- ఆచార్య రవ్వా శ్రీహరి
ఆంధ్రులందరూ ఒకేజాతికి చెందినవారైనా ఆంధ్రదేశంలోని ప్రాంతాల భేదాన్నిబట్టి నిజామాంధ్రులు, కోస్తా ఆంధ్రులు, రాయలసీమ ఆంధ్రులు, కళింగాంధ్రులు అనే నాలుగు ప్రధాన భేదాలు కనిపిస్తాయి. నిజామాంధ్రులు నివసించే భూభాగాన్నే మనం ‘తెలంగాణ’ అని వ్యవహరిస్తున్నాం. ఏమి దురదృష్టమో కాని కొన్ని ప్రాంతాల పండితుల్లో, పెద్దల్లో తెలంగాణంలో తెలుగు లేదనీ, ఉన్నా అది సరైన తెలుగు కాదనీ నిష్కారణమైన అసత్యమైన అపోహ నేటికీ ఉంది. ఈ అపోహ కలిగిన వారు తెలంగాణంలోని మారుమూల పల్లెలకు వెళ్లితే […]
Read Full Post »
- మఖ్దూమ్ మొహియుద్దీన్
హైదరాబాద్ నగరానికి ఎన్నో ద్వారాలు వున్నాయి. నగరంలో ఎవరైనా అడుగు పెట్టాలంటే, ఆ ద్వారాలగుండానే లోపలికి అడుగుపెట్టాలి. చంపాద్వారం నుంచి యాకుబ్‌పురా ద్వారం దాటి ధర్మంవంత్ హైస్కూలు దాకా నేను రోజూ నడుచుకుంటూ వెళ్ళే వాణ్ణి. ఆరోజుల్లో రిక్షాలుగానీ, సైకిళ్ళు గానీ, బస్సులు గానీ చాలా తక్కువగా కనిపిస్తూవుండేవి. రోడ్ల మీద ఏనుగులూ, ఒంటెలూ, ఎద్దుల రథాలు వుండేవి. షకరాలూ, జట్కాలూ టాంగాలూ, గుర్రపుబగ్గీలూ దర్శనమిస్తూ వుండేవి. ఆ రోజుల్లో వీధి వీధినా వ్యాయామశాలలూ, […]
Read Full Post »
- ఎస్. జగన్‌రెడ్డి
అలనాడు సాహిత్యకారులను గౌరవించడం హైదరాబాద్ రాజ్యంలో ఒక సామాజిక విలువగా చెలామణి అయ్యేది. రాజులు, కులీనవర్గాలే కాదు సామాన్యులు కూడా కళాప్రియులు, కవిత్వ పిపాసులే. రాజులు సంగీత, సాహిత్యకారులు కావడం చరిత్రలో ఉన్నదే. ఆసఫ్ జాహీల వంశంలో ఐదుగురు రాజకవులు ఉర్దూ సాహిత్యంలో పేరెన్నికగనడం విశేషం…
Read Full Post »
- శ్రీధర్ ధేశ్‌పాండే
1969 తెలంగాణ ప్రజా ఉద్యమానికి ఇప్పుడు 40 ఏళ్ళు, అయినా ప్రజల కోరిక ‘తెలంగాణ’ ఇంకా ఒక చేదు కల లెక్కనే మిగిలి ఉన్నది. 1969 తెలంగాణ ప్రజా ఉద్యమాన్ని గుర్తు చేసుకుంట ‘తెలంగాణ హిస్టరీ సొసయిటీ’, “1969 తెలంగాణ ఉద్యమ కరపత్రాలు” అనే శీర్షికతోటి ఒక పుస్తకం తీసుక రానీకి ప్రయత్నం చేస్తుంది.
Read Full Post »
- కోయి కోటేశ్వరరావు
కళాశాలలు, విశ్వ విద్యాలయాల్లో బోధించే తెలుగు సాహిత్యానికి సంబంధించిన కొన్ని పాఠ్యాంశాలు విద్యార్థుల బౌద్ధిక చైతన్యాన్ని నిర్వీర్యం చేసే విధంగా ఉన్నాయి. విజ్ఞానశాస్త్రం, అర్థ శాస్త్రం, సామాజిక శాస్త్రం తదితర విభాగాల్లోని పాఠ్య ప్రణాళికల్లో కాలానుగుణంగా నిర్మాణాత్మక మార్పులు చోటుచేసుకున్నప్పటికీ తెలుగు సాహిత్య పాఠ్యాంశాలు శుద్ధ సంప్రదాయ పద్ధతిలోనే ఇంకా కొనసాగటం చిత్రం.
Read Full Post »
- వరవరరావు
తెలంగాణలో ప్రజలు ఎన్నికల పట్ల ఎటువంటి వైఖరి తీసుకుంటున్నారు? ఎన్నికల సందర్భంగా మొత్తంగా వారిని వేధిస్తున్న సమస్యలు ఏమిటి? వ్యక్తమవుతున్న ఆకాంక్ష ఏమిటి? నక్సల్బరీ, శ్రీకాకుళ పోరాటాలు ప్రారంభమయ్యాక చారుమజుందార్ నాయకత్వాన్ని అనుసరించిన పార్టీ ఇస్తున్న ఎన్నికల బహిష్కరణ పిలుపును తెలంగాణ ప్రజలు ఏ విధంగా తమ ఆచరణలోకి అనువదించుకుంటున్నారు? వంటి ప్రశ్నలు ఆసక్తిదాయకమైనవే. స్థూలంగా ఇది తెలుగునేల కంతా వర్తించేవే.
Read Full Post »
- C.H.Hanumantha Rao
PROFESSOR B JANARDHAN RAO MEMORIAL FOUNDATION
(Seventh Annual Memorial Lecture, 2009)
While we assemble here this morning to pay our tributes to the memory of Prof.B. Janardhan Rao, we greatly miss him on several counts. He had done outstanding research work on tribal development and held out a great promise for further explorations in this […]
Read Full Post »
కరీంనగర్, నిజమాబాద్, మహబ్‌నగర్ నుంచి దాదాపు 500 పైన విద్యార్థులు పాలుగొని ‘కలర్ తెలంగాణ 2008′ని విజయవంతం చెసిన నేపథ్యంల, ‘డిస్కవర్ తెలంగాణ’, ‘కరీంనగర్ ఫిలిం సొసైటీ’ సారథ్యంల ఇప్పుడు ‘ఫిలిం తెలంగాణ 2009‘ డిజిటల్ శార్ట్ ఫిలిం పోటీలను నిర్వహిస్తున్నం అన్న వార్త మీ అందరితోటి పంచుకోనీకి చాన సంతోషిస్తున్నం.
ఈ పోటీలు జనవరి 12, 2009న మొదలయ్యి, ఫిబ్రవరి 28, 2009కి పూర్తి అయితయి. పోటీలకు తెలంగాణ సంస్కృతి, ప్రజలు, చరిత్ర, పోరాటాలు, వనరులు, ప్రదేశాల […]
Read Full Post »
ఎన్కట వ్యావహారిక భాష పేరుతో కోస్తాంధ్ర భాషను రుద్ది మా భాషను మంటగల్పిండ్రు. ఇప్పుడు ‘తెలుగు’ వైభవ ప్రాభవాల పేరుతో మా ప్రాంత అస్తిత్వాన్నే నాశనం చేయచూస్తుండ్రు. నవంబరు 15 నుంచి డిసెంబరు 15 వరకు హైదరాబాద్‌లోని త్యాగరాయ గానసభలో జరిగే భాషా ‘ఉత్సవా’ల్లో, తొలి అచ్చ తెలుగు కావ్యాన్ని అందించిన తెలంగాణను అణచివేయచూస్తుండ్రు. తెలంగాణ అన్నప్పుడల్లా దాన్ని మరుగున పరచడానికి తెలుగు పేరుతో పన్నాగం పన్నిండ్రు. ఆఖరికి తెలుగు భాషకు ప్రాచీనతను సాధించడానికి తెలంగాణలోని తెలుగు […]
Read Full Post »
హైదరాబాద్, సెప్టెంబర్ 17, 2008 : భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చే నాటికి స్వయం ప్రతిపత్తి కలిగి ఉన్న రాజ్యం హైదరాబాద్ సంస్థానం. నిజాం రాజుల పాలన కింద ఉన్న ఆ రాజ్యాన్ని నాటి భారత పాలకులు సైనిక చర్య ద్వారా 1948లో ఇండియన్ యూనియన్‌లో విలీనం చేసుకున్నారు. సెప్టెంబర్ 17న ఈ సంఘటన జరిగింది. ఐదు రోజులు… వంద గంటల్లో సైనిక చర్య ముగిసింది.
Read Full Post »
Three men, all clad in dhotis, entered the Bapu Kuti. The oldest of the three stood sharply erect. His movements were slow and graceful. Adjusting the angvastra on his shoulder the man wandered about, quietly taking in the furniture-free spaces of the Kuti. One of the younger men bounded about excitedly exclaiming and admiring tiny […]
Read Full Post »
Posted in English, తెలంగాణ చరిత్ర, పుస్తకాలు on జులై 13th, 2008
Preview this book
By Puccalapalli
Sundarayya
Published 2006
Foundation Books
472 pages
ISBN:8175963166
Add to my library
Write review
Courtesy : Google Books
Also read Dileeps తెలంగాణా సాయుధ పోరాటం - ప్రశ్న-జవాబు
Read Full Post »
Posted in సంపాదకీయం, తెలుగు, తెలంగాణ చరిత్ర on జులై 12th, 2008
- అల్లం నారాయణ
జమ్మిచెట్టు మీద ఆయుధాలు దించుకో… నువ్వు ఎన్నో వాడివి. దసరనాడు పాలపిట్టకోసం చూసినట్టు తెలంగాణ కోసం ఎన్నినాళ్లు చూడమంటవ్. నిజమే. దేవేందర్ గౌడ్ సాబ్. ఆత్మాభిమానం దెబ్బతిన్నది. ఒకటా రెండా యాభై ఏళ్లయింది. కలిపినప్పుడే విచ్చుకుపోయింది తెలంగాణ ఆత్మ. పచ్చికుండ ఫటిల్లున పగిలిపోయినట్టు. కానీ.. తెలంగాణ మాత్రం రాలేదు.
Read Full Post »
- కట్టా శేఖర్ రెడ్డి
ఇప్పుడు తెలంగాణను తెచ్చుకున్నా అది దొరలపాలవుతుంది. బడుగులకు రాజ్యాధికారం దక్కదు. వై.ఎస్. నేతృత్వంలో పూర్తిస్థాయి అభివృద్ధి జరిగాక ప్రత్యే క రాష్ట్ర అంశం తెరపైకి రావాలి. ప్రస్తుత తరుణంలో ప్రత్యేక రాష్ట్రం కంటే అభి వృద్ధే ముఖ్యం.
-తెలంగాణ డిసిసి అధ్యక్షులు, ఎమ్మెల్సీలు
‘ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటయితే కోస్తాంధ్రుల పెత్తనం ఎక్కువయి పోతుంది. వారితో నెగ్గలేం. మాకు ప్రత్యేక రాష్ట్రం వద్దు. మద్రాసు రాష్ట్రం లోనే కొనసాగుతాం’- ఇది అప్పట్లో ఆంధ్ర రాష్ట్ర ఉద్య మానికి […]
Read Full Post »
1857 తిరుగుబాటులో హైద్రాబాద్ పాత్రను లోకానికి చాటాలన్న కోరికతో, ఆ అమరవీరులను స్మరించుకోవాలన్న ఆశతో, ఈ తరం వారికి ఆ అమరులను పరిచయం చేయాలన్న సంకల్పంతో ఈ కథల పుస్తకాన్ని మీ ముందుకు తెస్తున్నాను.
1857కు ఈ ఏడు 150 ఏండ్లు నిండాయి. అయినా ఆ పోరాటం ఇంకా కొనసాగుతున్నట్లే అనిపిస్తుంది. నేల తల్లి విముక్తి పోరాటం నుండి అనేకానేక అంతర్గత, బాహ్య నయావలసవాద వ్యతిరేక పోరాటాల వరకు, పోరాట రూపం మారిందేమో గాని ‘సారం’, ”అంతస్సూత్రం” మాత్రం […]
Read Full Post »
Posted in వివిధ, తెలుగు, తెలంగాణ చరిత్ర on నవంబర్ 26th, 2007
-వేణు సంకోజు, కూరెళ్ళ విఠలాచార్య
నల్లగొండ జిల్లా విశ్వవిద్యాలయానికి - సమస్త తెలంగాణకు, తెలుగుజాతికే గర్వకారణమైన ‘మహాకవి పోతన’ పేరును సూచించడం జరిగింది. అందుకు గల బలవత్తరమైన, సహేతుకమైన కారణమేమంటే, సంస్కర్త హృదయం గల పోతన ‘తొలి విప్లవకవి’ కూడా కావడం.
మహాకవి పోతన పేరు పెట్టుకోవడం ద్వారా మహోన్నత చారిత్రక వారసత్వాన్ని, సాంస్కృతిక వికాసాన్ని గౌరవించుకున్నట్లవుతుంది. ఒక మహత్తర కాలానికి నమస్కరించుకొని, కొద్దిగా రుణంతీర్చుకుంటూ, కృతజ్ఞతను ప్రకటించుకున్నట్లవుతుంది.
Read Full Post »
- సంగిశెట్టి శ్రీనివాస్
శుక్రవారం,హైదరాబాద్ మక్కామసీదు, జులై17, 1857
మసీదులోపలా, బయటా కిక్కిరిసిన జనం.
పర్వదినాల్లో తప్ప మామూలు ప్రార్థన సమయంలో అన్ని వేల మంది ముస్లిములు అక్కడికి రారు. కలవరం, ఆవేశం, ఆగ్రహం వారిని నిలవనీయడంలేదు. ఒకపక్క పెద్ద పెద్దగా నినాదాలు వినిపిస్తున్నాయి. మరొకపక్క తీవ్రంగా తర్జనభర్జన పడుతూ చేస్తున్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఆ రోజేదో జరగబోతోంది!
Read Full Post »
Posted in తెలుగు గడ్డ, English, తెలంగాణ చరిత్ర on జులై 15th, 2007
Dear friends and well-wishers’ of Telangana,
DT [Discover Telangana] is proud to present the inaugural issue of “Telugu Gadda” a Telangana weekly started on Deepavali of 1969 (9 November 1969). By Late Mamidi Ramakantha Rao, He was editor and publisher for this weekly.
Read Full Post »
09 నవంబర్ 1969ల దీపావళి సందర్భంగ, మామిడి రమాకాంత్ రావు గారు మొదలుపెట్టిన ‘తెలుగు గడ్డ’ తెలంగాణ వార పత్రిక, మొదటి సంచిక.
Read Full Post »