ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఇంతకాలం బతికి బట్టకట్టడానికి కారణం ప్రజలే తప్ప ప్రభువులు కారనడానికి గురువారం నాటి తొలిదశ పోలింగ్ సరళీ, పోలింగ్ ముగిసీ ముగియకముందే ముఖ్యమంత్రి ప్రదర్శించిన బాధ్యతారాహిత్యం మరోసారి రుజువు చేశాయి. కష్టనిష్టూరాలకు ఓర్చి ప్రజలు ఓటర్లుగా తమ బాధ్యతను నెరవేర్చుకున్నారు. కానీ రాజకీయలోకానికి ఆదర్శంగా నిలబడవలసిన పదవిలో ఉండి కూడా ముఖ్యమంత్రి వై.ఎస్. తెలంగాణలో పోలింగ్ ముగిసిన క్షణాన, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఓట్ల కోసం నోరుజారి పిసిసి అధ్యక్షుడు [...]
Read Full Post »
కోట్ల డబ్బులు అయిపోయాయి పనులింకా పూర్తి కాలేదు ఆర్భాటంగా ప్రాజెక్టుల పెంపు ఇలాగైతే పదిహేనేళ్లయినా పట్టొచ్చు పెరిగిపోతున్న అంచనా వ్యయం నాణ్యతకు తిలోదకాలు రైతన్నకు నీరు అందేదెన్నడు? – ఎం.ఎల్.నరసింహారెడ్డి, న్యూస్‌టుడే జనరల్‌బ్యూరో ముఖ్యమంత్రి వై.ఎస్. గద్దెనెక్కగానే ఘనంగా ప్రకటించుకున్నదీ… అపరభగీరథుడినంటూ తనకు తాను కితాబునిచ్చుకున్నదీ…. ప్రధానీ తదితర ప్రముఖులందరికీ ప్రముఖంగా చూపించుకున్నదీ… ప్రపంచంలోనే నభూతో… అని చాటుకున్నదీ…. జలయజ్ఞం! మరి.. ఆ యజ్ఞం ఇప్పుడెక్కడికొచ్చింది? ఫలం ఎలా ఉంది? నీటి ప్రాజెక్టుల పరిస్థితేంటి? ఎన్ని పూర్తయ్యాయ్! [...]
Read Full Post »
Posted in తెలంగాణ ప్రాజెక్టుల, తెలుగు, ఈనాడు on Dec 23rd, 2008
ముంపు బారిన మహారాష్ట్ర వన్యమృగ సంరక్షణ ప్రాంతం | గుర్తించిన ఇంజినీర్లు సమస్యలు తప్పవంటున్న నిపుణులు! | బయటపడే మార్గంపై అధికారుల యోచన ప్రాణహిత-చేవెళ్ల ఎత్తిపోతల పథకం మరో ‘పోలవరం’ కానుందా?… ఈ ప్రశ్నకు నీటిపారుదల రంగ నిపుణులు, అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం ఇంజినీర్లు అవుననే సమాధానమిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో వన్యమృగ సంరక్షణ విభాగం అనుమతి కోసం నీటిపారుదలశాఖ అధికారులు పడిన పాట్లు అన్నీ ఇన్నీ కావు. వీటికోసం మధ్యలో కొన్నాళ్లు పోలవరం పనుల్ని ఆపేయాల్సి [...]
Read Full Post »
‘Color Telangana 2008′ painting competition held at Nizamabad, organized on behalf of Discover Telangana and Telangana IT Forum (TITF) was a big success with the participation of 148 students. Discover Telangana thanks everyone involved in this event. Jooluri GouriShankar, (General secretary, Telangana Rachayithala Vedika), B.V Chary (artist, sculptor & Creator of Telangana Thalli), JNTU Proffessor [...]
Read Full Post »
‘Color Telangana 2008‘. (CT8) was held successfully in Karimnagar, Organized in collaboration with ‘Discover Telangana‘ and ‘Karimnagar Film Society‘ (KaFiSo) on 15th November 2008, at KaFiSo Film Bhavan. Around 50 students participated & made the event a success.
Read Full Post »
Posted in తెలుగు, ఈనాడు on Feb 19th, 2008
హైదరాబాద్, న్యూస్‌టుడే: మంగళవారం.. సమయం ఉదయం 11.30. శాసనసభ ఆవరణలో ఒక్కసారిగా కలకలం. పోలీసులు, మీడియా అందరూ కలకలం వినిపిస్తున్నవైపు పరుగులు. ఒకపక్క అసెంబ్లీ సందర్శకులు, మరోవైపు పాత్రికేయులు, ఇంకోవైపు పోలీసులు.. ఏం జరుగుతోందో తొలుత ఎవరికీ అర్థం కాలేదు. తెలంగాణ విద్యార్థి సంఘం, తెలంగాణ బహుజన విద్యార్థి సమాఖ్యలకు చెందిన సుమారు 15 మంది విద్యార్థులు మంగళవారం అసెంబ్లీ ఆవరణలో ప్రవేశించి నినాదాలు చేసినప్పుడు తొలుత నెలకొన్న పరిస్థితి ఇది.
Read Full Post »
Posted in తెలుగు, ఈనాడు, వార్తల్లో on Jul 5th, 2007
న్యూజెర్సీ: తెదేపా అధినేత చంద్రబాబు అమెరికా పర్యటనకు వ్యతిరేకంగా తెలంగాణ అభివృద్ధి ఫోరమ్(టీడీఎఫ్) నిరసనలు తెలిపింది. ఆల్బర్ట్ రాయల్ ప్యాలెస్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. చంద్రబాబు పాలనలో తెలంగాణ అభివృద్ధి చెందలేదని, అధిక సంఖ్యలో రైతులు, చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని టీడీఎఫ్ మద్దతుదారులు నిరసనలు తెలిపారు.
Read Full Post »
Posted in తెలుగు, సాహిత్య వార్తలు, ఈనాడు, వ్యాసాలు on Feb 16th, 2007
గోండు భాషాభివృద్ధికి నడుం కట్టిన విదేశీయుడు. కుటుంబంతో నాలుగేళ్లుగా ఆదిలాబాద్ అడవుల్లో జీవనం. 20 ప్రాథమిక పాఠశాలల్లో గోండు మాధ్యమంలో బోధన. నిఘంటువు, జీవితచరిత్రలు, పాఠ్యపుస్తకాల రూపకల్పన. ఆదిలాబాద్-న్యూస్‌టుడే ఈనాడు : ఆంగ్లదేశంలో పుట్టి ఆంధ్రరాష్ట్రం వచ్చి… తెలుగు భాషనుఅభివృద్ధి చేశారు ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్. తెలుగువాడిగా పుట్టి సవర భాషకు ప్రాణం పోశారు గిడుగు రామమూర్తి. వీరి కోవలోనే మరో విదేశీయుడు గోండు భాషపై మమకారం పెంచుకున్నారు. మన రాష్ట్రంలోనే దాన్ని బతికించడానికి కంకణం కట్టుకున్నారు. [...]
Read Full Post »