ఏ పార్టీ వైఖరి ఎట్లున్నా తెలంగాణ అంశం అన్ని పార్టీలను ఒక చౌరస్తాలో నిలబెట్టిందనీ, ఉపఎన్నికల అనంతరం రాజకీయ పార్టీల పరిస్థితి సంక్షోభంలో పడనున్నదనీ అంటున్నారు నాగోబా
టి.ఆర్.ఎస్. ప్రజాప్రతినిధుల మూకుమ్మడి రాజీనామాలు తెలంగాణ రాజకీయోద్యమాన్ని కీలక మలుపు తిప్పింది. అదే సమయంలో సమైక్యవాదాన్ని సమర్థించే రాజకీయ పార్టీలలో తెలంగాణ వాదుల ఒత్తిడి తీవ్రతరమైంది. టి.ఆర్.ఎస్. ప్రజా ప్రతినిధుల రాజీనామాలను తెలంగాణ ప్రజలు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక వర్గాలు, మేధావులు, కవులు, రచయితలు, కళాకారులు, విద్యార్థులు స్వాగతించారు.
Category Archive for 'వర్తమానం'
ఆరువందలపదా, అదేమిటి?
Posted in వర్తమానం, G.Os, ఆంధ్రజ్యోతి, తెలుగు on జులై 3rd, 2007
- ఎన్. వేణుగోపాల్
జీవో 610 వివాదం మళ్ళీ ఒకసారి రాజుకుంటున్నది. ఒకసారి విషాదం గా ముగిసిన చరిత్ర మరొకసారి హాస్యాస్పదంగా పునరావృత్తమవుతుందని అన్నట్టు ఈసారి విషాదమూ ప్రహసనమూ కలగలిసి సాగుతున్నాయి. ఈసారి ప్రధాన చర్చ ఆ జీవోను అమలు చేయడమా చేయకపోవడమా అనికాదు. ఆ జీవో అసలేమిటో తెలుసునా అని జరుగుతున్నది.
వర్తమానం : మరలనిదేల ఎస్సార్సీ?
Posted in వర్తమానం, రెండవ ఎస్.ఆర్.సి, ఆంధ్రజ్యోతి, తెలుగు on జనవరి 9th, 2007
- ఎన్. వేణుగోపాల్
ఆ రావణకాష్టం ఈ దేశంలో ఎప్పటికీ చల్లారదనే స్పష్టమైన అవగాహనతోనే, ‘మరలనిదేల రామాయణంబన్న’ అని తానే ప్రశ్న వేసుకుని ‘తినిన అన్నమే తినినయట్లు, చేసిన సంసారమే చేసినయట్లు’ అని జవాబు చెప్పుకుని రామాయణ కల్పవృక్షం రాశారు విశ్వనాథ సత్యనారాయణ. విలీనానికి ముందునుంచీ, 1952 నుంచీ రగులుతున్న తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష ఎప్పటికీ ఆరిపోదనే స్పష్టమైన అవగాహనతోనే, ఆ మంటమీద దొరికిన చన్నీళ్లు నాలు గు చిలకరిద్దామనే సాచివేత ఎత్తుగడలో భాగంగానే ‘మరలనిదేల ఎస్సార్సీ’ […]



