Posted in వివిధ, ఆంధ్రజ్యోతి, తెలుగు on డిసంబర్ 20th, 2009
పరిష్కారం ఏదైనా ప్రజలే గెలవాలి
రొమాంటిక్ రంగు పులమడం అర్థరహితం
సమస్య పట్ల అవగాహనా, భావోద్వేగాలకు లోనుగాకుండా తార్కికంగానూ దూరదృష్టితోనూ పరిష్కారం ఆలోచించగల వివేచనా కనిపించడం లేదు. ‘సమైక్యాంధ్ర’ బోలు నినాదం. ప్రత్యేక తెలంగాణ అంత తేలిగ్గా ఇవ్వరన్న నమ్మకంతో ఇన్నాళ్లూ అందుకు మద్దతు పలికిన రాజకీయ పార్టీలూ, ఉద్యమం జరుగుతున్నన్నాళ్లూ చోద్యం చూస్తూన్న ఇతర ప్రాంత ప్రజలూ ఇప్పుడు సమైక్యాంధ్ర అంటూ గొంతు చించుకోవడం విచిత్రం. Read Completely >>
Read Full Post »
Posted in పుస్తక పరిచయం, వార్త, తెలుగు on నవంబర్ 30th, 2009
ఓరియంట్‌లాంగ్మన్ వారు ప్రచురించిన “నాంపల్లిరోడ్ నవల చదవని వారు తప్పక చదవాలి. హైదరాబాదు గతవైభవం, సమకాలీన జీవితం అలా అలవోకగా అందులో గుమ్మరించారు రచయిత్రి మీనా అలెగ్జాండర్”. ప్రముఖ ఇండో ఆంగ్లికన్ కవయిత్రి, రచయిత్రి అయిన మీనా రాసిన తొలి నవల అది! ‘నాంపల్లిరోడ్’ అనే ఇంగ్లీషు నవలలోని కథా నాయకకు ఇంగ్లీషు మహాకవి వర్డ్స్ వర్త్ ఆరాధ్యుడు. తనుకూడా ఈ హైదరాబాదు నగర సౌందర్యానికి స్పందించి, వర్డ్స్ వర్త్ లాగా కవిత్వం రాయాలనుకుంటుంది.
[…]
Read Full Post »
అన్నల్లారా! అక్కల్లారా!
మూడున్నర కోట్ల తెలంగాణ బిడ్డల్లారా… నిజాం పాలన పోతే బాధలన్ని పోతయనుకున్నం. మనం గాకపోయినా మన పొల్లగాండ్లయినా తెల్లగ బతుకుతరనుకున్నం. కాని నోరు అందల మెక్కుదామంటే నొసలు కట్టెలు మోపియ్యవట్టె. బతుకు పేనం మీది నుంచి పొయ్యిల పడ్డట్టాయె. బుదురకిచ్చి పొత్తు గూడుదామనిరి. ఉప్పేసి పొత్తు గూడిరి. మనం వద్దు వద్దన్నా బల్మీటికి బక్తున్ని జేసి పంగ నామాలు వెట్టిరి. తుడుసుకుందామంటే పోయేదా ఇడుసుకుందామంటే వచ్చేదా. ఎవలో ముగ్గురు ఒప్పుకున్నరని మూడు కోట్లమందిని బందీలు జేసిరి. […]
Read Full Post »
The slim volume presents the case of Telangana to a wider audience
“We wanted to put together a book in English that would present the case for Telangana as well as create the groundwork for debate,” say N. Venugopal and M. Bharath Bhushan about their Telangana – The state of affairs. A slim volume of 177 […]
Read Full Post »
- వారాల ఆనంద్
సినిమా నిశ్చలమైంది కాదు. అది ఓ కదులుతున్న ప్రపంచం- ఓ విశిష్టమైన దృశ్య మాధ్యమం. సినిమా ద్వారా మనం ప్రేక్షకులకు కథ చెప్పం, చూపిస్తాం. ఆ చూడడంలోనే ప్రేక్షకులకు ఆ సినిమా కథ పట్ల ఆసక్తి కలగాలి. వారందులో మమేకం కావాలి. ఆ సినిమాలోని ఇతివృత్తం పట్ల పాత్రల పట్ల ప్రేక్షకుల్లో ఇష్టం, కోపం, ద్వేషం ఇలా అనేక భావాలు కలగాలి. అప్పుడే ఆ సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. వారు ఆ సినిమాను ఆదరిస్తారు.
[…]
Read Full Post »
Posted in బతుకమ్మ, ఆంధ్రజ్యోతి, తెలుగు, వ్యాసాలు on సెప్టెంబర్ 18th, 2009
నేటి నుంచి జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు మొదలు కానున్నాయి. పల్లెలు, పట్టణాల్లో ప్రతి ఇంటి లోగిలీ ఓ పూలతోటగా పరిమళించనుంది. ప్రతి యేటా మహాలయ అమావాస్య మొదలు మహర్నవమి వరకు తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతాయి. ఆప్యాయతానురాగాలకు తోడుగా ఆధ్యాత్మికతను రంగరించే ఈ రంగుల పండుగ ప్రతి ఇంట్లో సంతోషాల పూలు పూయిస్తుంది.. ఇక ఈ తొమ్మిది రోజులూ జిల్లాలోని పట్టణాలు, పల్లెలన్నీ వీనుల విందైన బతుకమ్మ పాటలతో మారుమోగనున్నాయి.
[…]
Read Full Post »
Posted in ప్రకటనలు, ఆహ్వానం, ఆంధ్రజ్యోతి, తెలుగు, నివాళి on సెప్టెంబర్ 14th, 2009
గిర్‌గ్లానీ.. ఈ పదం గత పదేళ్లుగా తెలంగాణ ఉద్యోగులకు ఉద్యమకారులకు తారకమంత్రమయ్యింది. 610 జీవో అమలులో జరిగిన అవకతవకలను, రాష్ట్రపతి ఉత్తర్వుల ఉల్లంఘనలను అధ్యయనం చేసి సిఫారసులతో కూడిన నివేదికను సమర్పించమని నిర్దేశిస్తూ 2001లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఏకసభ్య సంఘాన్ని నియమించారు. ఆ సంఘానికి అధ్యక్షుడిగా గిర్‌గ్లానీ తెలంగాణ ప్రజలకు ఎరుకలోకి వచ్చారు.
Read Full Post »
చావనైనా చస్తాంగాని భూమినొదిలేది లేదంటున్న ప్రజలకు ఏం చెబుతారు?
- శ్రీరాముల శ్రీనివాస్
‘జీవితాలకు అనుకూలంగా సిద్ధాంతాలు మార్చుకోవాలి’ అంటూ తుమ్మేటి కథను బిఎస్ రాములు సమర్థిస్తూ రవిబాబు, దేవేంద్రాచారి, గీతాంజలి తదితరులు తాము ఇతర వృత్తుల మీద ఆధారపడుతూ రైతులు ఇతర వృత్తుల్లోకి వెళ్లడాన్ని వ్యతిరేకించడం సరైంది కాదని, సరిగ్గా ఇలాంటివాళ్లనే తీవ్రంగా ఖండిస్తూ ఈ కథ రాయబడింది అన్నారు.
సెజ్‌లను వ్యతిరేకించవలసిందే అయితే రైతులు కోరుకుంటున్న నూతన జీవితాన్ని కూడా ఆహ్వానించవలసిందే అంటూ వైవిధ్యపూరితమైన విశ్లేషణలకు పూనుకున్నారు. వ్యవసాయం […]
Read Full Post »
- వెల్దండి శ్రీధర్
తెలంగాణ సామాజిక పరిణామాలు, జీవన విధానంపై తెలంగాణ కథకులు ‘ఏం చెప్పిండ్రు? ఏం చెప్పలేదు? ఎందుకు చెప్పలేదు?’ అన్న అంశంమీద మాట-ముచ్చట ఆగస్టు 9న హైదరాబాద్‌లో తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో జరిగింది.
ప్రారంభ సమావేశానికి అధ్యక్షత వహించిన తెరవే అధ్యక్షులు జూకంటి జగన్నాథం మాట్లాడుతూ తెలంగాణ సాహిత్యమంటే జన జీవన చిత్రణ కూడా అంటూ 1990 తర్వాత ఆడెపు లక్ష్మీపతి నుంచి పెద్దింటి అశోక్ దాకా అనేకులు గ్రామ విధ్వంస ముఖచిత్రాన్ని, వలసలను, ప్రపంచీకరణను […]
Read Full Post »
- కె. శ్రీనివాస్
భాష అంటే అది మాట్లాడే ప్రజలూ, వారి సంస్కృతీ, చరిత్రా. అవన్నీ ధ్వంసమయ్యాక, భాష ఒక్కటే బతికి బట్టకట్టడం సాధ్యం కాదు. విదేశీవస్తుబహిష్కరణ, సహాయనిరాకరణ- వంటి విలువలు కలిగిన జాతీయోద్యమాన్ని చరిత్ర చెత్తకుండీలోకి తోసేసిన తరువాత- ప్రపంచీకరణలోనే పరమస్వేచ్ఛ కనిపిస్తుంది…. ఎగుమతికి కావలసిన సరుకులు ఉత్పత్తి చేసే సెజ్‌లు, పార్కులు, విదేశాలకు కావలసిన పంటలు పండిచే వ్యవసాయం, ప్రపంచ వైట్‌కాలర్ కార్మికులుగా పనిచేయడానికి తీర్చిదిద్దే విద్య- ఇదీ నేటి దృశ్యం. ఈ చిత్రపటంలో ప్రజలు […]
Read Full Post »
- ఆచార్య రవ్వా శ్రీహరి
ఆంధ్రులందరూ ఒకేజాతికి చెందినవారైనా ఆంధ్రదేశంలోని ప్రాంతాల భేదాన్నిబట్టి నిజామాంధ్రులు, కోస్తా ఆంధ్రులు, రాయలసీమ ఆంధ్రులు, కళింగాంధ్రులు అనే నాలుగు ప్రధాన భేదాలు కనిపిస్తాయి. నిజామాంధ్రులు నివసించే భూభాగాన్నే మనం ‘తెలంగాణ’ అని వ్యవహరిస్తున్నాం. ఏమి దురదృష్టమో కాని కొన్ని ప్రాంతాల పండితుల్లో, పెద్దల్లో తెలంగాణంలో తెలుగు లేదనీ, ఉన్నా అది సరైన తెలుగు కాదనీ నిష్కారణమైన అసత్యమైన అపోహ నేటికీ ఉంది. ఈ అపోహ కలిగిన వారు తెలంగాణంలోని మారుమూల పల్లెలకు వెళ్లితే […]
Read Full Post »
Posted in ప్రకటనలు, ఆంధ్రజ్యోతి, తెలుగు on జూన్ 22nd, 2009
- ‘సింగిడి’ తెలంగాణ రచయితల సంఘం
‘సింగిడి’ తెలంగాణ రచయితల సంఘం ‘తొల్సూరు మహాసభలు’ ఆగస్టులో హైదరాబాద్‌లో జరుగనున్నాయి. ఆనాటికి ‘సింగిడి’ పేరుతో త్రైమాస పత్రిక తీసుకురావాలని నిర్ణయించాం. దీనికి ఏడుగురు సభ్యులు- ఏలేశ్వర నాగభూషణాచార్య, సంగిశెట్టి శ్రీనివాస్, గోగు శ్యామల, షాజహానా, కాసుల ప్రతాపరెడ్డి, జిలుకర శ్రీనివాస్, పసునూరి రవిందర్ సంపాదకవర్గంగా వ్యవహరిస్తారు. తెలంగాణ కథలు, కవిత్వంతోపాటు అన్ని కోణాలనుంచి వ్యాసాలను, ముఖ్యంగా తెలంగాణ దళిత, బహుజన, ఆదివాసీ, ముస్లిం రచనలనూ ఆహ్వానిస్తున్నాం. జూలై 15 లోగా […]
Read Full Post »
Posted in ప్రకటనలు, ఆంధ్రజ్యోతి, తెలుగు on జూన్ 18th, 2009
‘తెలంగాణ రచయితల వేదిక’ (తెరవే) 5వ రాష్ట్ర మహాసభలు ములాఖాత్ పేరిట ఈ నెల 21వ తేదీన సుందరయ్య విజ్నాన కేంద్రం, హైదరాబాద్ లో జరుగుతాయి. ఉదయం 10 గంటలకు జెండా ఆవిష్కరణ జూకంటి జగన్నాథం చేస్తారు. చుక్కా రామయ్య గండదీపం వెలిగిస్తారు. అల్లం రాజయ్య ప్రారంభోపన్యాసం చేస్తారు. జూకంటి అధ్యక్షోపన్యాసం చేస్తారు. జూలూరు గౌరీ శంకర్ కార్యదర్శి నివేదిక చదువుతారు. ముఖ్య అతిథులుగా కె.శ్రీనివాస్, టంకశాల అశోక్, మల్లె పల్లి లక్ష్మయ్య, అల్లం నారాయణ పాల్గొంటారు. […]
Read Full Post »
Posted in సంపాదకీయం, ఆంధ్రజ్యోతి, తెలుగు, వ్యాసాలు on జూన్ 13th, 2009
- అల్లం నారాయణ
నిజమే. తెలంగాణ గుండె గాయపడింది. క్షతగాత్ర తెలంగాణ. మరోసారి నిలువునా మోసపోయిన తెలంగాణ. ఇంటి మనుషులు, పరాయి మనుషులతో రెండందాలా దగాపడింది తెలంగాణ. కకావికలై, ఛిద్రుపలైన గుండె గాయం పాతది. అది మాననిది. ఇప్పుడిక ఏలిక పూర్తి విద్వేషంతో, పూర్తి అసహనంతో, ఏమీ దాచుకోకుండానే ప్రకటించాడు.
Read Full Post »
- ఆర్. ఉమామహేశ్వరి
కాంగ్రెస్ ప్రభుత్వం పునరాగమనంతో గోదావరి జలాల నియంత్రణ, వాటి ప్రైవేటీకరణ మరింత వేగవంతమవనున్నాయని చెప్పవచ్చు. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ వ్యవస్థల పరిరక్షణ, నిర్వాసితుల పునరావాసం, ప్రకృతిని మానవ అవసరాలకు అనుగుణంగా నియంత్రించడం, వాతావరణ మార్పులు మొదలైన అంశాలపై ముమ్మర చర్చలు జరుగుతున్నాయి. ఈ అంశాలపై ఆయా దేశాల పాలకులు అనుసరిస్తున్న విధానాల పట్ల తీవ్ర నిరసన పెల్లుబుకుతోంది. అయినప్పటికీ మన రాష్ట్రంలో కాటన్ వారసత్వం నిరాటంకంగా కొనసాగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
[…]
Read Full Post »
Posted in కౌంటర్, వివిధ, ఆంధ్రజ్యోతి, తెలుగు, కథలు on జూన్ 7th, 2009
- స్కైబాబ
గ్లోబలైజేషన్.. నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాలు… ఇవన్నీ ప్రజలకు చెడు చేస్తున్నయని చెప్పుకు తిరిగే ఒక వర్గం తయారై ఉంది. గబుక్కున ఈ ఫలితాలన్ని అందుకునే వాళ్ళలో ఈ వర్గం ముందే ఉంటుంది. అన్ని అనుబవిస్తది. పొరపాటునో లేక వేరే కారణాలవల్లో ఏవో కొందరికి అలాంటి మంచి జరిగితేనో ఇది ఈ విధంగా జరగటానికి వీల్లేదు. ఇది మీకు చాలా చెడు చేస్తదని వాళ్ళున్న స్థితిని, స్థాయిని పట్టించుకోకుండా వీళ్లుచెప్పబోతుంటరు వాళ్లకు.
[…]
Read Full Post »
Posted in వివిధ, ఆంధ్రజ్యోతి, తెలుగు, పాటలు on జూన్ 7th, 2009
- గోరటి వెంకన్న
కంప కుంపటోలె కమ్మి అలుపె
కాసింత కునుకుతో బలెహాయి గొలిపె
సోయిలేని హాయి సూడసక్కని రేయి
విని కనిపించని వింతగొంతుల జోలి
Read Full Post »
- పసునూరి రవీందర్
ఉద్యమాల పురుటిగడ్డ మీద కథాసాహిత్య ప్రక్రియను మరింత విస్తరించేందుకు తెలంగాణ నవ కథకుల ఆధ్వర్యంలో తెలంగాణ కథా వేదిక ‘దస్కత్’ ఆవిర్భవించింది. తెలంగాణ నేలమీద జరిగిన, జరుగుతున్న పోరాటాల్లో సాహిత్యం తనవంతు పాత్రను క్రియాశీలకంగా పోషించింది. అక్షరాలు దారి చూపే వెలుగు దీపాలైనయ్. ఈ క్రమంలో జీవితాన్ని సమగ్రంగా ప్రతిబింబించే కథా ప్రక్రియను మరింత విస్తరించాల్సిన అవసరాన్ని ఈ ప్రాంత నవతరం గుర్తించింది.
Read Full Post »
Posted in ఆంధ్రజ్యోతి, తెలుగు, కళాకారులు, వ్యాసాలు on జూన్ 4th, 2009
- గజన్నాథం శ్రీనివాసచారి (ఆన్‌లైన్/నిర్మల్)
ఒకసారి నిజాం ప్రభువు నిర్మల్‌కు వచ్చినప్పుడు ఆయనకోసం అక్కడి కళాకారులు స్వాగత వేదికను ప్రత్యేకంగా అలంకరించారు. ఆయన సింహాసనం పైన వేలాడేలా బంగారు రంగులో తయారు చేసిన అరటి పువ్వును పెట్టారు. ప్రభువు ఆసీనుడు కాగానే అది విచ్చుకుని బంగారు రంగుల రేకులు జలజలా పడ్డాయి. దానికి ఎంతో సంతోషించిన నిజాం ఆ అలంకారాన్ని అంత సుందరంగా చేసిన సోమక్షత్రియులను తమ ఆస్థాన కళాకారులుగా నియమించుకున్నారు.
Read Full Post »
Posted in ప్రకటనలు, ఆంధ్రజ్యోతి, తెలుగు on జూన్ 1st, 2009
- సుద్దాల అశోక్ తేజా
సుద్దాల హనుమంతు శత జయంతి సంవత్సరం సందర్భంగా ‘సుద్దాల జీవితం-సాహిత్యం’ అనే సంకలనం తీసుకువస్తున్నాం. ఆయన రచనలు- పాటలు, గొల్ల సుద్దులు, సాధు వేషాలు, పిట్టల దొర, ఫకీరు వేషం లాంటివి ఎవరివద్ద ఉన్నా మాకు పంపి సహకరించగలరు. ఆయనతో వ్యక్తిగత అనుభవాలు, అనుబంధాలు రాసి పంపగలరు. హైదరాబాద్‌లో జరిగే పుస్తకావిష్కరణ సభ వివరాలు తెలుపుతాము.
Read Full Post »