అన్నల్లారా! అక్కల్లారా! మూడున్నర కోట్ల తెలంగాణ బిడ్డల్లారా… నిజాం పాలన పోతే బాధలన్ని పోతయనుకున్నం. మనం గాకపోయినా మన పొల్లగాండ్లయినా తెల్లగ బతుకుతరనుకున్నం. కాని నోరు అందల మెక్కుదామంటే నొసలు కట్టెలు మోపియ్యవట్టె. బతుకు పేనం మీది నుంచి పొయ్యిల పడ్డట్టాయె. బుదురకిచ్చి పొత్తు గూడుదామనిరి. ఉప్పేసి పొత్తు గూడిరి. మనం వద్దు వద్దన్నా బల్మీటికి బక్తున్ని జేసి పంగ నామాలు వెట్టిరి. తుడుసుకుందామంటే పోయేదా ఇడుసుకుందామంటే వచ్చేదా. ఎవలో ముగ్గురు ఒప్పుకున్నరని మూడు కోట్లమందిని బందీలు [...]
Read Full Post »
- శ్రీధర్ ధేశ్‌పాండే 1969 తెలంగాణ ప్రజా ఉద్యమానికి ఇప్పుడు 40 ఏళ్ళు, అయినా ప్రజల కోరిక ‘తెలంగాణ’ ఇంకా ఒక చేదు కల లెక్కనే మిగిలి ఉన్నది. 1969 తెలంగాణ ప్రజా ఉద్యమాన్ని గుర్తు చేసుకుంట ‘తెలంగాణ హిస్టరీ సొసయిటీ’, “1969 తెలంగాణ ఉద్యమ కరపత్రాలు” అనే శీర్షికతోటి ఒక పుస్తకం తీసుక రానీకి ప్రయత్నం చేస్తుంది.
Read Full Post »
Posted in తెలుగు, ప్రకటనలు, కరపత్రం, Print PDFs on Oct 27th, 2008
“ప్రజలారా ! తెలంగాణ రాష్ట్రం వస్తే తప్ప మన నీళ్ళు, నిధులు, ఉద్యోగాలు, బొగ్గు, భూమి తదితర వనరులు మనకు దక్కవు. రాజ్యాధికారం లేనిదే తెలంగాణ అభివృద్ధి సాధ్య పడదు. అందుకని దేశస్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, తెలంగాణపై ఏకాభిప్రాయం కుదిరినందున కాంగ్రెస్ ద్రోహపూరిత వైఖరిని ఎండగడుదాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పార్లమెంటులో తక్షణమే బిల్లు పెట్టమని డిమాండ్ చేద్దాం. నవంబర్ 1న ‘విద్రోహదినం’ సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా ఊరేగింపులు, ధర్నాలు, సదస్సులు జరిపి కాంగ్రెస్‌ని నిలదీద్దాం. తెలంగాణ [...]
Read Full Post »
- తెలంగాణ ఐ.టి.ఫోరం హైదరాబాదు రోడ్లమీద ట్రాఫిక్ నరకం నుండి బయటపడవేసే మెట్రో రైలు వస్తుందంటే శుభవార్తనే. ఇందులో ఒక లైను- సికింద్రాబాదు నుండి ఫలక్‌నుమాదాకా, రెండో లైను- నాగోల్ నుంచి అమీర్‌పేట మీది నుండి హైటెక్‌సిటీ దాకా, మూడోది- కూకట్‌పల్లి నుంచి నాంపల్లిదాకా వేస్తరట. దీని కోసం జంట నగరాలలో మొత్తం 5000 దుకాణాలు, 2000 ఇండ్లు, 147 స్కూళ్లు, కాలేజీలు, 120 దవాఖానలు, 54 గుళ్లు, మసీదులు, చర్చిలు కూలిపోతయి. హైదరాబాదుకు గుర్తుగా నిలిచిన [...]
Read Full Post »
Posted in తెలుగు, వివిధ, కరపత్రం on Oct 13th, 2008
- తెలంగాణ రచయితల వేదిక మేము కవులము, రచయితలము, కళాకారులం. మీ బతుకు ఆయసా యాలను కథలుగా, కవితలుగా పాటలుగా రాసెటోళ్ళం. మీ కాళ్ళకు దండం పెట్టి వేడుకుంటున్నం. మీరస్సలే సావకుండ్రి. బతికి కొట్లాడుండ్రి. మీ యెంట మేమున్నం. మీ గుండె గాయాన్ని ఈ గల్లీ నుంచి ఢిల్లీ దాన్క కైగట్టి ఇనిపిస్తం. నిన్ను అగ్గిల బొర్లిత్తున్నోళ్ళను జెండ కెక్కిత్తం.
Read Full Post »