Posted in తెలంగాణ ఉద్యమాలు, తెలుగు, పాటలు on Dec 4th, 2009
-ముస్కు రాము జోహార్ శ్రీకాంతన్నా !! తెలంగాణ నేల పై జన్మించిన ఓ పులిబిడ్డ ఆఖరి జంగ్ లో అమ్మ కోసం బలి దానం చేసి నింగి కెగసి ప్రకాశించే తారావయ్యావా ! || జోహార్ శ్రీకాంతన్నా…||
Read Full Post »
Posted in తెలంగాణ ఉద్యమాలు, తెలుగు on Dec 3rd, 2009
జాతీయ రహదారి పై విద్యార్ధుల రాస్తారోకో వరంగల్ జిల్లాలో సీఎం దిష్టిబొమ్మ దగ్ధం వరంగల్ లో వికలాంగుల దినోత్సవం సందర్భంగా వికలాంగుల ధర్నా వరంగల్ జిల్లా ములుగు సెంటర్లో కాలేజీ విద్యార్ధుల భారీ ర్యాలీ వరంగల్ లో కాకతీయ మెడికల్ కాలేజీ విద్యార్ధుల భారీ ర్యాలీ
Read Full Post »
Posted in తెలంగాణ ఉద్యమాలు, తెలుగు, పాటలు on Dec 2nd, 2009
- సిద్ధార్థ పాములపర్తి ఉవ్వెత్తున ఎగిసింది ఉద్యమం మల్లి చూడు విప్లవ చిరు జల్లుల్లు వీధి వీధిలల్ల జూడు ||ఉవ్వెత్తున|| రాజ్యాంగపు హక్కులుతో రాచరికం తిక్క కుదిరే ప్రజాస్వామ్య గర్జనకు భూస్వాముల గుండెలదిరే
Read Full Post »
Posted in తెలంగాణ ఉద్యమాలు, తెలుగు, కవితలు on Dec 1st, 2009
- సిద్ధార్థ పాములపర్తి క్రూర శక్తుల కృత్రిమ హింసకు బలి కావొద్దు అరవై తొమ్మిది ఆవేదనలు మల్లి రావొద్దు రక్తపుబొట్లను నరముల లోనే ఉడకనియ్యి విద్యాలయములో వీధిలో వాడలో కారనియ్యకు!
Read Full Post »
Posted in తెలుగు, పుస్తక పరిచయం, వార్త on Nov 30th, 2009
ఓరియంట్‌లాంగ్మన్ వారు ప్రచురించిన “నాంపల్లిరోడ్ నవల చదవని వారు తప్పక చదవాలి. హైదరాబాదు గతవైభవం, సమకాలీన జీవితం అలా అలవోకగా అందులో గుమ్మరించారు రచయిత్రి మీనా అలెగ్జాండర్”. ప్రముఖ ఇండో ఆంగ్లికన్ కవయిత్రి, రచయిత్రి అయిన మీనా రాసిన తొలి నవల అది! ‘నాంపల్లిరోడ్’ అనే ఇంగ్లీషు నవలలోని కథా నాయకకు ఇంగ్లీషు మహాకవి వర్డ్స్ వర్త్ ఆరాధ్యుడు. తనుకూడా ఈ హైదరాబాదు నగర సౌందర్యానికి స్పందించి, వర్డ్స్ వర్త్ లాగా కవిత్వం రాయాలనుకుంటుంది.
Read Full Post »
Posted in తెలుగు, సలాం హైద్రాబాద్ on Nov 30th, 2009
5 స్వామి ఆలియా స్కూలు వద్ద బస్సు దిగంగనే నిజాం కాలేజీలకు ఉరికినాడు. ఇంకా నయం. ఊరేగింపు బయలుదేరనే లేదు. సాలార్‌జంగు హాలు ఎదురుంగ ఉన్న చెట్ల దగ్గరికి చేరుకున్నడు. ఈ ఉద్యమ సందర్భంల సిటీ కాలేజీ విద్యార్థులంతా కలుసుకునే సంకేత స్థలం అదే. తన మిత్రబృందంఅంతా అక్కడనే వుంది. “ఏం రా లేట్ లతీఫ్! ఇంత ఆలస్యంగ వచ్చినవ్?” అని గోపి విసుక్కున్నడు. “ఆప్‌కే ఇంతజార్ మే హమ్ ఇంతెఖాల్ హోగయే” అని అశోక్ ఆట [...]
Read Full Post »
Posted in తెలుగు, సలాం హైద్రాబాద్ on Nov 23rd, 2009
4 పదిహేడు సంవత్సరాలు గడిచిన తర్వాత మళ్లీ ఇప్పుడు 1969ల ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ‘పునరుత్తానంగ’ ప్రారంభమయ్యింది. ఆ రోజు స్వామి సరిగ్గ కాలేజీకి పోకుండ నారాయణగుడా విఠల్‌వాడీల వున్న గోపి ఇంటికి బయలుదేరినాడు. విఠల్‌వాడీల రాగిచెట్టు కింద అమ్మవారి గుడి ఎదురంగ వాళ్ల ఇల్లు. వాళ్ల నాన్న ఎలక్ట్రిసిటీ బోర్డులో ఉద్యోగం చేస్తడు. వాళ్లది స్వంత ఇల్లే అయినా చాలా ఇరుకు. వాళ్ల ఇంట్ల సిటీ కల్చర్ స్పష్టంగ కనబడుతది. దక్కన్ క్రానికల్, ఆంధ్రభూమి దినపత్రికలు [...]
Read Full Post »
Posted in తెలుగు, సలాం హైద్రాబాద్ on Nov 16th, 2009
3 చిరుగాలికి చలించే చిగురాకువంటి స్వామి తనకు తెలియకుండనే, తన ప్రమేయం లేకుండనే ఇప్పుడు 1969ల మొదలైన ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉప్పెనల తలనిండా మునిగి కొట్టుకపోతున్నడు. స్వామి ఆ రోజు ఉత్సాహంగ నిద్ర లేచినాడు. ”ఇంత పొద్దున్నే ఎందుకు లేచినవురా?” అని అమ్మ ఆశ్చర్యపోయింది. ఆమె అప్పటికే నిద్ర లేచి వంటింట్ల మట్టిపొయ్యిని ఎర్రమన్నుతోటి చక్కగ అలికి, దానికి తెల్లటి ముగ్గు పిండితోటి వంకీలు వంకీలుగ ముగ్గులేసి వాటి మధ్య చుక్కల ముగ్గులేసింది. బొగ్గులు రాజేసి [...]
Read Full Post »
Posted in తెలుగు, సలాం హైద్రాబాద్ on Nov 9th, 2009
2 ప్రతి పిల్లగాలి తెమ్మెరకు చిగురాకు వోలె చలించిపోయే హృదయం స్వామిది. ప్రతి చిన్న సంఘటనకు ‘అసంకల్పిత ప్రతీకారచర్య’ వోలె స్పందించే హృదయం స్వామికి ఎక్కడి నుండి వచ్చింది? బహుశా పాలు తాగే పసిడి ప్రాయంలోనే స్వామికి ఆ గుణం అమ్మ ఒడిలనే అబ్బిందేమొ! * * * అమ్మ పక్కల వెచ్చగ నిద్రపోతున్న స్వామి కళ్లు తెరిచినాడు. అమ్మ చీరె కొంగు వాడి ముఖంపై పడి ఉక్కిరిబిక్కిరై కాళ్లు చేతులు తసబిసా కొట్టుకున్నడు. హమ్మయ్య కొంగు [...]
Read Full Post »
Posted in తెలుగు, సలాం హైద్రాబాద్ on Nov 2nd, 2009
2005 జూన్ 10 శుక్రవారం. మధ్యాహ్నసమయం. మక్కా మసీదుల నమాజ్‌లు చదువుతున్న సమయం. నాలుగు వందల సంవత్సరాల నగరచరిత్రకు ప్రత్యక్షసాక్షిగ, ప్రథమసాక్షిగ నిలుచున్న ‘చార్‌మినార్’. ‘చార్‌మినార్’కు ఎదురుంగ లార్డ్ బజార్ సందు మలుపుల ‘ఇక్బాల్’ హోటల్ల స్వామి. కాలం శూలం దాడికి గురి కాక అట్లనే నిలుచున్న నైజాం కాలంనాటి అతి పురాతన ఇక్బాల్ హోటల్. అండ్ల ఎంతసేపట్నుంచి కూచున్నడో ఆయనకే తెలుస్తలేదు. చాయ్‌ల మీద చాయ్‌లు తాగుకుంట ఎదురుంగ నిలబడ్డ ‘జిగ్రీ దోస్త్ చార్‌మినార్’తోటి అంతులేని [...]
Read Full Post »
Posted in తెలుగు, పుస్తకాలు, సలాం హైద్రాబాద్ on Nov 2nd, 2009
పురాతన హైద్రాబాద్ నగర సంస్కృతీ సంప్రదాయాలను ప్రేమించేవారందరి తరఫున ఈ నవల రాసినాను. హైద్రాబాద్ గురించి చర్చ జరుగుతున్న ఈ సందర్భంలో ఒక కర్తవ్యంగ ఒక బాధ్యతగ ఈ నవల రాసినాను. చరిత్ర రథచక్రాలు ముందుకు పోవడంలో నా వంతు ప్రయత్నమే ఈ నవల. ఢిల్లీ, లక్నో నగరాలకు సంబంధించి బోలెడంత సాహిత్యం అనేక భాషలలో వచ్చింది. ఆ రెండు నగరాలకు ధీటైన, సమవుజ్జీ నగరమైన హైద్రాబాద్ నగరం గురించి ముఖ్యంగా తెలుగులో కొన్ని కథలు, రెండు [...]
Read Full Post »
Posted in తెలుగు, సలాం హైద్రాబాద్ on Nov 2nd, 2009
”బిష్ణు అజ్ నై చూఁ హికాయత్ మీకునద్” ”పిల్లనగ్రోవి ఏదో కథ చెప్తున్నది. విను.” అంటూ జగత్ప్రసిద్ధమైన తన మస్నవీ కథలు చెప్పటం మొదలు పెట్టినాడు మోలానా రూమీ. వెదురుపొదలోంచి వేరు చేయబడిన వెదురుముక్క మూగగా పడి వున్నది. ఉలుకదు – పలుకదు. ఎవరైనా పలికించాలని ఊదితే బర్ – బర్ అనే సవ్వడే కాని ఒక్క సుస్వరం వెలువడదు. అన్నీ అపస్వరాలే.
Read Full Post »
అన్నల్లారా! అక్కల్లారా! మూడున్నర కోట్ల తెలంగాణ బిడ్డల్లారా… నిజాం పాలన పోతే బాధలన్ని పోతయనుకున్నం. మనం గాకపోయినా మన పొల్లగాండ్లయినా తెల్లగ బతుకుతరనుకున్నం. కాని నోరు అందల మెక్కుదామంటే నొసలు కట్టెలు మోపియ్యవట్టె. బతుకు పేనం మీది నుంచి పొయ్యిల పడ్డట్టాయె. బుదురకిచ్చి పొత్తు గూడుదామనిరి. ఉప్పేసి పొత్తు గూడిరి. మనం వద్దు వద్దన్నా బల్మీటికి బక్తున్ని జేసి పంగ నామాలు వెట్టిరి. తుడుసుకుందామంటే పోయేదా ఇడుసుకుందామంటే వచ్చేదా. ఎవలో ముగ్గురు ఒప్పుకున్నరని మూడు కోట్లమందిని బందీలు [...]
Read Full Post »
- వారాల ఆనంద్ సినిమా నిశ్చలమైంది కాదు. అది ఓ కదులుతున్న ప్రపంచం- ఓ విశిష్టమైన దృశ్య మాధ్యమం. సినిమా ద్వారా మనం ప్రేక్షకులకు కథ చెప్పం, చూపిస్తాం. ఆ చూడడంలోనే ప్రేక్షకులకు ఆ సినిమా కథ పట్ల ఆసక్తి కలగాలి. వారందులో మమేకం కావాలి. ఆ సినిమాలోని ఇతివృత్తం పట్ల పాత్రల పట్ల ప్రేక్షకుల్లో ఇష్టం, కోపం, ద్వేషం ఇలా అనేక భావాలు కలగాలి. అప్పుడే ఆ సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. వారు ఆ సినిమాను [...]
Read Full Post »
Posted in తెలుగు, బతుకమ్మ, వ్యాసాలు, ఆంధ్రజ్యోతి on Sep 18th, 2009
నేటి నుంచి జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు మొదలు కానున్నాయి. పల్లెలు, పట్టణాల్లో ప్రతి ఇంటి లోగిలీ ఓ పూలతోటగా పరిమళించనుంది. ప్రతి యేటా మహాలయ అమావాస్య మొదలు మహర్నవమి వరకు తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతాయి. ఆప్యాయతానురాగాలకు తోడుగా ఆధ్యాత్మికతను రంగరించే ఈ రంగుల పండుగ ప్రతి ఇంట్లో సంతోషాల పూలు పూయిస్తుంది.. ఇక ఈ తొమ్మిది రోజులూ జిల్లాలోని పట్టణాలు, పల్లెలన్నీ వీనుల విందైన బతుకమ్మ పాటలతో మారుమోగనున్నాయి.
Read Full Post »
గిర్‌గ్లానీ.. ఈ పదం గత పదేళ్లుగా తెలంగాణ ఉద్యోగులకు ఉద్యమకారులకు తారకమంత్రమయ్యింది. 610 జీవో అమలులో జరిగిన అవకతవకలను, రాష్ట్రపతి ఉత్తర్వుల ఉల్లంఘనలను అధ్యయనం చేసి సిఫారసులతో కూడిన నివేదికను సమర్పించమని నిర్దేశిస్తూ 2001లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఏకసభ్య సంఘాన్ని నియమించారు. ఆ సంఘానికి అధ్యక్షుడిగా గిర్‌గ్లానీ తెలంగాణ ప్రజలకు ఎరుకలోకి వచ్చారు.
Read Full Post »
సినిమా, తెలంగాణ అభిమానులకు ఆహ్వానం ‘డిస్కవర్ తెలంగాణ’ (USA) సంస్థ ‘కరీంనగర్ ఫిలిం సొసైటీ’ ఆధ్వర్యంలో ‘ఫిలిం తెలంగాణ-2009′ డిజిటల్ షార్ట్ ఫిలిం ఫెస్టివల్‌ను సెప్టెంబర్ 12, 13 18-20 తేదీల్లో కరీంనగర్‌లో నిర్వహించనుంది. తెలంగాణ ప్రజల జీవితాలకు సంబంధించి వివిధ కోణాల్ని ఇతివృత్తాలుగా తీసుకుని షార్ట్ ఫిలిం పోటీలు నిర్వహించినాము. ఎంట్రీలను షార్ట్ లిస్ట్ చేయగా 24 చిత్రాలు పోటీలో నిలిచాయి. వీటిని ‘ఫిలిం తెలంగాణ 2009′ చిత్రోత్సవంలో ప్రదర్శిస్తాము. చిత్ర ప్రదర్శన తరువాత ఉత్తమ [...]
Read Full Post »
చావనైనా చస్తాంగాని భూమినొదిలేది లేదంటున్న ప్రజలకు ఏం చెబుతారు? – శ్రీరాముల శ్రీనివాస్ ‘జీవితాలకు అనుకూలంగా సిద్ధాంతాలు మార్చుకోవాలి’ అంటూ తుమ్మేటి కథను బిఎస్ రాములు సమర్థిస్తూ రవిబాబు, దేవేంద్రాచారి, గీతాంజలి తదితరులు తాము ఇతర వృత్తుల మీద ఆధారపడుతూ రైతులు ఇతర వృత్తుల్లోకి వెళ్లడాన్ని వ్యతిరేకించడం సరైంది కాదని, సరిగ్గా ఇలాంటివాళ్లనే తీవ్రంగా ఖండిస్తూ ఈ కథ రాయబడింది అన్నారు. సెజ్‌లను వ్యతిరేకించవలసిందే అయితే రైతులు కోరుకుంటున్న నూతన జీవితాన్ని కూడా ఆహ్వానించవలసిందే అంటూ వైవిధ్యపూరితమైన [...]
Read Full Post »
- వెల్దండి శ్రీధర్ తెలంగాణ సామాజిక పరిణామాలు, జీవన విధానంపై తెలంగాణ కథకులు ‘ఏం చెప్పిండ్రు? ఏం చెప్పలేదు? ఎందుకు చెప్పలేదు?’ అన్న అంశంమీద మాట-ముచ్చట ఆగస్టు 9న హైదరాబాద్‌లో తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో జరిగింది. ప్రారంభ సమావేశానికి అధ్యక్షత వహించిన తెరవే అధ్యక్షులు జూకంటి జగన్నాథం మాట్లాడుతూ తెలంగాణ సాహిత్యమంటే జన జీవన చిత్రణ కూడా అంటూ 1990 తర్వాత ఆడెపు లక్ష్మీపతి నుంచి పెద్దింటి అశోక్ దాకా అనేకులు గ్రామ విధ్వంస ముఖచిత్రాన్ని, [...]
Read Full Post »
- కె. శ్రీనివాస్ భాష అంటే అది మాట్లాడే ప్రజలూ, వారి సంస్కృతీ, చరిత్రా. అవన్నీ ధ్వంసమయ్యాక, భాష ఒక్కటే బతికి బట్టకట్టడం సాధ్యం కాదు. విదేశీవస్తుబహిష్కరణ, సహాయనిరాకరణ- వంటి విలువలు కలిగిన జాతీయోద్యమాన్ని చరిత్ర చెత్తకుండీలోకి తోసేసిన తరువాత- ప్రపంచీకరణలోనే పరమస్వేచ్ఛ కనిపిస్తుంది…. ఎగుమతికి కావలసిన సరుకులు ఉత్పత్తి చేసే సెజ్‌లు, పార్కులు, విదేశాలకు కావలసిన పంటలు పండిచే వ్యవసాయం, ప్రపంచ వైట్‌కాలర్ కార్మికులుగా పనిచేయడానికి తీర్చిదిద్దే విద్య- ఇదీ నేటి దృశ్యం. ఈ చిత్రపటంలో [...]
Read Full Post »