006
ప్రకృతి ప్రసాదించిన వనరు, వరం- నీరు. గాలి తరువాత సమస్త జీవరాశులకు అవసరమయిన అతి ముఖ్యమైన వనరు నీరు. ప్రపంచ వ్యాప్తంగా నీటి వనరులు నానాటికీ తగ్గిపోతున్నాయన్నమాట వాస్తవం కాదు. భూమిపై ఉన్న నీటినంతటినీ విస్తరింపచేస్తే అది మూడు కిలోమీటర్ల ఎత్తుంటుంది. అయితే ఈ నీటిలో 97 శాతం ఉప్పునీరు, మిగతా స్వచ్ఛమైన నీటిలో అధిక భాగం ధ్రువాలలో, భూగర్భంలో నిక్షిప్తమై ఉంది. మనం ఉపయోగించుకోగల మంచినీరు పదివేల యూనిట్లలో కేవలం ఒక యూనిట్ మాత్రమే. ఏ [...]
Posted in తెలుగు, నీల్లు నిజాలు on Jan 24th, 2006
అంతర్ రాష్ట్ర నదులలో రెండు, అంతకుమించి రాష్ట్రాల మధ్య జల వికాసం, వినియోగం, వాటాల విషయంలో తరచుగా వివాదాలు తల ఎత్తుతున్నాయన్నమాట నిజం. అయితే వాటిని త్వరగా పరిష్కరించే యంత్రాంగం అమలులో లేదు. ఉన్న యంత్రాంగం పరిష్కార మార్గం సూచించడానికి ఏళ్లు తీసుకుంటుంది. ఆ యంత్రాంగం తీసుకున్న నిర్ణయాల అమలు సక్రమంగా కావడం లేదు. ఏదో ఒక మిషపైన రాష్ట్రాలు తగాదా పరిష్కారానికి నామమాత్రంగా కేంద్రానికి విన్నవించుకోవడం, కేంద్రం చొరవ చూపినా, చూపకపోయినా, ఏదో ఓ చట్టపరమైన [...]
Posted in తెలుగు, నీల్లు నిజాలు on Jan 24th, 2006
అంతర్రాష్ట్ర జల వివాదాలపై ఒక కొత్త బిల్లును పార్లమెంటు మార్చి 11, 2002 న ఆమోదించింది. కృష్ణానదీ వివాదాలతో సతమతమవుతున్న మన రాష్ట్రంపై దీని ప్రభావం గణనీయగా ఉండబోతున్నది. పార్లమెంటు 1956వ సంవత్సరంలో ఆమోదించిన అంతర్-రాష్ట్ర జల వివాద చట్టానికి కొన్ని సవరణలు చేసి 2001 పార్లమెంట్‌లో బిల్లు రూపంలో ప్రవేశపెట్టారు. లోక్‌సభ ఆమోదించిన ఈ బిల్లు 11 మార్చి, 2002న రాజ్యసభ ఆమోదం కూడా 6 ఆగస్టు 2002నాడు పొంది చట్టం రూపం దాల్చింది. రాజ్యాంగంలోని [...]
Posted in తెలుగు, నీల్లు నిజాలు on Jan 24th, 2006
ఏ ట్రిబ్యునల్ ఏం చేసింది? అంతర్ రాష్ట్ర జల వివాదాలు, అంతర్ దేశ జలయుద్ధాలు కొత్తేమీ కావు. మనదేశానికి సంబంధించిన వరకు అంతర్‌రాష్ట్ర జలవివాదాల పరిష్కారం నిమిత్తం రాజ్యాంగంలోని 262 అధికరణం కింద పార్లమెంటు చట్టం 1956లో తెచ్చింది. దీని ప్రకారం ఏదైనా జలవివాదాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చినప్పుడు ఆ తగాదా రాజీ యత్నాల ద్వారా పరిష్కారం కాదని కేంద్రం అభిప్రాయపడితే, ఓ జలవివాద న్యాయపీఠాన్ని ఏర్పాటు చేసి ఆ తగాదాలను పీఠానికి అప్పచెపుతుంది.
Posted in తెలుగు, నీల్లు నిజాలు on Jan 24th, 2006
సాగునీటి ప్రాజెక్టులలో మూడు రకాలున్నాయి. 10 వేల హెక్టార్ల సిసిఎ (కమాండబుల్ కల్చరబుల్ ఏరియా) కలిగిన ప్రాజెక్టులను భారీ ప్రాజెక్టులుగా, 2వేల హెక్టార్ల నుంచి 10 వేల హెక్టార్ల సిసిఎ కలిగిన ప్రాజెక్టులను మధ్యతరహా ప్రాజెక్టులుగా, 2 వేల హెక్టార్లకన్న తక్కువ సిసిఎ కలిగిన ప్రాజెక్టులను చిన్నతరహా ప్రాజెక్టులుగా వ్యవహరిస్తుంటారు. అంతర్రాష్ట్ర అంశాలు కలిగిన భారీ ప్రాజెక్టులు, మధ్యతరహా ప్రాజెక్టులను కేంద్రానికి పరిశీలన నిమిత్తం పంపవలసి ఉంటుంది. అంతర్రాష్ట్ర అంశాలు లేని భారీ ప్రాజెక్టులు, మధ్యతరహా ప్రాజెక్టులు, [...]
Posted in తెలుగు, నీల్లు నిజాలు on Jan 24th, 2006
ప్రణాళికా కాలం అంటే 1951వ సంవత్సరంలో మొదలయిన మొదటి పంచవర్ష ప్రణాళిక ప్రారంభం నుంచి 1996-97 సంవత్సరం వరకు (96-97 ధరల స్థాయిని అనుసరించి), భారీ, మధ్య తరహా నీటిపారుదల ప్రాజెక్టులపైన ప్రభుత్వం 1,32,390 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టింది. వరద నియంత్రణ, ఆయకట్టు (command area) అభివృద్ధి, చిన్నతరహా ప్రాజెక్టులు కూడా కలుపుకుంటే 2,31,387 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి.
Posted in తెలుగు, నీల్లు నిజాలు on Jan 24th, 2006
జల కాలుష్య నివారణకు, నియంత్రణ కొరకు చట్టాలున్నాయి. అవి: 1. జల (కాలుష్య నివారణ, నియంత్రణ) చట్టం, 2) జల (కాలుష్య నివారణ, నియంత్రణ) పన్ను చట్టం, 1977, 3) పర్యావరణ (పరిరక్షణ) చట్టం, 1986, 4) ప్రమాదకర వ్యర్థ పదార్థాల (నిర్వహణ) నియమాలు, 1989. పైన చెప్పిన అన్ని చట్టాల్లోకి పర్యావరణ (పరిరక్షణ) చట్టం, 1986 అతి ముఖ్యమైనది. కాలుష్య నియంత్రణకు తీసుకోవలసిన అన్ని చట్టపరమైన చర్యలు, శిక్షలు వగైరా ఇందులో సవిస్తరంగా పొందుపరచారు.
Posted in తెలుగు, నీల్లు నిజాలు on Jan 24th, 2006
నదీ జలాలు, భూగర్భ జలాల పరిమాణం తగ్గిపోవడం కన్నా రానున్న కాలంలో మనల్ని తీవ్రంగా వేధించే సమస్య ఆ నీళ్లు కలుషితమవడం. మన దేశంలో అనేక నదులు కలుషితమవుతున్నాయి. అతి పవిత్రంగా భావించే గంగా నదిని ప్రతి దినం 66 కోట్ల లీటర్ల గృహ, పారిశ్రామిక వ్యర్థ పదార్థాలు కలుషితం చేస్తున్నాయి. 1986లో ప్రభుత్వం చేపట్టిన గంగా కార్యాచరణ పథకం (Ganga Action Plan Phase 1) ద్వారా పరిస్థితి చాలావరకు మెరుగుపడ్డా ఇంకా నదిలోని కొన్ని [...]
Posted in తెలుగు, నీల్లు నిజాలు on Jan 24th, 2006
నీటి ప్రాముఖ్యతను, కేంద్రానికి, రాష్ట్రాలకు రాజ్యాంగపరంగా నీటి విషయంలో సంక్రమించిన అధికారాలు, బాధ్యతలను దృష్టిలో పెట్టుకుని యావత్ దేశానికి ఉపయోగపడే జాతీయ జల విధానాన్ని రూపొందించాలని భారత ప్రభుత్వం ఎన్నో ఏళ్ళుగా యోచిస్తోంది. 1987లో మొదటిసారి, ప్రధానమంత్రి అధ్యక్షతన జాతీయ జలవనరుల పరిషత్తు (నేషనల్ వాటర్ రీసోర్సెస్ కౌన్సిల్) సమావేశమై జాతీయ జలవిధానాన్ని ఆమోదించింది.
All opinions and views expressed by third party content providers and shown here as preview are not that of Discover Telangana.
If you find any Content that is infringing, libelous, defamatory, obscene, abusive, offensive or otherwise violation of copyright law, alert us by emailing us at discover.telangana(at)gmail.com