- మొహమ్మద్ ఇర్ఫాన్ ప్రపంచంలో కెల్లా అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం మనది. ఇక్కడ జరిగే ఎన్నికల్లో ప్రతిసారి విదేశాలలో నివసిస్తున్న లక్షలాది మంది ప్రవాస భారతీయులు ఒకింత నిరాశకు గురికావడం ఒక అనవాయితీగా మారింది. దేశ దశ, దిశ నిర్దేశించే ఏ ఎన్నికల్లోనూ వీరికి ఓటు హక్కు లేకపోవడం ఇందుకు కారణం. అమెరికా, బ్రిటన్, రష్యాలతో పాటు ఫిలిప్పీన్స్, దక్షిణాఫ్రికా తదితర దేశాలకు చెందిన వారు విదేశాలలో నివసిస్తూ తమ దేశాల రాయబార కార్యాలయాలలో ఏర్పాటు [...]
Read Full Post »
Posted in ఎన్నికలు, తెలుగు, వివిధ, ఆంధ్రజ్యోతి, కవితలు on Apr 24th, 2009
- గుండెబోయిన శ్రీనివాస్ ఎవరినెక్కడ పెట్టవలనో ఎవరి పని ఇక పట్టవలెనో నీళ్లు నములుడు మానుకొని జర.. నిర్ణయిద్దామా !
Read Full Post »
Posted in ఎన్నికలు, తెలుగు, వివిధ, ఆంధ్రజ్యోతి, కవితలు on Apr 24th, 2009
- జూకంటి జగన్నాథం కావాల్నని తంతే తంతెకైనా కోపం వస్తది రేషం పుట్టువడి పాప దోషమే పెట్టుబడి
Read Full Post »
ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఇంతకాలం బతికి బట్టకట్టడానికి కారణం ప్రజలే తప్ప ప్రభువులు కారనడానికి గురువారం నాటి తొలిదశ పోలింగ్ సరళీ, పోలింగ్ ముగిసీ ముగియకముందే ముఖ్యమంత్రి ప్రదర్శించిన బాధ్యతారాహిత్యం మరోసారి రుజువు చేశాయి. కష్టనిష్టూరాలకు ఓర్చి ప్రజలు ఓటర్లుగా తమ బాధ్యతను నెరవేర్చుకున్నారు. కానీ రాజకీయలోకానికి ఆదర్శంగా నిలబడవలసిన పదవిలో ఉండి కూడా ముఖ్యమంత్రి వై.ఎస్. తెలంగాణలో పోలింగ్ ముగిసిన క్షణాన, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఓట్ల కోసం నోరుజారి పిసిసి అధ్యక్షుడు [...]
Read Full Post »
- వరవరరావు తెలంగాణలో ప్రజలు ఎన్నికల పట్ల ఎటువంటి వైఖరి తీసుకుంటున్నారు? ఎన్నికల సందర్భంగా మొత్తంగా వారిని వేధిస్తున్న సమస్యలు ఏమిటి? వ్యక్తమవుతున్న ఆకాంక్ష ఏమిటి? నక్సల్బరీ, శ్రీకాకుళ పోరాటాలు ప్రారంభమయ్యాక చారుమజుందార్ నాయకత్వాన్ని అనుసరించిన పార్టీ ఇస్తున్న ఎన్నికల బహిష్కరణ పిలుపును తెలంగాణ ప్రజలు ఏ విధంగా తమ ఆచరణలోకి అనువదించుకుంటున్నారు? వంటి ప్రశ్నలు ఆసక్తిదాయకమైనవే. స్థూలంగా ఇది తెలుగునేల కంతా వర్తించేవే.
Read Full Post »
- కె.శ్రీనివాస్ అభ్యర్థిత్వాలు కొనుక్కున్నవారు రేపు విధేయతలను అమ్ముకోరని ఎవరు చెప్పగలరు? నిన్న కాంగ్రెస్ అసమ్మతిని రగిలించి, ఫిరాయింపులను సాధించినట్టే, రేపు తెలుగుదేశం మాత్రం చేయదని ఎందుకు అనుకోవాలి? ఇది మహాకూటమి గెలిస్తే సంగతి. అలా కాక, మరోవిధంగా జరిగితే, తెలంగాణవాదం పరిస్థితి ఏమిటి? తెలుగుదేశం మాత్రం గట్టెక్కి, టిఆర్‌ఎస్ ఓడిపోతే పరిస్థితి ఏమిటి?
Read Full Post »
- జిందం అశోక్ తెలంగాణ అంటే అందరికి బతుకమ్మ పాట బతుకమ్మ ఆటైనది- ఒకడు పాడిన పాట
Read Full Post »
Posted in ఎన్నికలు, వ్యాసాలు, English on Apr 3rd, 2009
- D Rama Krishna Reddy In the last week of October 2008, the core group of the UPA government met in New Delhi to find a solution to the demand for a separate state of Telangana and to consider its implications for the general elections in 2009. The issue has assumed importance once again. The [...]
Read Full Post »
- సిలివేరు హరినాథ్ కోట్లాది మంది ప్రజల ఆకాంక్ష, వందలాది మంది విద్యార్థి అమర వీరుల త్యాగాల స్ఫూర్తి తెలంగాణ. ఇప్పుడది రాజకీయ చదరంగంలో పరాజయం అంచులో ఉంది. మహాకూటమి, కాంగ్రెస్, పీఆర్పీల పందేరంలో తెలంగాణ నిస్పహాయురాలై ఉంది. తెలంగాణ ప్రజలు నమ్మిన వారి చేతిలో మోసపోతూనే ఉన్నారు. చరిత్ర ఎన్నో సార్లు దీన్ని నిరూపించింది.
Read Full Post »
కోట్ల డబ్బులు అయిపోయాయి పనులింకా పూర్తి కాలేదు ఆర్భాటంగా ప్రాజెక్టుల పెంపు ఇలాగైతే పదిహేనేళ్లయినా పట్టొచ్చు పెరిగిపోతున్న అంచనా వ్యయం నాణ్యతకు తిలోదకాలు రైతన్నకు నీరు అందేదెన్నడు? – ఎం.ఎల్.నరసింహారెడ్డి, న్యూస్‌టుడే జనరల్‌బ్యూరో ముఖ్యమంత్రి వై.ఎస్. గద్దెనెక్కగానే ఘనంగా ప్రకటించుకున్నదీ… అపరభగీరథుడినంటూ తనకు తాను కితాబునిచ్చుకున్నదీ…. ప్రధానీ తదితర ప్రముఖులందరికీ ప్రముఖంగా చూపించుకున్నదీ… ప్రపంచంలోనే నభూతో… అని చాటుకున్నదీ…. జలయజ్ఞం! మరి.. ఆ యజ్ఞం ఇప్పుడెక్కడికొచ్చింది? ఫలం ఎలా ఉంది? నీటి ప్రాజెక్టుల పరిస్థితేంటి? ఎన్ని పూర్తయ్యాయ్! [...]
Read Full Post »
- వరవరరావు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పార్లమెంటులో బిల్లు పెట్టాలనే డిమాండ్‌తో ప్రజా గాయకుడు గద్దర్ వరంగల్, హనుమకొండ, కాజీపేటలలో 2008, డిసెంబర్ 11 నుంచి 15 వరకు పాదయాత్ర తలపెట్టాడు. ఈ పాదయాత్రలో ఆ మూడు పట్టణాల్లో ఆయన ప్రతి గడప తొక్కి ప్రతి ఇంటిలో పౌరుల కడుపులో తలపెట్టి తన ఈ డిమాండుకు సంఘీభావం ప్రకటించాలని కోరుతానన్నాడు.
Read Full Post »
Posted in ఎన్నికలు, తెలుగు, వ్యాసాలు, వీక్షణం on Feb 16th, 2009
- మహమ్మద్ షఫీయొద్దీన్, దేవాత్ సురేష్ తమ ప్రాంత వెనుకబాటుతనాన్ని రూపుమాపడానికి ఎవరైనా ఉద్యమించవచ్చు కాని, మరో ప్రాంత ఆకాంక్షలకు పోటీగా వాదనలు తేవడం సరికాదంటున్నారు మహమ్మద్ షఫీయొద్దీన్, దేవాత్ సురేష్ అభివృద్ధికి నోచుకోలేక, పాలకుల నిర్లక్ష్యానికి గురై, పేదరికంతో బాధపడుతూ, తాగు, సాగు నీటికి సకల ఇబ్బందులు ఎదుర్కొంటూ నిధుల పంపిణీలో సమాన వాటా రానందుకు ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం ఏర్పాటును కోరుకుంటున్నామని రాయలసీమ నాయకులు ప్రకటిస్తే అందులో అర్థం పరమార్థం ఉన్నాయి. అలా కాకుండా [...]
Read Full Post »
Posted in ఎన్నికలు, తెలుగు, వ్యాసాలు on Nov 18th, 2008
- ఎన్ వేణుగోపాల్ కోరుకున్నంత సంపూర్ణమైన సంతోషం దక్కనప్పుడు మనుషులు అల్పసంతోషులుగా మారుతారు. జరగనిదాన్ని కూడ జరిగినట్టు భావించి సంతోషపడుతుంటారు. కొంచెం జరిగినా కొండంత జరిగినట్టు పొంగిపోతుంటారు. ఏమీలేని చోటకూడ తమకు కావలసిన అర్థాలు వెతుక్కుని ఏదో ఉన్నదని చెప్పడానికి ప్రయత్నిస్తారు. ఇది ఒక చిత్తవృత్తి.
Read Full Post »
Posted in ఎన్నికలు, తెలుగు, వ్యాసాలు on Jun 15th, 2008
- యం. కోదండరాం, కె. సీతారామారావు I భారతదేశంలో ఎన్నికలు, ఈమధ్యకాలంలో, కేవలం ప్రతినిధులను ఎన్నుకోవడానికే కాక విధాన నిర్ణయ ప్రక్రియలో ప్రజలు భాగస్వామ్యం పొందడానికి, విధాన నిర్ణయ ప్రక్రియను ప్రభావితం చేయడానికి కావలసిన శక్తిని, ప్రభావాన్ని పొందడానికి కూడా ఉపయోగపడుతున్నాయి. అందుకే ఇటీవల కాలంలో కొన్ని పార్టీలు సామాజిక మార్పుకు ఎన్నికలను సాధనంగా వాడుతున్నాయి. మనరాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సాధనకు తెలంగాణ రాష్ట్ర సమితి ప్రధానంగా ఎన్నికలపైనే ఆధారపడింది. ఎన్నికల ద్వార సమైక్యవాదులను ఒంటరి చేసి, [...]
Read Full Post »
Posted in ఎన్నికలు, తెలుగు, వ్యాసాలు, Print PDFs on Apr 21st, 2008
- యం. కోదండరాం, కె. సీతారామారావు I తెలంగాణ రాష్ట్ర సమితి తరపున శాసనసభకు, శాసన మండలికి, పార్లమెంటుకు ఎన్నికైన ప్రజా ప్రతినిధుల రాజీనామాతో తలెత్తిన పరిస్థితిని అంచనా వేసుకోకుండా తెలంగాణ రాష్ట్ర సాధనఉద్యమం అనుసరించవలసిన వ్యూహాన్ని ఖరారు చేసుకోలేము. రాజీనామాకు దారితీసిన కారణాలను తెలుసుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ అనబడు సామాజికార్థిక, రాజకీయ వ్యవస్థ స్వరూప, స్వభావాలను అర్థం చేసుకోవాలె. తెలంగాణ పోరాటం, భాషా ప్రయుక్తత పేరుతో ఏర్పడిన ”ఆంధ్రప్రదేశ్” ఉమ్మడి వనరులను వాడుకొని ఎదిగి, సామాజికార్థిక వ్యవస్తలన్నింటిని [...]
Read Full Post »