Feed on
Posts
Comments

Category Archive for 'తెలంగాణ రచయితలు'

- వెల్దండి శ్రీధర్‌
తెలంగాణ సామాజిక పరిణామాలు, జీవన విధానంపై తెలంగాణ కథకులు ‘ఏం చెప్పిండ్రు? ఏం చెప్పలేదు? ఎందుకు చెప్పలేదు?’ అన్న అంశంమీద మాట-ముచ్చట ఆగస్టు 9న హైదరాబాద్‌లో తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో జరిగింది.
ప్రారంభ సమావేశానికి అధ్యక్షత వహించిన తెరవే అధ్యక్షులు జూకంటి జగన్నాథం మాట్లాడుతూ తెలంగాణ సాహిత్యమంటే జన జీవన చిత్రణ కూడా అంటూ 1990 తర్వాత ఆడెపు లక్ష్మీపతి నుంచి పెద్దింటి అశోక్‌ దాకా అనేకులు గ్రామ విధ్వంస ముఖచిత్రాన్ని, వలసలను, ప్రపంచీకరణను […]

Read Full Post »

- ఆచార్య రవ్వా శ్రీహరి
ఆంధ్రులందరూ ఒకేజాతికి చెందినవారైనా ఆంధ్రదేశంలోని ప్రాంతాల భేదాన్నిబట్టి నిజామాంధ్రులు, కోస్తా ఆంధ్రులు, రాయలసీమ ఆంధ్రులు, కళింగాంధ్రులు అనే నాలుగు ప్రధాన భేదాలు కనిపిస్తాయి. నిజామాంధ్రులు నివసించే భూభాగాన్నే మనం ‘తెలంగాణ’ అని వ్యవహరిస్తున్నాం. ఏమి దురదృష్టమో కాని కొన్ని ప్రాంతాల పండితుల్లో, పెద్దల్లో తెలంగాణంలో తెలుగు లేదనీ, ఉన్నా అది సరైన తెలుగు కాదనీ నిష్కారణమైన అసత్యమైన అపోహ నేటికీ ఉంది. ఈ అపోహ కలిగిన వారు తెలంగాణంలోని మారుమూల పల్లెలకు వెళ్లితే […]

Read Full Post »

- మఖ్దూమ్‌ మొహియుద్దీన్‌

హైదరాబాద్‌ నగరానికి ఎన్నో ద్వారాలు వున్నాయి. నగరంలో ఎవరైనా అడుగు పెట్టాలంటే, ఆ ద్వారాలగుండానే లోపలికి అడుగుపెట్టాలి. చంపాద్వారం నుంచి యాకుబ్‌పురా ద్వారం దాటి ధర్మంవంత్‌ హైస్కూలు దాకా నేను రోజూ నడుచుకుంటూ వెళ్ళే వాణ్ణి. ఆరోజుల్లో రిక్షాలుగానీ, సైకిళ్ళు గానీ, బస్సులు గానీ చాలా తక్కువగా కనిపిస్తూవుండేవి. రోడ్ల మీద ఏనుగులూ, ఒంటెలూ, ఎద్దుల రథాలు వుండేవి. షకరాలూ, జట్కాలూ టాంగాలూ, గుర్రపుబగ్గీలూ దర్శనమిస్తూ వుండేవి. ఆ రోజుల్లో వీధి వీధినా వ్యాయామశాలలూ, […]

Read Full Post »

‘సింగిడి‘ తెలంగాణ రచయితల సంఘం, ప్రథమ సభలు ; అందరూ ఆహ్వానితులే
వివరాలకు ఆహ్వానం మీద క్లిక్ చెయన్రి

తారీఖు : నవంబర్ 02, 2008 ఆదివారం
వఖ్త్ : మ|| 2:00 గంటల నుంచి…
తావు : నేరేళ్ళ వేణు మాధవ్ కళా ప్రాంగణం, పబ్లిక్ గార్డెన్ , హన్మకొండ (వరంగల్, తెలంగాణ)

Read Full Post »

Managed by Discover Telangana Inc., a registered nonprofit organization in USA.

All opinions and views expressed by third party content providers and shown here as preview are not that of Discover Telangana.

If you find any Content that is infringing, libelous, defamatory, obscene, abusive, offensive or otherwise violation of copyright law, alert us by emailing us at discover.telangana(at)gmail.com