Posted in తెలుగు, సలాం హైద్రాబాద్ on Nov 2nd, 2009
”బిష్ణు అజ్ నై చూఁ హికాయత్ మీకునద్” ”పిల్లనగ్రోవి ఏదో కథ చెప్తున్నది. విను.” అంటూ జగత్ప్రసిద్ధమైన తన మస్నవీ కథలు చెప్పటం మొదలు పెట్టినాడు మోలానా రూమీ. వెదురుపొదలోంచి వేరు చేయబడిన వెదురుముక్క మూగగా పడి వున్నది. ఉలుకదు – పలుకదు. ఎవరైనా పలికించాలని ఊదితే బర్ – బర్ అనే సవ్వడే కాని ఒక్క సుస్వరం వెలువడదు. అన్నీ అపస్వరాలే.
Read Full Post »
డిట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్ పుస్తక చర్చా సమీక్ష పుస్తకం: సలాం హైద్రాబాద్ (తెలంగాణ నవల), రచయిత: లోకేశ్వర్ ; గాంధి ప్రచురణలు, హైద్రాబాద్ (2005) ఈ నవల గురించి రచయిత తన ముందు మాటగా చెప్పుకున్న వివరాల ప్రకారం, ఈ నవలాకాలం 1578 నుండి జూలై 10, 1970 వరకు. ఇందులోని ముఖ్య వస్తువులు హైద్రాబాద్ చరిత్ర, నగరంలో నడిచిన ఉద్యమాలు, స్వామి అనే ఒక పి. యు. సి. విద్యార్ధి ఆత్మకథ. ఈ మూడు [...]
Read Full Post »
Posted in తెలంగాణ చరిత్ర, సలాం హైద్రాబాద్ on Dec 31st, 2006
… చావూష్‌ల గురించి ప్రత్యేకంగనే చెప్పుకోవాలె. వీళ్ళందరూ అఫ్రికాకు సంబంధించిన ముస్లింలు. వీరు ప్రధానంగ రెండు దేశాలకు ఎమెన్, అబిసీనియాలకు చెందినవాళ్ళు. అబిసీనియా కొత్త పేరు ఇథియోపియా. అబిసీనియా వాళ్ళను ‘హబ్సీ’లు అని కూడ అంటరు. నగరంలోని హబ్సిగుడా వీళ్ళకు సంబంధించినదే. వీళ్ళను చూడంగనే నీగ్రోలని సులభంగ గుర్తించవచ్చు. ఈ హబ్సీలు అనగా చావూష్‌లు హైద్రాబాద్ నగరానికి చేరుకున్న వైనం ఒక ఇతిహాస గాథ.
Read Full Post »