షికాగోలో వైయస్కు నిరసన
Posted in వార్తల్లో, ThatsTelugu.com on May 8th, 2007
అమెరికాలోని షికాగో పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డికి వ్యతిరేకంగా తెలంగాణవారు నిరసన వ్యక్తం చేశారు. డెట్రాయిట్ వంటి ప్రాంతాల నుంచి వచ్చిన తెలంగాణవారు ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. తెలంగాణ సమస్యలను, తెలంగాణకు జరిగిన అన్యాయాలను ఎత్తిచూపుతూ ప్లకార్డులు ధరించి నిర్దేశిత ప్రదేశాల్లో నిలబడి వారు నిరసన వ్యక్తం చేశారు.