అన్నల్లారా! అక్కల్లారా!
మూడున్నర కోట్ల తెలంగాణ బిడ్డల్లారా… నిజాం పాలన పోతే బాధలన్ని పోతయనుకున్నం. మనం గాకపోయినా మన పొల్లగాండ్లయినా తెల్లగ బతుకుతరనుకున్నం. కాని నోరు అందల మెక్కుదామంటే నొసలు కట్టెలు మోపియ్యవట్టె. బతుకు పేనం మీది నుంచి పొయ్యిల పడ్డట్టాయె. బుదురకిచ్చి పొత్తు గూడుదామనిరి. ఉప్పేసి పొత్తు గూడిరి. మనం వద్దు వద్దన్నా బల్మీటికి బక్తున్ని జేసి పంగ నామాలు వెట్టిరి. తుడుసుకుందామంటే పోయేదా ఇడుసుకుందామంటే వచ్చేదా. ఎవలో ముగ్గురు ఒప్పుకున్నరని మూడు కోట్లమందిని బందీలు జేసిరి. […]
Read Full Post »
Click here to see more pictures of “Flood relief activities by Telangana I.T Forum on Picasa“
Read Full Post »
Posted in బతుకమ్మ, ఆంధ్రజ్యోతి, తెలుగు, వ్యాసాలు on సెప్టెంబర్ 18th, 2009
నేటి నుంచి జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు మొదలు కానున్నాయి. పల్లెలు, పట్టణాల్లో ప్రతి ఇంటి లోగిలీ ఓ పూలతోటగా పరిమళించనుంది. ప్రతి యేటా మహాలయ అమావాస్య మొదలు మహర్నవమి వరకు తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతాయి. ఆప్యాయతానురాగాలకు తోడుగా ఆధ్యాత్మికతను రంగరించే ఈ రంగుల పండుగ ప్రతి ఇంట్లో సంతోషాల పూలు పూయిస్తుంది.. ఇక ఈ తొమ్మిది రోజులూ జిల్లాలోని పట్టణాలు, పల్లెలన్నీ వీనుల విందైన బతుకమ్మ పాటలతో మారుమోగనున్నాయి.
[…]
Read Full Post »
- కె. శ్రీనివాస్
భాష అంటే అది మాట్లాడే ప్రజలూ, వారి సంస్కృతీ, చరిత్రా. అవన్నీ ధ్వంసమయ్యాక, భాష ఒక్కటే బతికి బట్టకట్టడం సాధ్యం కాదు. విదేశీవస్తుబహిష్కరణ, సహాయనిరాకరణ- వంటి విలువలు కలిగిన జాతీయోద్యమాన్ని చరిత్ర చెత్తకుండీలోకి తోసేసిన తరువాత- ప్రపంచీకరణలోనే పరమస్వేచ్ఛ కనిపిస్తుంది…. ఎగుమతికి కావలసిన సరుకులు ఉత్పత్తి చేసే సెజ్‌లు, పార్కులు, విదేశాలకు కావలసిన పంటలు పండిచే వ్యవసాయం, ప్రపంచ వైట్‌కాలర్ కార్మికులుగా పనిచేయడానికి తీర్చిదిద్దే విద్య- ఇదీ నేటి దృశ్యం. ఈ చిత్రపటంలో ప్రజలు […]
Read Full Post »
Posted in తెలుగు, వీడియో, కళాకారులు, పాటలు on జులై 29th, 2009
(Courtesy: Surender Maddi, VenuGopal Nakshathram, Ravi MayReddy)
Click here to visit the PlayList on YouTube
Read Full Post »
(Courtesy: Lakshmi Talk Show)
Read Full Post »
Posted in తెలంగాణ పట్నాలు, English, వ్యాసాలు on జులై 12th, 2009
- Md.Raheem
Here is an enchanting piece of tale which reveals the quaint history behind the street names of our ancient city. This meticulously researched article exposes the extraordinary as well as anecdotal legends behind these names which we so dearly associate with…
Read Full Post »
Posted in ఆంధ్రజ్యోతి, తెలుగు, కళాకారులు, వ్యాసాలు on జూన్ 4th, 2009
- గజన్నాథం శ్రీనివాసచారి (ఆన్‌లైన్/నిర్మల్)
ఒకసారి నిజాం ప్రభువు నిర్మల్‌కు వచ్చినప్పుడు ఆయనకోసం అక్కడి కళాకారులు స్వాగత వేదికను ప్రత్యేకంగా అలంకరించారు. ఆయన సింహాసనం పైన వేలాడేలా బంగారు రంగులో తయారు చేసిన అరటి పువ్వును పెట్టారు. ప్రభువు ఆసీనుడు కాగానే అది విచ్చుకుని బంగారు రంగుల రేకులు జలజలా పడ్డాయి. దానికి ఎంతో సంతోషించిన నిజాం ఆ అలంకారాన్ని అంత సుందరంగా చేసిన సోమక్షత్రియులను తమ ఆస్థాన కళాకారులుగా నియమించుకున్నారు.
Read Full Post »
- లోచన్
ఎంతైనా నువ్వు గ్రేట్
నీ విజన్ గ్రేట్
హైద్రాబాద్ చుట్టూ అల్లుకున్న నీ అభిమానం గ్రేట్
Read Full Post »
- మఖ్దూమ్ మొహియుద్దీన్
హైదరాబాద్ నగరానికి ఎన్నో ద్వారాలు వున్నాయి. నగరంలో ఎవరైనా అడుగు పెట్టాలంటే, ఆ ద్వారాలగుండానే లోపలికి అడుగుపెట్టాలి. చంపాద్వారం నుంచి యాకుబ్‌పురా ద్వారం దాటి ధర్మంవంత్ హైస్కూలు దాకా నేను రోజూ నడుచుకుంటూ వెళ్ళే వాణ్ణి. ఆరోజుల్లో రిక్షాలుగానీ, సైకిళ్ళు గానీ, బస్సులు గానీ చాలా తక్కువగా కనిపిస్తూవుండేవి. రోడ్ల మీద ఏనుగులూ, ఒంటెలూ, ఎద్దుల రథాలు వుండేవి. షకరాలూ, జట్కాలూ టాంగాలూ, గుర్రపుబగ్గీలూ దర్శనమిస్తూ వుండేవి. ఆ రోజుల్లో వీధి వీధినా వ్యాయామశాలలూ, […]
Read Full Post »
- ఎస్. జగన్‌రెడ్డి
అలనాడు సాహిత్యకారులను గౌరవించడం హైదరాబాద్ రాజ్యంలో ఒక సామాజిక విలువగా చెలామణి అయ్యేది. రాజులు, కులీనవర్గాలే కాదు సామాన్యులు కూడా కళాప్రియులు, కవిత్వ పిపాసులే. రాజులు సంగీత, సాహిత్యకారులు కావడం చరిత్రలో ఉన్నదే. ఆసఫ్ జాహీల వంశంలో ఐదుగురు రాజకవులు ఉర్దూ సాహిత్యంలో పేరెన్నికగనడం విశేషం…
Read Full Post »
Posted in తెలంగాణ ప్రజలు, ఆంధ్రజ్యోతి, తెలుగు on మే 15th, 2009
- కోటీ-వేణు
అమ్మకు బహిరంగ లేఖ
అమ్మా!
బావున్నావే, మేమిద్దరం బాగున్నామే. ఇప్పుడు నువ్వు, నీ ఆలోచనలు మా ఇద్దరి మధ్య ఇద్దరి కోడళ్ల మధ్యే కాదు మొత్తం మన పార్టీ కామ్రేడ్స్ మద్యా చర్చనీయాంశమే అమ్మా! మన కామ్రేడ్స్ అందరికీ అమ్మవే నీవిపుడు. నీ గుండె ధైర్యం, మనసులోని మంచితనం మాకెప్పుడూ ఆదర్శమే కాదు అనుసరణీయమే. మేం ఇల్లు విడిచిన నాటి నీ రూపు, బాపు రూపు తప్ప మరో మారు చూసి ఎరగం కదే.
[…]
Read Full Post »
- పెద్దింటి అశోక్‌కుమార్
మార్చి 14, 15తేదీలలో 13మంది కథకులతో మిడ్‌మానేరు ముంపుగ్రామాల సందర్శనను చేపట్టింది తెలంగాణ రచయితల వేదిక. శ్రీరాంసాగర్ వరద కాలువ ప్రాజెక్టులో భాగంగా కరీంనగర్ జిల్లా మానేరు నదిపై కడుతున్న చెక్ డ్యాం కింద 18 ఊర్లు మునిగిపోనున్నాయి. దాదాపు లక్షమంది నిర్వాసితులవబోతున్నారు. బాధిత ప్రజలకు నష్టపరిహారాల్లేవు.. పునరావాసాల్లేవు.. వారి దీన గాధలు విని తల్లడిల్లిన రచయితల మనసు ఘోష ఇది…
Read Full Post »
- C.H.Hanumantha Rao
PROFESSOR B JANARDHAN RAO MEMORIAL FOUNDATION
(Seventh Annual Memorial Lecture, 2009)
While we assemble here this morning to pay our tributes to the memory of Prof.B. Janardhan Rao, we greatly miss him on several counts. He had done outstanding research work on tribal development and held out a great promise for further explorations in this […]
Read Full Post »
- వరవరరావు
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పార్లమెంటులో బిల్లు పెట్టాలనే డిమాండ్‌తో ప్రజా గాయకుడు గద్దర్ వరంగల్, హనుమకొండ, కాజీపేటలలో 2008, డిసెంబర్ 11 నుంచి 15 వరకు పాదయాత్ర తలపెట్టాడు. ఈ పాదయాత్రలో ఆ మూడు పట్టణాల్లో ఆయన ప్రతి గడప తొక్కి ప్రతి ఇంటిలో పౌరుల కడుపులో తలపెట్టి తన ఈ డిమాండుకు సంఘీభావం ప్రకటించాలని కోరుతానన్నాడు.
Read Full Post »
Prof. KodandRam
Read Full Post »
- గద్దర్
వీరులార - మీకు జోహార్లు…
పారె నెత్తుటి పోరుల జోహార్లు..
విద్యార్థులార జోహార్లు…
వీరులారా
Read Full Post »
కరీంనగర్, నిజమాబాద్, మహబ్‌నగర్ నుంచి దాదాపు 500 పైన విద్యార్థులు పాలుగొని ‘కలర్ తెలంగాణ 2008′ని విజయవంతం చెసిన నేపథ్యంల, ‘డిస్కవర్ తెలంగాణ’, ‘కరీంనగర్ ఫిలిం సొసైటీ’ సారథ్యంల ఇప్పుడు ‘ఫిలిం తెలంగాణ 2009‘ డిజిటల్ శార్ట్ ఫిలిం పోటీలను నిర్వహిస్తున్నం అన్న వార్త మీ అందరితోటి పంచుకోనీకి చాన సంతోషిస్తున్నం.
ఈ పోటీలు జనవరి 12, 2009న మొదలయ్యి, ఫిబ్రవరి 28, 2009కి పూర్తి అయితయి. పోటీలకు తెలంగాణ సంస్కృతి, ప్రజలు, చరిత్ర, పోరాటాలు, వనరులు, ప్రదేశాల […]
Read Full Post »
Posted in ప్రాణహిత, తెలంగాణ ప్రజలు, తెలుగు on జనవరి 2nd, 2009
- డా|| దార్ల వెంకటేశ్వరరావు
తెలంగాణా ప్రాంతం వెనుకబడిందా? తెలంగాణా ప్రజలు వెనుకబడి ఉన్నారా? తెలంగాణా ప్రజల్నివెనక్కి నెట్టి వేశారా? అనే ప్రశ్నలు వేసుకుంటే అనేక రాజకీయ కారణాల వల్ల తెలంగాణా ప్రాంతం వెనకబడి పోయిందని ఆ చారిత్రక ఆధారాలు ఎన్నో వివరిస్తున్నాయి. నిజాం పాలన దానికొక కారణంగా చాలా మంది చెప్తున్నారు. తెలంగాణాలోని అత్యధికులు, కింది వర్గాలకు చెందిన ప్రజలు ఆర్ధికంగా వెనుకబడ్డారు.
Read Full Post »
Posted in సూర్య, తెలుగు, కళాకారులు, తెలంగాణ వైతాళికులు on డిసంబర్ 29th, 2008
- పున్న అంజయ్య
పల్లెటూరి పిల్లగాడా…
పసులు గాసే మొనగాడా !
పాలు మరచి ఎన్నాళ్ళయ్యిందో
ఓ…పాల బుగ్గల జీతగాడా
కొలువు కుదిరి ఎన్నాళ్ళయ్యిందో
సుద్దాల హనుమంతు కలం నుండి జాలువారిన ఈ పాట వినని వారుండరు. నల్లగొండ జిల్లా మోత్కూరు మండలంలోని పాలడుగు గ్రామంలో 1908 డిసెంబర్‌లో జన్మించిన హనుమంతు ఇంటి అసలు పేరు గుర్రం. కానీ, తర్వాత ఆయన నివసించిన ఊరు పేరే ఇంటి పేరుగా మారింది. సుద్దాల హనుమంతు పేరు ఒక్క తెలంగాణకే పరిమితం కాలేదు, యావదాంధ్ర దేశం మారుమోగిందంటే […]
Read Full Post »