- సి.విఠల్, శ్రీధరరావు దేశ్‌పాండే
వెనుకబడిన ప్రాంతాల అభివృధ్ధికి ఒక చట్టబద్ద సంస్థను ఏర్పాటు చేస్తాం, దీనిపై మీరు చర్చకు సిద్ధమేనా అని ముఖ్యమంత్రి వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి పెద్ద పెద్ద పత్రికా ప్రకటనల ద్వారా చర్చకు తెరతీసారు. తెలంగాన ప్రజలకు ఇటువంటి తాయిలాలు ఆంధ్రా వలస ప్రభుత్వాలు ప్రకటించడం కొత్తకాదు. తెలంగాణ ఆకాంక్షలు బలంగా తలెత్తిన ప్రతిసారి ఇటువంటి తాయిలాలను వారు తెలంగాణ ప్రజలకు చూపిస్తూపోయారు.
Category Archive for 'వార్త'
తరతరాల తెలంగాణ ఉద్యమంపై గొంతెత్తిన ‘పాలపిట్ట’
Posted in వార్త, సాహిత్య వార్తలు on ఆగస్టు 6th, 2007
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రసాధనకోసం జరుగుతున్నఉద్యమ విస్తృతిని వివరించేదే ‘బతుకమ్మ పాట, పాలపిట్ట పాట’లని విరసం నాయకుడు వరవరరావు అభివర్ణించారు. సోమవారం రాత్రి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోప్రత్యేక తెలంగాణ ఉద్యమంపై వరవరరావు రచించిన ‘పాలపిట్ట పాట’_ ప్రత్యేక తెలంగాణ పోరాట పాటలు, ‘తెలంగాణ వీరగాథ – ఏడేడు తరాల కథ: బతుకమ్మ పాటల‘ సిడిల ఆవిష్కరణ సభ జరిగింది.
‘తెలంగాణ’పై తొందరపడాలి ! ఆలస్యం అనర్థదాయకం
Posted in రెండవ ఎస్.ఆర్.సి, వార్త, తెలుగు on డిసంబర్ 29th, 2006
- మధుగౌడ్ యాష్కీ
ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు చాలా ముందే తెలంగాణ రాష్ట్రంకోసం ఆందోళన ప్రారంభమైంది. మొదటి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘం (ఎస్.ఆర్.సి) స్పష్టంగా చెప్పిన ఈ అభిప్రాయాన్ని పునరుద్ఘాటించుకోవడం అవసరం : ‘హైదరాబాద్ రాష్ట్రంగా చెప్పుకొంటున్న తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పరచడం ఆంధ్ర, తెలంగాణ ప్రయోజనాలరీత్యా కూడా అవసరమే. 1961లో, లేదా ఆ సమీపంలో జరిగే సార్వత్రిక ఎన్నికల తర్వాత హైదరాబాద్ (తెలంగాణ) రాష్ట్రానికి చెందిన శాసనసభ్యులలో మూడింట రెండువంతులమంది ఆమోదిస్తే, ఆంధ్రతో సమైక్యమయ్యే ప్రొవిజన్‌ను పొందుపరచుకోవాలి’ […]



