Posted in తెలుగు, నిజాం చర్చ, ఆంధ్రజ్యోతి on Dec 6th, 2007
- సంగిశెట్టి శ్రీనివాస్ ‘మీకు చరిత్ర లేదు. ఉంటే గింటే అది హీన చరిత్రే, చరిత్ర హీనులే’ అని యాభై ఏళ్ళుగా ఆంధ్ర వలసవాదులు రాస్తున్న పుస్తకాలు, చేస్తున్న విష ప్రచారం తెలంగాణ అంతటా పాఠ్యపుస్తకాలై విస్తరించాయి. ‘ప్రారంభం నుంచి చివరి వరకూ ఏ ప్రాంతీయ తేడాలు లేకుండా తెలంగాణ పోరాటం తెలుగు ప్రజలందరి పోరాటంగా విశాలాంధ్ర కమ్యునిస్టు కమిటీ నాయకత్వంలో జరిగిం’దని అబద్ధాల్ని అక్షరబద్ధం చేస్తున్నారు. ‘ఈ పోరాటంలో వీర తెలంగాణ రైతాంగమూ, ఈ రైతాంగ [...]
Read Full Post »
Posted in తెలుగు, నిజాం చర్చ, ఆంధ్రజ్యోతి on Dec 6th, 2007
- వరవరరావు హైదరాబాద్ నగరంలో చార్మినార్ పాతబస్తీలో ప్రవేశిం చండి- లేదా నగరంలో ఎక్కడైనా కాళ్లు చేతులాడించే బతుకుదెరువు మార్గాలను వెతుక్కునే వాళ్లను చూడండి-వాళ్లు ముస్లింయి ఉంటారు, లేదా దళితులయి ఉంటారు. చంద్రశేఖర్‌రావు నాలుగున్నరవందల సంవత్సరాల వీళ్ల సంస్కృతి గురించి మాట్లాడి ఉండవలసింది. వీళ్లు భాషా సాహిత్యాలకు చేసిన సృజనాత్మక సేవ గురించి మాట్లాడి ఉండవలసింది.
Read Full Post »
Posted in తెలుగు, నిజాం చర్చ, ఆంధ్రజ్యోతి on Dec 5th, 2007
- ఎన్. వేణుగోపాల్ జేమ్స్ జాయిస్ నవల ‘యులిసెస్’ లో ఒక పాత్ర- ‘చరిత్ర నేను మేల్కొనదలచుకున్న ఒక పీడకల’ అంటుంది. ‘చరిత్రంటే జనం అంగీకరించడానికి ఇష్టపడే మిధ్య’ అన్నాడట నెపోలియన్. ఇవాళ పీడకల అయిన చరిత్ర నుంచి మేల్కొనడానికి ప్రయత్నిస్తున్న తెలంగాణ మిధ్య అయిన చరిత్రలోకి ప్రయాణిస్తున్నటున్నది. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు ఏ కారణంతో ఈ వివాదం రేకిత్తించారో, ఆ కారణం ఫలిస్తుందో లేదో తెలియదు గాని, ‘చారానా దావత్‌కు బారానా టాంగా’ అన్నట్టు [...]
Read Full Post »
Posted in తెలుగు, నిజాం చర్చ, ఆంధ్రజ్యోతి on Dec 4th, 2007
- నందిని సిధారెడ్డి మరోసారి కెసిఆర్ వివాదస్పద వ్యాఖ్య చేశారు. ఈ సారి వ్యాఖ్య వరకే ఆగకుండా సాగదీసి నిర్భయంగా సహజ అతివాదానికి పూనుకోవటం మరింత చర్చకు దారితీసింది. నిజాం రాజులు మంచివారని, వాళ్ల పాలన భేషుగ్గా ఉందని సమాధి దగ్గర ప్రస్తుతించటంతో పాటు తర్వాత అదేమాట వెయ్యి సార్లు అంటానని ప్రకటించుకున్నారు. తెరాస ప్రతినిధి ప్రకాశ్ అయితే గ్రామ గ్రామాన నిజాం విగ్రహాలు నెలకొల్పుతాని కూడా పొడిగించారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మైనారిటీ ఓట్లకోసం కెసిఆర్ [...]
Read Full Post »
Posted in తెలుగు, నిజాం చర్చ, ఆంధ్రజ్యోతి on Dec 2nd, 2007
- కె. రామచంద్రమూర్తి ఉన్నత పదవులలో ఉన్న రాజకీయ నాయకులకు అనేకమంది సలహాదారులు ఉంటారు. నాయకుడు అడిగితే సలహాలు చెప్పేవారు కొందరైతే అయాచితంగా సూచనలు చేసేవారు కొందరు. ఏ సలహాను స్వీకరిస్తారన్న దానిపైన నాయకుల జయాపజయాలు ఆధారపడి ఉంటాయి. ఎంతమంది ఎన్ని రకాల సలహాలు ఇచ్చినా అంతిమ నిర్ణయం తీసుకోవలసింది నాయకులే.
Read Full Post »
Posted in తెలుగు, నిజాం చర్చ, ఆంధ్రజ్యోతి on Dec 2nd, 2007
- కట్టా శేఖర్‌రెడ్డి నిజాం నవాబుల సుదీర్ఘపాలనలో రజాకార్ల ఆగడాలు జరిగింది చాలా తక్కువ కాలమే. ఆ సమయంలో ప్రజలు బాధ పడింది నిజమే. అయితే ఏ దేశంలోనయినా, ఏ సమాజంలో నయినా గత వైభవాన్ని స్మరించుకోవడం సంప్రదాయం. ప్రజలను పీడించిన రాజుల మంచి పనులనూ కీర్తిస్తూనే ఉన్నాం. అదే విధంగా ఈ ప్రాంతానికి మేలు చేసిన నిజాంకు, కాకతీయ రాజులకు సైతం సలాం చేస్తాం. దాంట్లో తప్పే ముంది?… అవును. నిజాంల గురించి ఒకటి కాదు… [...]
Read Full Post »
Posted in తెలుగు, నిజాం చర్చ, ఆంధ్రజ్యోతి on Dec 1st, 2007
- అల్లం నారాయణ నిజామ్‌కు మొక్కుమంటవా ! దొరా ! నీబాంచెన్. నిజాం ఏడేడు తరాలకు దండేసి దండం పెట్టమంటవా ! ఆయనకే కాదు. తెలంగాణను పొరుకపోడుచేసిన జాగీర్దార్లు, జమీందార్లు, దేశ్‌ముఖ్‌లు, రెడ్లు, వెలమదొరలకు కూడా సాగిలపడి సలామ్ చెయ్యమంటవా! ఎన్నేండ్లు మొక్కమంటవు. ఎన్నేండ్లు బాంచెగిరి చెయ్యమంటవ్.
Read Full Post »
Posted in తెలుగు, నిజాం చర్చ, ఆంధ్రజ్యోతి on Dec 1st, 2007
- తెలంగాణ కవులు, రచయితలు ఎన్నాళ్లుగానో ఇటు కమ్యూనిస్టులు, అటు భారతీయ జనతాపార్టీ- నిజాం పాలనా కాలాన్ని తప్పుగా చిత్రిస్తూ వస్తున్నాయి. ఇంత కాలానికైనా మంచి చర్చకు కెసిఆర్ తలుపులు తెరిచారు. కెసిఆర్ మాట్లాడిన విషయాల మీద ఎప్పటికైనా చర్చ జరగవలసిందే. ఆయన చెప్పినవి వాస్తవాలే. ఇప్పటికైనా ఆ విషయాలు చర్చకు వచ్చినందుకు సంతోషం. అప్పటి పోరాటాలను స్మరించుకుంటూనే, రజాకార్ల దుర్మార్గాలను విమర్శిస్తూనే, నిజాం రాజు దురాగతాలను ఖండిస్తూనే ఆయన చేసిన మంచిని గుర్తుచేసుకోవడం, స్మరించుకోవడం ఎంత [...]
Read Full Post »
Posted in తెలుగు, నిజాం చర్చ, ఆంధ్రజ్యోతి on Nov 30th, 2007
- వి.ప్రకాశ్ నిజాం పాలనలో మతసామరస్యం వెల్లివిరిసిందని చెబుతూ, పీడకులైన రాజులు చేసిన మంచిపనులను కీర్తిస్తే తప్పెలా అవుతుందని తెరాస అధ్యక్షులు కెసిఆర్ చేసిన వ్యాఖ్యలను కొందరు వివాదాస్పదం చేస్తున్నారు. నిజాం పాలనకు కెసిఆర్ వంద మార్కులు వేసినట్లు, తెలంగాణ సాయుధపోరాటాన్ని, అమరుల త్యాగాలను అవమానపర్చినట్లు విపరీతవ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రపంచ చరిత్రలోనే అరుదైన మహోజ్వల పోరాటం తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటం. కెసిఆర్‌తో పాటు తెరాసలోని ప్రతి ఒక్కరూ ఆ పోరాటయోధుల వారసత్వాన్ని కొనసాగించాలనే ఆరాటపడుతున్నారు. అమరుల [...]
Read Full Post »
వర్తమానంలో సరైన దృక్పథాన్ని ఏర్పరచుకోవడానికీ, నిర్మాణాత్మకమైన నిర్ణయాలు తీసుకోవడానికీ గతాన్ని సవ్యంగా అర్థం చేసుకోవాలి. గతాన్ని అపార్థం చేసుకొని వర్తమానాన్ని సంక్షోభంలోకి నెట్టుకోవడం వివేకవంతుల లక్షణం కాదు. రాజకీయ నాయకులు ప్రతి అక్షరం ఆచితూచి మాట్లాడాలి. చరిత్రను బోధించే అధ్యాపకుడు లేదా చరిత్రను అన్వయించే రచయిత హైదరాబాద్ నిజాంపైన ఎటువంటి అభిప్రాయం వెలిబుచ్చినా పెద్ద నష్టం ఉండకపోవచ్చు. నిజాం పాలన గురించి ప్రముఖ కవి కాళోజీ మాట్లాడినంత వివాదాస్పదంగా తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడు చంద్రశేఖరరావు (కేసీఆర్) [...]
Read Full Post »
Posted in తెలుగు, నిజాం చర్చ, ఆంధ్రజ్యోతి on Nov 28th, 2007
- తెలకపల్లి రవి ‘చుట్టు ముట్టు సూర్యాపేట, నట్టనడుమ నల్లగొండ, నీవుండే హైద్రాబాదు, దాని పక్కా గోలకొండ, గోలకొండ ఖిల్లా కింద, గోలకొండ ఖిల్లా కింద, నీ గోరి కడ్తము కొడకో నైజాము సర్కరోడా!‘ ఎప్పుడు ఎక్కడ ఎవరు పాడినా ఉర్రూతలూపే పాట. సుప్రసిద్ధమైన ఈ ప్రజా గీతాన్ని సాహిత్య శిల్పానికి ఉదాహరణగా తరచూ చెబుతుంటాను. ఎందుకంటే ఇందులో మొదటగా భూగోళ శాస్త్రంలా ఊళ్ళ పేర్ల జాబితా ఇస్తున్న కవి యాదగిరి ఒక్కసారిగా దాన్ని మలుపు తిప్పుతాడు. [...]
Read Full Post »
Posted in తెలుగు, నిజాం చర్చ, ఆంధ్రజ్యోతి on Nov 26th, 2007
(ఆన్‌లైన్, సిటీబ్యూరో): ‘తరతరాల బూజు నిజాం రాజును కీర్తించడం కె.చంద్రశేఖరరావు అహంభానికి దర్పణం. అంతేగాక, వేలాదిమంది అమరవీరుల త్యాగాలను కించపరడమే’నని తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ ఒక ప్రకటనలో విమర్శించింది. రాచరిక పాలనను ప్రశంసించడమంటే ప్రజల గోళ్లు ఊడగొట్టి వసూలు చేసే పన్నుల పద్ధతిని సమర్థించడమే అవుతుందని కమిటీ నాయకులు పేర్కొన్నారు. దీన్ని తెలంగాణ ప్రజలు గట్టిగా వ్యతిరేకిస్తున్నారని వారు పేర్కొన్నారు.
Read Full Post »
Posted in తెలుగు, నిజాం చర్చ, ఆంధ్రజ్యోతి on Nov 26th, 2007
– సురవరం సుధాకర్‌రెడ్డి ప్రజాకంటకంగా సాగిన నిజాం పాలనను పొగడటం ద్వారా తెలంగాణ విముక్తి పోరాటాన్ని కేసీఆర్ అవమానించారని సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి విమర్శించారు. “నిజాం పాలన 20వ శతాబ్దకాలంలో ఉండకూడనిది. పౌరహక్కులు లేకుండా వెట్టిచాకిరీ, దోపిడీ వ్యవస్థతో కూడిన ఆ దుర్మార్గ పాలనపై ప్రజలే తిరుగుబాటు చేశారు.
Read Full Post »
Posted in తెలుగు, నిజాం చర్చ, ఆంధ్రజ్యోతి on Nov 26th, 2007
హైదరాబాద్, నవంబర్ 26 (ఆన్‌లైన్): “నాలుగు వందల యాభై సంవత్సరాల నిజాం పరి పాలనలో మత సామరస్యం వెల్లివిరిసింది. విభిన్న సంస్కృతులకు చెందిన అన్ని మతాల ప్రజలూ సహజీవనం చేశారు. నిజాం నవాబుల సుదీర్ఘ పరిపాలనలో రజాకార్ల అరాచకాలు జరిగింది చాలా తక్కువ కాలమే. ఆ సమయంలో ప్రజలు బాధ పడింది నిజమే. అయితే ఏ దేశంలోనైనా, ఏ సమాజంలోనైనా గత వైభవాన్ని స్మరించుకోవడం సంప్రదాయం.
Read Full Post »