Posted in తెలుగు, నీల్లు నిజాలు on Jan 24th, 2006
1987లో జాతీయ జలవిధానాన్ని ఆమోదించాక, పధ్నాలుగు సంవత్సరాలలో ఉత్పన్నమైన సమస్యలు, సవాళ్ల దృష్ట్యా ఆ జలవిధానంలో మార్పులు, చేర్పులు చేయవలసి వచ్చింది. ఉదాహరణకు జలవనరుల రంగంలో తలెత్తుతున్న అంతర్‌రాష్ట్ర నదీజలాల వివాదాలు, రాష్ట్రాల మధ్య నీటిపంపిణీ, జలవనరుల అభివృద్ది, నిర్వహణలో భాగస్వామ్య పద్ధతి, ప్రైవేటు రంగ భాగస్వామ్యం, జలవనరుల నిర్వహణలో, పరిమాణం, నాణ్యత, పర్యావరణ విషయాలను సమీకృతపరచడం, ప్రాజెక్టు మూలంగా ప్రభావితులైన వ్యక్తులకు పునరావాసం, సహాయ కార్యక్రమాలు చేపట్టడం, నీటి వ్యవస్థ నిర్వహణకు విధిగా నిధులు అందించడం, [...]
Read Full Post »
Posted in తెలుగు, నీల్లు నిజాలు on Jan 24th, 2006
ప్రధానమంత్రి వాజ్‌పేయి అధ్యక్షతన సమావేశమైన జాతీయ జలవనరుల మండలి ఏప్రిల్ 1, 2002న ఏకగ్రీవంగా ఆమోదించడంతో, కొత్త జాతీయ జలవిధానానికి మోక్షం లభించినట్లయింది. నిజానికి ఇది కొత్త డాక్యుమెంటేమీ కాదు. 1981లో మొట్టమొదటిసారి ఆమోదించిన జాతీయ జలవిధానానికి కొన్ని సవరణలు చేసిన రూపమిది.
Read Full Post »
Posted in తెలుగు, నీల్లు నిజాలు on Jan 24th, 2006
1960 వరకు మనం ఆహారధాన్యాలను దిగుమతి చేసుకునేవాళ్లం. అలాంటిది, తర్వాత స్వయంసమృద్ధిని సాధించడమే గాకుండా, ఇప్పుడు ఎగుమతులు కూడా చేసే దశకు చేరుకున్నాం. 1950-51లో మనం పండించిన ధాన్యం 5 కోట్ల 1 లక్ష టన్నులు. అది 1998-99 నాటికి 20 కోట్ల స్థాయికి చేరింది. ఈ వృద్ధిలో 52 శాతం సాగునీరు వసతి కల్పించడం మూలంగా మిగతా 48 శాతం కొత్త వ్యవసాయ పద్ధతులు, అధిక దిగుబడి వంగడాలు మూలంగా సాధ్యమైంది.
Read Full Post »
Posted in తెలుగు, నీల్లు నిజాలు on Jan 24th, 2006
పర్యావరణ వేత్తలు గుండెలు బాదుకుంటూ ‘ఈ డ్యాం కడితే సర్వనాశన మవుతుంది’ అంటూ విమర్శించిన ఈజిప్టులోని ఆస్వాన్ డ్యాంను చూడండి. 1960-69 మధ్య నిర్మించిన ఈ డ్యాం 2100 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. ఈ డ్యాం కారణంగా లక్షా 20 వేల మంది ముంపునకు గురయి తరలింపబడ్డారు. వీరందరికి తలసరి 556 నుంచి 863 డాలర్లు వెచ్చించి పునరావాసం కల్పించారు.
Read Full Post »
Posted in తెలుగు, నీల్లు నిజాలు on Jan 24th, 2006
దేశంలోని వివిధ ప్రాంతాలలోని ప్రజల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిస్థితులు భిన్నంగా ఉండటంచేత యావత్ దేశానికి వర్తించే పునరావాస సహాయ ఏకైక విధానం రూపొందించి, అమలు చేయాలనుకోవడం సాధ్యమయ్యే విషయం కాదు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్ర గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వశాఖ పునరావాస సహాయ కార్యక్రమాలకు సంబంధించి ఒక జాతీయ విధానం రూపొందించింది.
Read Full Post »
Posted in తెలుగు, నీల్లు నిజాలు on Jan 24th, 2006
పెద్ద పెద్ద రిజర్వాయర్ల నిర్మాణం మూలంగా నిర్వాసితులయ్యే జనాభా అనేక రకాలైన ఉద్వేగాలకు, క్షోభలకు గురవుతుంది. ముంపునకు పూర్వం వీరు అనుభవిస్తున్న జీవితంకంటే మెరుగైన జీవితం అందించగలిగితేనే అది ఆదర్శప్రాయమైన పునరావాస సహాయ విధానమవుతుంది. ఈ సమస్యను పరిష్కరించే దిశలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు తమ తమ పునరావాస సహాయ విధానాలను రూపొందించి అమలు చేసాయి. నిజానికి ఈ విధానాలు చాలా మటుకు సంతృప్తికరంగానే ఉన్నాయి.
Read Full Post »
Posted in తెలుగు, నీల్లు నిజాలు on Jan 24th, 2006
Sustainable Developmentకి సరైన అనువాదం సుస్థిర వికాసం అవునో కాదో తెలియదు. కాని ఈ మాటకు ఎన్నో నిర్వచనాలు ఇవ్వడం మాత్రం జరిగింది. అన్నింటిలోనూ అతి ప్రాచుర్యం పొందిన నిర్వచనం ‘మన ఉమ్మడి భవిష్యత్తు’ (Our common Future) అన్న పుస్తకంలో (దీన్నే బ్రంట్‌లేండ్ కమిషన్ రిపోర్ట్‌గా కూడా పేర్కొంటారు) ఉంది.
Read Full Post »
Posted in తెలుగు, నీల్లు నిజాలు on Jan 24th, 2006
సాగునీరు, బహుళార్థ సాధక ప్రాజెక్టుల్లో ప్రైవేటురంగం భాగస్వామ్యం గురించి అధ్యయనం చేసేందుకై 1995వ సంవత్సరంలో భారత ప్రభుత్వం అప్పటి కేంద్ర జల వనరుల సహాయమంత్రి రంగయ్యనాయుడు అధ్యక్షతన ఒక కమిటీ వేసింది. ఈ కమిటీలో జలవనరుల మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారులతోపాటు, కేంద్ర ఆర్థికమంత్రిత్వశాఖ, విద్యుత్‌శాఖ, న్యాయ మంత్రిత్వశాఖ అధికారులు ఇంకా ఆంధ్రతో సహా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల జలవనరుల, నీటిపారుదల కార్యదర్శులు కూడా సభ్యులుగా ఉన్నారు.
Read Full Post »
Posted in తెలుగు, నీల్లు నిజాలు on Jan 24th, 2006
ప్రపంచవ్యాప్తంగా సాగునీటి నిర్వహణ బాధ్యతను రైతులకు అప్పచెప్పడం ద్వారా నీటి వినియోగం సమర్థవంతంగా, సక్రమంగా జరుగుతుందని గుర్తించారు. చాలీచాలని నిధులను రైతు సంఘాలకు అందచేసినా కూడా అవి సాగునీటి వ్యవస్థను మెరుగ్గా కాపాడుకోగలవని అధ్యయనాల ద్వారా తేలింది. కాలువలు బాగుంటేనే తమ ఆర్థిక స్థితి బాగుంటుందని తెలిసిన రైతులు వాటి మరమ్మత్తు, పరిరక్షణ పట్ల ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటున్నారన్నమాట వాస్తవం.
Read Full Post »
Posted in తెలుగు, నీల్లు నిజాలు on Jan 24th, 2006
దేశంలోని వివిధ ప్రాంతాలలో ‘నీరు-మీరు’ ‘జలయజ్ఞం’ లాంటి కార్యక్రమాలద్వారా ఇంకుడుగుంటలు, చెక్‌డ్యాంలు, చెరువులు, కుంటలలో పూడిక తీత వంటి పనులు చేపట్టారు. ఇవన్నీ మంచి పనులే. ఈ పనుల మూలంగా వర్షపునీరు వృధాగా పోకుండా భూమిలోకి ఇంకి భూగర్భ జలస్థాయి పెరగటం, తద్వారా ఆ ప్రాంత వాసుల నీటి అవసరాలు (తాగు, సాగునీటివి) తీరడం జరుగుతుంది. ఇందులో అనుమానం లేదు.
Read Full Post »
Posted in తెలుగు, నీల్లు నిజాలు on Jan 24th, 2006
సాగునీటి వ్యవస్థను మెరుగుపరచాలన్నది ప్రపంచబ్యాంకు ధ్యేయం. నీటి పంపిణీ బాధ్యతను ప్రభుత్వం నుండి తొలగించి సాగునీటి సంఘాలకు అప్పచెప్పమనడం, నీటిని పరిమాణ ప్రాతిపదికన రైతులకు అందచేయాలనడం, వాడుకున్న పరిమాణాన్ని బట్టి రైతులు చార్జీలు చెల్లించే ఏర్పాటు కావాలనడం, ప్రస్తుతం చెలామణిలో ఉన్న నీటితీరువా చాలా తక్కువ కాబట్టి దాన్ని గణనీయంగా (దశలవారీగా) పెంచాలనడం, ఇవన్నీ ప్రపంచబ్యాంకు పెట్టే షరతులు.
Read Full Post »
Posted in తెలుగు, నీల్లు నిజాలు on Jan 24th, 2006
‘నీళ్లను అమ్మడం, కొనుగోలు చేయడం’ వ్యవస్థనే వాటర్ మార్కెట్ అంటాం.ఈ పద్ధతి మన దేశానికి కొత్తేం కాదు. క్రీ.పూ. 400 సంవత్సరపు కౌటిల్యుని అర్థశాస్త్రంలో ‘నీరు’కు మారుగా కొంత మొత్తాన్ని రాయల్టీగా చెల్లించాలని ఉంది. క్రీ.శ.1202 నాటి దక్షిణ దేశ శిలాఫలకాలలో ఉపరితల జలం అమ్ముకునే పద్ధతి స్పష్టంగా ఉంది. గత కొన్ని దశాబ్దాలుగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో నీళ్ల మార్కెట్లకు బాగా ఆదరణ పెరిగింది. మరీ ముఖ్యంగా నీటి కొరత ఉన్నచోట నీళ్ల మార్కెట్లకు విపరీతమైన [...]
Read Full Post »
Posted in తెలుగు, నీల్లు నిజాలు on Jan 24th, 2006
దేశంలో అనేకమంది డాక్టర్ కె.ఎల్.రావు గంగా-కావేరి పథకం గురించి మాట్లాడుతుంటారు. నిజానికి కె.ఎల్.రావు పథకమనేది ప్రస్తుతం లేదు. అది అసాధ్యమైనందున అందుకు బదులు కేంద్ర ప్రభుత్వం ‘నేషనల్ పెర్‌స్పెక్టివ్ ప్లాన్’ పేరిట మరొక పథకం రూపొందించింది. నిజానికి అది కూడా మన రాష్ట్రానికి నష్టదాయకమే. అందుకే దానిని రాష్ట్ర ప్రభుత్వం మొదటినుండి వ్యతిరేకిస్తూ వచ్చింది. అటువంటిది ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హఠాత్తుగా, ఎవరితోనూ చర్చించకుండా కొత్త వైఖరి ఎందుకు తీసుకొన్నారన్నది జాగ్రత్తగా అర్థం చేసుకోదగిన విషయం.
Read Full Post »
Posted in తెలుగు, నీల్లు నిజాలు on Jan 24th, 2006
అప్పటి మన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుగారు ఢిల్లీ వెళ్ళినప్పుడు ప్రధానమంత్రిని, ఉపప్రధానిని కలిసి గంగా-కావేరీ పథకాన్ని సత్వరం అమలు చేయాలని ప్రతిపాదించారని, అందుకు అనుగుణంగా వాజ్‌పేయి, అద్వానీ పరిశీలిస్తామని హామీ ఇచ్చారని వార్తలు వచ్చినపుడు కొంపదీసి సూర్యుడు పశ్చిమాన ఉదయించాడా అన్నంత షాక్ కలిగింది. దాదాపు 20 ఏళ్ళనుండి నదుల అనుసంధానం ప్రతిపాదనకు ససేమిరా అంటూ ఏమాత్రం అడుగు ముందుకు సాగనివ్వకుండా జాతీయ జల అభివృద్ధి సంస్థ (NWDA) వారి అన్ని స్కీంలకు అడ్డు తగుల్తున్న మన రాష్ట్ర [...]
Read Full Post »
Posted in తెలుగు, నీల్లు నిజాలు on Jan 24th, 2006
డాక్టర్ కె.ఎల్.రావు గంగా-కావేరీ పథకంలో ఎక్కువ పంపింగు ఆవశ్యకత ఉంది. ఆ అవసరం లేకుండా మహానది, గోదావరి నదులలోని మిగులు జలాలను ఉపయోగించి ఆ పథకంలోని లాభాలను చవకగా పొందవచ్చు అని కేంద్రం అభిప్రాయపడి, ఆ దిశలో నేషనల్ పెర్‌స్పెక్టివ్ ప్లాన్ (ఎన్‌పిపి)ని రూపొందించింది. 1980లో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన జాతీయ పెర్‌స్పెక్టివ్ పథకం ఈ కింది అంశాలను పరిగణనలోకి తీసుకుంది.
Read Full Post »
Posted in తెలుగు, నీల్లు నిజాలు on Jan 24th, 2006
జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎస్‌డబ్ల్యుడిఎ) హిమాలయ నదుల అభివృద్ధి, ద్వీపకల్ప నదుల అభివృద్ధి పథకంపైన అధ్యయనం చేసి వెలువరించిన నివేదికలను ఎప్పటికప్పుడు భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన సాంకేతిక సలహా సంఘం ఎదుటపెట్టేది. ఈ సంఘంలోని సభ్యులు తమ రాష్ట్రాలకు లాభం కలిగించే ప్రతిపాదన అవుతే స్వాగతించడం, నష్టం చేకూర్చేదయితే తిరస్కరించడం ఆనవాయితీగా జరుగుతూ ఉండేది. ఉదాహరణకు మహానదిలో మిగులు జలాలున్నాయన్న కేంద్రం అభిప్రాయంతో ఒరిస్సా ససేమిరా ఏకీభవించేది కాదు.
Read Full Post »
Posted in తెలుగు, నీల్లు నిజాలు on Jan 24th, 2006
మన రాష్ట్రంలో మూడు పెద్ద నదులు గోదావరి, కృష్ణ, పెన్నా కాక 37 మధ్యతరహా, చిన్న నదులున్నాయి. ఈ నదులన్నీ కలిసి మన రాష్ట్రానికి 2746 టి.ఎం.సి.ల నీరందిస్తున్నాయి. ఇందులో గోదావరి 55 శాతం అంటే 1480 టి.ఎం.సి.ల నీరు కృష్ణ 29 శాతం అంటే 811 టి.ఎం.సి.ల నీరు అందిస్తున్నాయి. గోదావరి నదీ జలాలపై మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్, ఒరిస్సా రాష్ట్రాలకు హక్కుంది.
Read Full Post »
Posted in తెలుగు, నీల్లు నిజాలు on Jan 24th, 2006
అంతర్ రాష్ట్ర నదీ జలాల విషయంలో ఏదైనా వివాదమొస్తే దాన్ని పరిష్కరించే నిమిత్తం Inter State Water Disputes Act, 1956 (అంతర్ రాష్ట్ర జల వివాద చట్టం) అనుసరించి ఒక ట్రిబ్యునల్‌ని (న్యాయపీఠాన్ని) కేంద్రం ఏర్పాటు చేస్తుంది. ఏప్రిల్, 1969లో అలాంటి ట్రిబ్యునల్‌ని భారత ప్రభుత్వం, కృష్ణా నదీజలాల పంపకం విషయంలో తీర్పు ఇచ్చే నిమిత్తం ఏర్పాటు చేసింది.
Read Full Post »
Posted in తెలుగు, నీల్లు నిజాలు on Jan 24th, 2006
ప్రతి ఏడూ ఇదే గొడవ. 150 సంవత్సరాల చరిత్ర ఉన్న కృష్ణా డెల్టాకు ముందుగా, సాగర్‌లో ఉన్న కొద్దిపాటి నీటిని ఇవ్వాలని డెల్టా రైతాంగం, సాగర్ ఆయకట్టును ఎండబెట్టి డెల్టాకు నీరిస్తే ఊరుకునేది లేదని సాగర్ ఆయకట్టు రైతాంగం, శ్రీశైలం నుండి నీటిని రాయలసీమకు ఇవ్వకుండా, సాగర్‌కు నీరు ససేమిరా ఇవ్వకూడదని రాయలసీమ రైతాంగం ధర్నాలు, నిరాహార దీక్షలు, నిరసనలు జరపటం, అటు ఇటుగా దాదాపు అన్ని రాజకీయపక్షాలు తమ పార్టీ ధర్మాన్ని పక్కనబెట్టి తమ ప్రాంత [...]
Read Full Post »
Posted in తెలుగు, నీల్లు నిజాలు on Jan 24th, 2006
కృష్ణ్ణా మిగులు జలాలపై మహారాష్ట్ర, కర్నాటకలకు ఎలాంటి హక్కు లేదు. వాటిని సంపూర్ణంగా ఉపయోగించుకునే స్వేచ్ఛ మనకుంది. కాని, చట్టపరమైన హక్కులేదు. ఇది క్లాజు 5 (సి)లో రాసుంది. ఈ స్వేచ్ఛను ఉపయోగించుకునే మనం మిగులు జలాల ఆధారంగా తెలుగుగంగ, శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్‌ఎల్‌బిసి)ను నిర్మిస్తున్నాం. నెట్టంపాడు, కల్వకుర్తి, గాలేరు నగరి, హంద్రీ నీవా మొదలైన ప్రాజెక్టులకు రూపకల్పన చేసుకున్నాం.
Read Full Post »