Feed on
Posts
Comments

Category Archive for 'హైదరాబాద్‌ ఎవరిది?'

ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఇంతకాలం బతికి బట్టకట్టడానికి కారణం ప్రజలే తప్ప ప్రభువులు కారనడానికి గురువారం నాటి తొలిదశ పోలింగ్‌ సరళీ, పోలింగ్‌ ముగిసీ ముగియకముందే ముఖ్యమంత్రి ప్రదర్శించిన బాధ్యతారాహిత్యం మరోసారి రుజువు చేశాయి. కష్టనిష్టూరాలకు ఓర్చి ప్రజలు ఓటర్లుగా తమ బాధ్యతను నెరవేర్చుకున్నారు. కానీ రాజకీయలోకానికి ఆదర్శంగా నిలబడవలసిన పదవిలో ఉండి కూడా ముఖ్యమంత్రి వై.ఎస్‌. తెలంగాణలో పోలింగ్‌ ముగిసిన క్షణాన, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఓట్ల కోసం నోరుజారి పిసిసి అధ్యక్షుడు […]

Read Full Post »

-కడెంపల్లి సుధాకర్‌
మన ముఖ్యమంత్రి ఎన్నికలను ఎప్పుడూ ఒక క్రీడగా పోల్చుతారు. క్రీడా స్ఫూర్తితో పాల్గొంటే వచ్చే ఎన్నికలలో ‘బంగారు పతకం’ పొందడం ఖాయమని ఆయన పదే పదే అంటున్నారు. అయితే ఏ ఆటలోనైనా గెలవాలంటే ఆ ఆటలో విధిగా అనుసరించాల్సిన కొన్ని నియమాలు, ఒక క్రమశిక్షణ ఉంటాయన్న వాస్తవాన్ని ఆయనగాని , ఎవరుగాని మరచిపోకూడదు.

Read Full Post »

- నాగోబా ( శ్రీధరరావు దేశ్‌పాండే)
ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ, తెలంగాణ అనివార్యమవుతున్న వేళ కాంగ్రెస్ పాలకవర్గాలు తెలంగాణను వంచించడానికి కొత్తదారులను వెతుక్కుంటున్నాయి. కొత్త సాకులతో ముందుకు వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేయడంతో కాంగ్రెస్‌కు తెలంగాణను అడ్డుకునేందుకు అన్ని దారులు మూసుకుపోయినట్లుంది.

పూర్తి వ్యాసాన్ని చదువనీకి ఇక్కడ క్లిక్ చేసి PDF డౌన్‌లోడ్ చేసుకోంరి

(17 అక్టోబర్ 2009, వార్త సౌజన్యం తోటి)

Read Full Post »

లెక్కల్లో హైదరాబాద్‌ ఎవరికి దక్కేను? వ్యాసానికి సి. శ్రీనివాస్‌ జవాబు
నాలుగు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన హైదరాబాద్‌ నగర నిర్మాణ పునాది నుంచి అణువణువునా తెలంగాణ ప్రజలతోపాటు కోస్తా, రాయలసీమ ప్రజల కష్టం కలగలిసి ఉంది. ఎవరో ఏదో చెప్పారనో లేదా కేవలం కొన్ని ప్రాంతాల నాయకులు హైదరాబాద్‌ను అభివృద్ధి పథంలో న డిపారనో దాని మీద కోస్తా, రాయలసీమవాసులకు హక్కుందని అంటున్నారన డం అర్థరహితం. గోల్కొండ కోట కట్టించింది నిడదవోలు వీర భద్రుడి బంధువులు ఆంధ్రనగరి పాలకులైన కాకతీయులైతే […]

Read Full Post »

- సి. విఠల్‌, శ్రీధరరావు దేశ్‌పాండే
అసమ అభివృద్ధికి సంబంధించిన అసంతృప్తులు దేశంలోని అనే క ప్రాంతాలలో స్వాతంత్య్రసిద్ధి నాటినుంచి ఉన్నప్పటికీ ప్రత్యే క రాష్ట్రం కోసం తొలినుంచి డిమాండ్‌ చేసిన గడ్డ బహుశా తెలంగాణ ఒక్కటేనేమో? ప్రత్యేక తెలంగాణ ఆరాటంలో ముల్కీ ఉద్య మం (1952) తొలి దశ కాగా ప్రత్యేక తెలంగాణ ఉద్యమం (1969) మలి దశ. వర్తమాన తెలంగాణ ఉద్యమం (ఇది తుది, ఫలప్రదమైన దశ అవగలదని ఆశిద్దాం) 1990ల నుంచి నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ […]

Read Full Post »

- కట్టా శేఖర్‌ రెడ్డి
ఇప్పుడు తెలంగాణను తెచ్చుకున్నా అది దొరలపాలవుతుంది. బడుగులకు రాజ్యాధికారం దక్కదు. వై.ఎస్‌. నేతృత్వంలో పూర్తిస్థాయి అభివృద్ధి జరిగాక ప్రత్యే క రాష్ట్ర అంశం తెరపైకి రావాలి. ప్రస్తుత తరుణంలో ప్రత్యేక రాష్ట్రం కంటే అభి వృద్ధే ముఖ్యం.
-తెలంగాణ డిసిసి అధ్యక్షులు, ఎమ్మెల్సీలు
‘ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటయితే కోస్తాంధ్రుల పెత్తనం ఎక్కువయి పోతుంది. వారితో నెగ్గలేం. మాకు ప్రత్యేక రాష్ట్రం వద్దు. మద్రాసు రాష్ట్రం లోనే కొనసాగుతాం’- ఇది అప్పట్లో ఆంధ్ర రాష్ట్ర ఉద్య మానికి […]

Read Full Post »

- అల్లం నారాయణ
ప్రపంచ బ్యాంకు రుణాలొస్తున్నాయి. అభివృద్ధి పధాన పయనిస్తున్నప్పుడు ఇందిరమ్మ ఇళ్లు తీసుకోండి, నిధులు పారుతున్నప్పుడు కాసుల గలగలతో అభివృద్ధి పధంలో మాత్రమే నడవండి. . . అందాకా. . . . కాస్త నోరు మూసుకోండి.
కొంచెం నోరు మూసుకుంటారా! ఆవల చాలా అభివృద్ధి చెయ్యాల్సి ఉన్నది. భూమిని చాప చుట్టాల్సి ఉన్నది. ఈ మహానగరం చుట్టూ రింగురోడ్డు మహాసర్ప పరిష్వంగాన్ని బిగించాల్సి ఉన్నది. కొంచెం ఆ గొణగడం. . . సణగడం ఆపుతారా!

[…]

Read Full Post »

Managed by Discover Telangana Inc., a registered nonprofit organization in USA.

All opinions and views expressed by third party content providers and shown here as preview are not that of Discover Telangana.

If you find any Content that is infringing, libelous, defamatory, obscene, abusive, offensive or otherwise violation of copyright law, alert us by emailing us at discover.telangana(at)gmail.com