అన్నల్లారా! అక్కల్లారా!
మూడున్నర కోట్ల తెలంగాణ బిడ్డల్లారా… నిజాం పాలన పోతే బాధలన్ని పోతయనుకున్నం. మనం గాకపోయినా మన పొల్లగాండ్లయినా తెల్లగ బతుకుతరనుకున్నం. కాని నోరు అందల మెక్కుదామంటే నొసలు కట్టెలు మోపియ్యవట్టె. బతుకు పేనం మీది నుంచి పొయ్యిల పడ్డట్టాయె. బుదురకిచ్చి పొత్తు గూడుదామనిరి. ఉప్పేసి పొత్తు గూడిరి. మనం వద్దు వద్దన్నా బల్మీటికి బక్తున్ని జేసి పంగ నామాలు వెట్టిరి. తుడుసుకుందామంటే పోయేదా ఇడుసుకుందామంటే వచ్చేదా. ఎవలో ముగ్గురు ఒప్పుకున్నరని మూడు కోట్లమందిని బందీలు జేసిరి. […]
Read Full Post »
సినిమా, తెలంగాణ అభిమానులకు ఆహ్వానం
‘డిస్కవర్ తెలంగాణ’ (USA) సంస్థ ‘కరీంనగర్ ఫిలిం సొసైటీ’ ఆధ్వర్యంలో ‘ఫిలిం తెలంగాణ-2009′ డిజిటల్ షార్ట్ ఫిలిం ఫెస్టివల్‌ను సెప్టెంబర్ 12, 13 18-20 తేదీల్లో కరీంనగర్‌లో నిర్వహించనుంది. తెలంగాణ ప్రజల జీవితాలకు సంబంధించి వివిధ కోణాల్ని ఇతివృత్తాలుగా తీసుకుని షార్ట్ ఫిలిం పోటీలు నిర్వహించినాము. ఎంట్రీలను షార్ట్ లిస్ట్ చేయగా 24 చిత్రాలు పోటీలో నిలిచాయి. వీటిని ‘ఫిలిం తెలంగాణ 2009′ చిత్రోత్సవంలో ప్రదర్శిస్తాము. చిత్ర ప్రదర్శన తరువాత ఉత్తమ […]
Read Full Post »
- వెల్దండి శ్రీధర్
తెలంగాణ సామాజిక పరిణామాలు, జీవన విధానంపై తెలంగాణ కథకులు ‘ఏం చెప్పిండ్రు? ఏం చెప్పలేదు? ఎందుకు చెప్పలేదు?’ అన్న అంశంమీద మాట-ముచ్చట ఆగస్టు 9న హైదరాబాద్‌లో తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో జరిగింది.
ప్రారంభ సమావేశానికి అధ్యక్షత వహించిన తెరవే అధ్యక్షులు జూకంటి జగన్నాథం మాట్లాడుతూ తెలంగాణ సాహిత్యమంటే జన జీవన చిత్రణ కూడా అంటూ 1990 తర్వాత ఆడెపు లక్ష్మీపతి నుంచి పెద్దింటి అశోక్ దాకా అనేకులు గ్రామ విధ్వంస ముఖచిత్రాన్ని, వలసలను, ప్రపంచీకరణను […]
Read Full Post »
- ఆచార్య రవ్వా శ్రీహరి
ఆంధ్రులందరూ ఒకేజాతికి చెందినవారైనా ఆంధ్రదేశంలోని ప్రాంతాల భేదాన్నిబట్టి నిజామాంధ్రులు, కోస్తా ఆంధ్రులు, రాయలసీమ ఆంధ్రులు, కళింగాంధ్రులు అనే నాలుగు ప్రధాన భేదాలు కనిపిస్తాయి. నిజామాంధ్రులు నివసించే భూభాగాన్నే మనం ‘తెలంగాణ’ అని వ్యవహరిస్తున్నాం. ఏమి దురదృష్టమో కాని కొన్ని ప్రాంతాల పండితుల్లో, పెద్దల్లో తెలంగాణంలో తెలుగు లేదనీ, ఉన్నా అది సరైన తెలుగు కాదనీ నిష్కారణమైన అసత్యమైన అపోహ నేటికీ ఉంది. ఈ అపోహ కలిగిన వారు తెలంగాణంలోని మారుమూల పల్లెలకు వెళ్లితే […]
Read Full Post »
Posted in ప్రకటనలు, సభలు సమావేశాలు, తెలుగు on జులై 21st, 2009
‘తెలంగాణ ప్రచురణలు’ వ్యవస్థాపన సభ
అందరూ ఆహ్వానితులే !
రచన : డా||సుంకిరెడ్డి నారాయణ రెడ్డి
ఆహ్వానం : కాసుల ప్రతాపరెడ్డి
అధ్యక్షత : ఆచార్య జయధీర్ తిరుమలరావు
‘తెలంగాణ ప్రచురణలు’ వ్యవస్థాపన పరిచయం : బి.నరసింగరావు
‘ముంగిలి’ ఆవిష్కరణ : ఆచార్య బిరుదురాజు రామరాజు
పుస్తక పరిచయం : ఆచార్య టి.కిషన్ రావు, శ్రీరంగాచార్య, డా||కె.శ్రీనివాస్
ముగింపు : సింగిశెట్టి శ్రీనివాస్
Read Full Post »
- పసునూరి రవీందర్
ఉద్యమాల పురుటిగడ్డ మీద కథాసాహిత్య ప్రక్రియను మరింత విస్తరించేందుకు తెలంగాణ నవ కథకుల ఆధ్వర్యంలో తెలంగాణ కథా వేదిక ‘దస్కత్’ ఆవిర్భవించింది. తెలంగాణ నేలమీద జరిగిన, జరుగుతున్న పోరాటాల్లో సాహిత్యం తనవంతు పాత్రను క్రియాశీలకంగా పోషించింది. అక్షరాలు దారి చూపే వెలుగు దీపాలైనయ్. ఈ క్రమంలో జీవితాన్ని సమగ్రంగా ప్రతిబింబించే కథా ప్రక్రియను మరింత విస్తరించాల్సిన అవసరాన్ని ఈ ప్రాంత నవతరం గుర్తించింది.
Read Full Post »
- పి.వరలక్ష్మి
‘ఈత గురించి ఎన్ని పుస్తకాలు చదివినా ఈత రాదు. ఈత రావాలంటే నీళ్లలోకి దిగాల్సిందే. అట్లాగే కథ గురించి ఎన్ని ఉపన్యాసాలు విన్నా, ఎన్ని పుస్తకాలు చదివినా కథ రాయడం రాదు. కథ రాసి చర్చిస్తేనే అది సరిగ్గా అర్థమవుతుంది’ అన్నారు అల్లం రాజయ్య కథా వర్క్‌షాపుల ఉద్దేశాన్ని వివరిస్తూ. సరిగ్గా ఇదే పని చేస్తూ వస్తున్నది విరసం. 2007 నుండి ప్రతి మూన్నెళ్లకోసారి కథకుల సమావేశాలను రూపకల్పన చేసి ఇప్పటికీ అమరావతి, అనంతపురం, షాద్ […]
Read Full Post »
Posted in సభలు సమావేశాలు, తెలుగు, వార్తల్లో on జూన్ 6th, 2008
తెలంగాణ యెన్జీవోస్ యూనియన్, తెలంగాణ భవన్, నాంపెల్లి, హైదరాబాద్
అధిక ధరలకు నిరసనగా కాగడాలతో ప్రదర్శన తేది.9.6.2008
“కాగితంపై కలం కదిలించుటే కాదు … గళం విప్పి నిరసన జ్వాలలను గక్కిన … తెలంగాణ యెన్జీవోస్ యూనియన్ సభ్యులు“
ప్రభుత్వం అందిస్తున్నానంటున్న అభివృద్ది ఫలము, అందరికి అందని పండై, కొందరి నోటికి చెందేదైతే, అది మన ప్రజాస్వామ్య వ్యవస్థకు మరియు సమసమాజ సిద్దాంతానికే విరుద్దమై వికటిస్తుంది. ఈనాడు మన అభివృద్దిరేటు పెరుగుదల మాట అటుంచితే, ద్రవ్యోల్బణం రేటు మాత్రం విపరీతంగా పెరిగింది. […]
Read Full Post »
Posted in సభలు సమావేశాలు, English, వీడియో, వార్తల్లో on ఫిబ్రవరి 23rd, 2008
‘Discover Telangana’ in association with ‘Musi-TV’ was successfully able to broadcast live, the launch of the seminar by Telangana Vidyavantula Vedika (TVV) on ‘Telangana Demand – Problems & Prospects’. The event was attended & made successful by several Telangana NRIs. The event started at 11:30pm EST on 22nd February 2008, concluded around 01:00am EST.
Read Full Post »