View Survey
Category Archive for 'తెలుగు'
తురుమ్‌ఖాన్
Posted in తెలుగు, కథలు, Print PDFs on Apr 12th, 2011
- పసునూరి రవీందర్ Click here to download ThurumKhan – Story by Pasunoori Ravinder (PDF 95.6 KB)
సలాం హైద్రాబాద్ : పంతొమ్మిదో భాగం
Posted in తెలుగు, సలాం హైద్రాబాద్ on Mar 8th, 2010
19 తిరుగుబాటు వీరుడు తుర్రేబాజ్‌ఖాన్ జ్ఞాపకాల విషాదంతో స్వామి కోఠీ చౌరస్త నుండి బయలుదేరి బ్యాంక్ స్ట్రీట్‌ల ఉన్న ఫిరోజ్‌గాంధీ పార్క్‌లకు ప్రవేశించినాడు. నరేష్, వేణు ఇంక రాలేదు. ఎదురుగ పిల్లలగుంపు. పదిపన్నెండు సంవత్సరాల మధ్యల ఉన్నరు. పచ్చగడ్డిల ఎగురుతున్నరు. కలకల నవ్వుతున్నరు. గాలికి కదిలే పువ్వుల మాదిరి త్రుళ్లుతున్నరు. రకరకాల ఆటలు ఆడుతున్నరు. గోలగోలగ అరుస్తున్నరు. చెమటలు కారుతున్న వాండ్ల ముఖాలల్ల మిలమిల మెరుస్తున్న కండ్లు. పకపక నవ్వుతుంటే తెల్లగ మెరుస్తున్న పండ్లు. స్వామికి వాళ్లను [...]
సలాం హైద్రాబాద్ : పద్దెనిమిదో భాగం
Posted in తెలుగు, సలాం హైద్రాబాద్ on Mar 1st, 2010
18 1857 జూన్ 13 మధ్యాహ్న సమయం. జుహర్ నమాజుల కోసం మక్కా మసీదు ప్రాంగణంల అందరూ సమావేశమవుతున్నరు. కాని అందరి ముఖాలల్ల ప్రశాంతత కరువైంది. ఆందోళన, భయం అందర్నీ కమ్ముకొని ఉంది. దానికి కారణం మక్కా మసీదు గోడల మీద, తలుపుల మీద అంటించిన పెద్ద పెద్ద చేతిరాతల పోస్టర్లు. తెల్లని కాగితాల మీద ఆకుపచ్చ రంగుల రాతలు.
సలాం హైద్రాబాద్ : పదిహేడో భాగం
Posted in తెలుగు, సలాం హైద్రాబాద్ on Feb 22nd, 2010
17 రెసిడెన్సీ నుండి స్వామి మళ్లీ నడక సాగించినాడు. ఆంధ్రా బ్యాంకును దాటి సుల్తాన్ బజార్ లేన్‌ల నుండి నడుస్తున్నడు. కాలు పెట్ట సందులేదు. అన్నీ ఫుట్‌పాత్ దుకాణాలు నడిచొచ్చి నడిరోడ్డును ఆక్రమించుకున్నై. సైకిళ్లు, రిక్షాలు పద్మవ్యూహంల అభిమన్యుడిలాగ సందు చేసుకొని ముందుకు దూసుకపోతున్నై. సకలం సమస్త సామానులు సరసమైన ధరలకే అక్కడ అమ్మబడును. పేదోళ్ల షాపింగు సెంటర్ మదీనా బజార్ లేదా జుమ్మెరాత్ బజార్. దండోళ్ల షాపింగు సెంటర్ ఆబిడ్స్.
సలాం హైద్రాబాద్ : పదహారో భాగం
Posted in తెలుగు, సలాం హైద్రాబాద్ on Feb 15th, 2010
16 కాలేజీలు తెరిచినారు. ఉద్యమం ప్రారంభం అయ్యేనాటికి, ఇంకా మూడు నెలల సిలబస్ పూర్తి కావాల్సి ఉండేది. ఇప్పుడు ఒక నెలలనే హడావిడిగ సిలబస్ కంప్లీట్ చేసి డిసెంబరు నెలల పరీక్షలు నిర్వహించినారు. ఎంత చేసినా అప్పటికే ఒక విద్యా సంవత్సరం నష్టం అయ్యింది. ప్రాణత్యాగాలు కష్టనష్టాలతో పాటు ఇది కూడా ఒక త్యాగమే. విద్యార్థుల జీవితంల విలువైన ఒక సంవత్సరం వృధా కావటం వలన జీవితంల అన్ని రంగాలల్ల వారు ఒక సంవత్సరం వెనుకబడిపోయినారు. స్వామి [...]
సలాం హైద్రాబాద్ : పదిహేనో భాగం
Posted in తెలుగు, సలాం హైద్రాబాద్ on Feb 8th, 2010
15 1969 జూన్ 27న ఉదయం 9 గంటలకు ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి తన పదవికి రాజీనామ చేసినాడు. ఆ రాజీనామా లేఖను రాష్ట్ర గవర్నర్‌కు పంపకుండ ఢిల్లీలోని కాంగ్రెస్ అధ్యక్షుడు నిజలింగప్పకు పంపినాడు. అదీ ఆయన కుటిల నీతి. ఆరు నెలల సుదీర్ఘ తెలంగాణా ఉద్యమ పోరాట ఫలితమే ముఖ్యమంత్రి రాజీనామా. ఇది తెలంగాణ ప్రజల నైతిక విజయం.
సలాం హైద్రాబాద్ : పద్నాల్గో భాగం
Posted in తెలుగు, సలాం హైద్రాబాద్ on Feb 1st, 2010
14 ఏ బొంబై కా తమాషా దేఖో ఏ చార్ దిన్‌కా తమాషా దేఖో ఏ కల్‌కత్తా కాళీ మాతా దేఖో ఏ బెజ్వాడా కనకదుర్గా దేఖో ఏ చారానా తమాషా దేఖో ఏ బార్ బార్ తమాషా దేఖో ఏ బొంబై కా తమాషా దేఖో స్వామి తన మిత్రబృందంతోటి ఆ బొంబై కా తమాషా ముందు నిలబడి ఉన్నడు.
సలాం హైద్రాబాద్ : పదమూడో భాగం
Posted in తెలుగు, సలాం హైద్రాబాద్ on Jan 25th, 2010
13 1969 జూన్ నెలను తెలుగు పంచాంగం ‘రక్తాక్షిమాసం’ అని పేర్కొంది. ఆ పేరుకు తగ్గట్టు నిజంగనే తెలంగాణాల ఆ నెల అంతా రక్తం ప్రవహించింది. ఆ రక్తాక్షి మాసమంత పోలీసుల కాల్పులతోటి, తెలంగాణా ప్రజల బలిదానాలతోటి దద్ధరిల్లిపోయింది. జూన్ రెండవ తేదీ సోమవారం నుండి నాలుగు రోజులు కొనసాగిన అల్లర్లు, మారణకాండల ప్రభుత్వ లెక్కల ప్రకారమే నగరంల 30 మందికి పైగా మరణించినారు. వందలాది మందికి గాయాలైనాయి. అండ్ల కొందరు శాశ్వతంగ అవిటివారైనారు. అనధికార లెక్కలు [...]
సలాం హైద్రాబాద్ : పన్నెండో భాగం
Posted in తెలుగు, సలాం హైద్రాబాద్ on Jan 18th, 2010
12 అట్ల ఆ డిమాండ్స్ డే – మే డే ఒక బ్లాక్ డేగ నగర చరిత్రల నిలిచిపోయింది. తెల్లారి మే రెండున జంటనగరాలల్ల సంపూర్ణ హర్తాల్, బంద్ జరిగింది. ఆ రోజు కూడా మళ్లీ అల్లర్లు జరిగినై. ఆ రోజు రాత్రి సికింద్రాబాద్‌ల జేమ్స్ స్ట్రీట్ నుండి ఓల్డ్ ఘాస్‌మండీకి పోతున్న పోలీసు వ్యాన్ మీద ఇద్దరు యువకులు బాంబులు విసిరితే ఒక జవాను అక్కడికక్కడే మరణించినాడు. వ్యాన్‌ల ఉన్న మిగిలిన వారు గాయపడినారు. నరేందర్ [...]
సలాం హైద్రాబాద్ : పదకొండో భాగం
Posted in తెలుగు, సలాం హైద్రాబాద్ on Jan 11th, 2010
11 “ఈ చిలుక పలుకదేమీ మనతో మాటాడదేమీ మనతో నిన్న మొన్నటి దాకా ఈ చిలుక మాటలాడెను బాగా” అర్ధరాత్రి దాటింది. నట్టింట్ల జెఫ్రీ శవం. అనంతశయనం. అతి దీర్ఘమైన పెను నిద్దుర. పెను విశ్రాంతిలకు పోయిన జోసెఫ్ మార్క్వెజ్ జెఫ్రీ కండ్లు తెరుచుకునే ఉన్నయి – రాబోయే తెలంగాణా కోసం నిరీక్షిస్తున్నట్లు. ప్రాణం పోయిన కొద్దిసేపట్లనే కనురెప్పల్ని మూయాలంట. లేకపోతే కండ్లు అట్లనే తెరుచుకొని ఉంటవని ఎవరో ముసలమ్మ అంటుంది.
సలాం హైద్రాబాద్ : పదో భాగం
Posted in తెలుగు, సలాం హైద్రాబాద్ on Jan 4th, 2010
10 ఆ రోజు మేడే. చికాగో వీధులల్ల తమ హక్కుల కోసం కార్మికులు రక్తం ధారపోసిన రోజు. తమ రక్తవర్ణంతోటి అరుణపతాకాన్ని సృష్టించిన రోజు. ఆ రోజుననే హైద్రాబాద్, సికింద్రాబాద్ జంటనగరాలల్ల తెలంగాణా ప్రజా సమితి ‘డిమాండ్ డే’ కోసం పిలుపిచ్చిన రోజు. తెలంగాణా కోసం ఊరేగింపు జరుపవలసిన రోజు. స్వామి ఇక్బాల్ హోటల్ల కూచున్నడు. “బోలో సాబ్ క్యా హుకూం హై” సర్వర్ పలకరింపుకు ఉలికిపడి ఈ లోకంలకు వచ్చినాడు స్వామి. నహారి, ఖుల్చా, పాయారోటీ, [...]
సలాం హైద్రాబాద్ : తొమ్మిదో భాగం
Posted in తెలుగు, సలాం హైద్రాబాద్ on Dec 28th, 2009
9 టాంగు టంగు, టాంగు టంగు – చిట్కుం చిట్కుం రకరకాల సమ్మెట పోట్లు. కర్వాయిలకు సర్వలను, చెంబులను దూర్చి సుత్తెతోటి మట్నగొట్టే చప్పుళ్లు. పొగరతోటి రంధ్రాలు చేస్తున్న ధ్వనులు. సుత్తి, డాకలి, కొరడు, రకరకాల పట్టకారుల సంగీత నాదాలు. సికింద్రాబాద్ కంచరి బస్తీల ఆ ‘బాడా’లో శ్రామిక జనజీవన సౌందర్య సంగీతం. శ్రమతో, అద్భుత కళానైపుణ్యంతోటి సృష్టించబడుతున్న గంగాళాలు, తాంభాళాలు, కొప్పెరలు, నీళ్లు కాగబెట్టుకునే బైలర్లు, బిందెలు, చెంబులు, తలెలు, పాన్‌దాన్‌లు – ఒగల్‌దాన్లు. అదొక [...]
సలాం హైద్రాబాద్ : ఎనిమిదో భాగం
Posted in తెలుగు, సలాం హైద్రాబాద్ on Dec 21st, 2009
8 స్వామి ఇంటికి చేరుకొనేసరికి ఇంట్ల ‘భూకంపం’ వచ్చినంత పరిస్థితిని గమనించాడు. క్రిందటి రాత్రి స్వామి ఇంటికి రాకపోయేసరికి ఇల్లంత అతలాకుతలం అయిపోయింది. పోలీసులు అరెస్టు చేసి జైల్ల పడేసినారేమో, కాకపోతే ఏదైనా టక్కర్ అయ్యి దెబ్బలు తగిలి దవాఖాన్ల పడిండేమో అని అమ్మ ఏడుపులు. అరుపులు. నెత్తి కొట్టుకొని క్రింద నేలపై పడిపోయింది. స్వామి గురించి భయమేందోగని బాపుకు అమ్మను సముదాయించడమే కష్టమైపోయింది. ‘నా కొడుకును సక్కగ ఇంటికి తీసుకు రాకపోతివో నీ ముందే నా [...]
రాష్ట్ర విభజనపై అమెరికా తెలుగు రచయితల అభిప్రాయాలు
Posted in తెలుగు, వివిధ, ఆంధ్రజ్యోతి on Dec 20th, 2009
పరిష్కారం ఏదైనా ప్రజలే గెలవాలి రొమాంటిక్ రంగు పులమడం అర్థరహితం సమస్య పట్ల అవగాహనా, భావోద్వేగాలకు లోనుగాకుండా తార్కికంగానూ దూరదృష్టితోనూ పరిష్కారం ఆలోచించగల వివేచనా కనిపించడం లేదు. ‘సమైక్యాంధ్ర’ బోలు నినాదం. ప్రత్యేక తెలంగాణ అంత తేలిగ్గా ఇవ్వరన్న నమ్మకంతో ఇన్నాళ్లూ అందుకు మద్దతు పలికిన రాజకీయ పార్టీలూ, ఉద్యమం జరుగుతున్నన్నాళ్లూ చోద్యం చూస్తూన్న ఇతర ప్రాంత ప్రజలూ ఇప్పుడు సమైక్యాంధ్ర అంటూ గొంతు చించుకోవడం విచిత్రం. Read Completely >>
సలాం హైద్రాబాద్ : ఏడో భాగం
Posted in తెలుగు, సలాం హైద్రాబాద్ on Dec 14th, 2009
7 ఆ రోజు పొద్దుపొద్దున్నే స్వామి ఇంకా నిద్ర లేవకముందే గోపి సైకిలేసుకుని, చెమటలు కారంగ, దమ్ములు పోసుకుంట శాలీబండాకు వచ్చినాడు. శాలీబండా చడావ్ మీద సైకిల్ తొక్కడమంటే మజాక్ కాదు. కాళ్ల పిక్కలల్ల మస్తుగ బలం ఉండాలె. శరీరానికి తాఖత్ గావాలె. కలేజాల ఖువ్వత్ ఉండాలె. అమ్మ వాడిని దివాన్‌ఖానాల ఉన్న ఆరామ్ కుర్చీల కూచుండబెట్టి కాశీ నుండి తెచ్చిన రాగిచెంబుల చల్లటి మంచి నీళ్లు, గుండ్రటి తెల్లటి కోపుల పొగలు గక్కే గరం గరం [...]
సలాం హైద్రాబాద్ : ఆరో భాగం
Posted in తెలుగు, సలాం హైద్రాబాద్ on Dec 7th, 2009
6 జనవరి ఇరవై నాలుగున సదాశివపేటల పోలీసులు కాల్పులు జరిపినారు. పద్నాలుగు మందికి దెబ్బలు తగిలినాయి. ఆ కాల్పులలో శంకర్ అనే పదిహేడు సంవత్సరాల యువకుడు మరణించినాడు. 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమంల శంకర్ తొలి అమరవీరుడు. శంకర్ అంత్యక్రియలలో మూడు వేల మంది విద్యార్థులు పాల్గొన్నరు. మిగిలిన క్షతగాత్రులందరినీ సికింద్రాబాదులోని గాంధీ దవాఖానాకు తరలించినారు. అక్కడ వాళ్లు కొసప్రాణాలతో మృత్యువుతో పోరాటం చేస్తున్నరు. శంకర్ సంస్మరణ సభ ఆ రోజు హైద్రాబాద్‌ల ఆర్ట్స్ కాలేజీ ముందు [...]
- అందెశ్రీ [Audio clip: view full post to listen] జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లీ నీరాజనం పది జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ ॥జయ జయహే॥
అమరుడు కాసోజు శ్రీకాంత్ అమర్ హై !
Posted in తెలంగాణ ఉద్యమాలు, తెలుగు, English on Dec 4th, 2009
అమరుడు కాసోజు శ్రీకాంత్ అమర్ హై ! YouTube link of martyr Kasoju Srikanths Funeral at Gunpark, Hyderabad Picasa Photos link of martyr Kasoju Srikanths Funeral శ్రీకాంత్ అమర్ హై !
04 డిసెంబర్ 2009: తెలంగాణ ఉద్యమ అప్డేట్స్
Posted in తెలంగాణ ఉద్యమాలు, తెలుగు on Dec 4th, 2009
తెలంగాణా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గన్ పార్క్ వద్ద మూడో రోజు వికలాంగుల హక్కుల వేదిక వారి నిరాహార దీక్ష గన్ పార్క్ వద్ద మంత్రి శ్రీధర్ బాబు శవయాత్ర చేసి దిష్టిబొమ్మ దగ్ధం చేసిన ఎబివీపి కార్యకర్తలు కాసోజు శ్రీకాంత్ భౌతిక కాయం పోస్ట్ మార్టం కొరకు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు