- ఆచార్య రవ్వా శ్రీహరి ఆంధ్రులందరూ ఒకేజాతికి చెందినవారైనా ఆంధ్రదేశంలోని ప్రాంతాల భేదాన్నిబట్టి నిజామాంధ్రులు, కోస్తా ఆంధ్రులు, రాయలసీమ ఆంధ్రులు, కళింగాంధ్రులు అనే నాలుగు ప్రధాన భేదాలు కనిపిస్తాయి. నిజామాంధ్రులు నివసించే భూభాగాన్నే మనం ‘తెలంగాణ’ అని వ్యవహరిస్తున్నాం. ఏమి దురదృష్టమో కాని కొన్ని ప్రాంతాల పండితుల్లో, పెద్దల్లో తెలంగాణంలో తెలుగు లేదనీ, ఉన్నా అది సరైన తెలుగు కాదనీ నిష్కారణమైన అసత్యమైన అపోహ నేటికీ ఉంది. ఈ అపోహ కలిగిన వారు తెలంగాణంలోని మారుమూల పల్లెలకు [...]
Read Full Post »
సురవరం ప్రతాపరెడ్డి సామాజిక జీవితం: ప్రతి మనిషికీ సామాజిక జీవితం ఉంటుంది. సామాజిక జీవితం ఎంతమాత్రమూ లేని, ఒంటరి ద్వీపంలాగ బతికే మనిషిని ఊహించడమే అసాధ్యం. మనిషి సంఘజీవి అనేది శుష్కమైన పదబంధం కాదు. సంఘం లేకుండా, తోటి మనుషులు లేకుండా, మానవ సంబంధాలు లేకుండా మనిషి జీవించడమే అసాధ్యం.
Read Full Post »
కవులు, రచయితలుగానే పరిచయమున్న ఎందరో ప్రముఖులు చట్టసభల్లోనూ అడుగుపెట్టారు. మంత్రులూ ముఖ్యమంత్రులూ ప్రధానమంత్రీ అయ్యారు. వారిలో చాలామంది సాహిత్యకారుల్లాగే పేదరికాన్ని అనుభవించినవారే. రేఖామాత్రంగా ఆ వివరాలు తెలిపే రెండు వ్యాసాలివి.. తెలంగాణ.. – సంగిశెట్టి శ్రీనివాస్ తెలుగు సాహిత్య చరిత్రలో ‘గోలకొండ కవుల సంచిక’కు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ‘తెలంగాణ’లో కవులు లేరనే విమర్శకు సమాధానంగా రోషంతో సురవరం ప్రతాపరెడ్డి ఈ సంచికను వెలువరించారు. ఇందులో బూర్గుల రామకృష్ణారావు, సురవరం ప్రతాపరెడ్డి, అరిగె రామస్వామి ముగ్గురూ [...]
Read Full Post »
- పున్న అంజయ్య పల్లెటూరి పిల్లగాడా… పసులు గాసే మొనగాడా ! పాలు మరచి ఎన్నాళ్ళయ్యిందో ఓ…పాల బుగ్గల జీతగాడా కొలువు కుదిరి ఎన్నాళ్ళయ్యిందో సుద్దాల హనుమంతు కలం నుండి జాలువారిన ఈ పాట వినని వారుండరు. నల్లగొండ జిల్లా మోత్కూరు మండలంలోని పాలడుగు గ్రామంలో 1908 డిసెంబర్‌లో జన్మించిన హనుమంతు ఇంటి అసలు పేరు గుర్రం. కానీ, తర్వాత ఆయన నివసించిన ఊరు పేరే ఇంటి పేరుగా మారింది. సుద్దాల హనుమంతు పేరు ఒక్క తెలంగాణకే [...]
Read Full Post »
- బి.ఎస్.రాములు యశోదమ్మ తెలంగాణ ప్రాంతపు తెలుగు ఆడపడుచు. ఆమె మాటలు తెలంగాణ భాషలోని సొగ సైన ముత్యాలు. పాకాల యశోదారెడ్డితో మాట్లాడితే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు ఆచార్య పీఠం అధిష్ఠించిన, తెలుగు అధికార భాషా సంఘం అధ్య క్షురాలుగా ఉన్న ఒక విద్యావతితో మాట్లాడినట్టుగా ఉండదు.
Read Full Post »
- తెలంగాణ ఐ.టి.ఫోరం హైదరాబాదు రోడ్లమీద ట్రాఫిక్ నరకం నుండి బయటపడవేసే మెట్రో రైలు వస్తుందంటే శుభవార్తనే. ఇందులో ఒక లైను- సికింద్రాబాదు నుండి ఫలక్‌నుమాదాకా, రెండో లైను- నాగోల్ నుంచి అమీర్‌పేట మీది నుండి హైటెక్‌సిటీ దాకా, మూడోది- కూకట్‌పల్లి నుంచి నాంపల్లిదాకా వేస్తరట. దీని కోసం జంట నగరాలలో మొత్తం 5000 దుకాణాలు, 2000 ఇండ్లు, 147 స్కూళ్లు, కాలేజీలు, 120 దవాఖానలు, 54 గుళ్లు, మసీదులు, చర్చిలు కూలిపోతయి. హైదరాబాదుకు గుర్తుగా నిలిచిన [...]
Read Full Post »
-సుద్దాల అశోక్ తేజ స్టేజీ మీద సుద్దాల హనుమంతు గొల్లసుద్దులు ‘వీర తెలంగాణ’ చెబుతున్నాడు. అక్షరాలు రాని అరకలు పట్టే రైతుకూలీలు ఆయుధాలు పట్టి ఆడాళ్లు వడిసెలలు పట్టి ఎలా దొరలను రజాకార్లను నైజాం పోలీసులను, రౌడీలను తరుముతున్నారో హనుమంతు దళం వీరావేశంతో చెబుతుంది. 1947 నుండి 1951 దాకా సాగిన ‘మహాగాధ’ను కళ్ళకు కట్టినట్టు చెబుతుంటే ఆ జనంలోనే ఎదురుగా జానకమ్మ తన మూడు నెలల బాబును ఎత్తుకొని చూపిస్తున్నది.
Read Full Post »
Posted in తెలంగాణ వైతాళికులు, తెలుగు, వివిధ on Jun 12th, 2007
- అఫ్సర్ 1944 తెలంగాణ గ్రామాల్లో ఆంధ్రమహాసభ జెండాలు ఉత్తేజంగా ఎగురుతున్నాయి. ప్రతి గ్రామం ఒక నిప్పుల కుంపటిగా మారుతోంది. నెత్తురు మండి, కాసింత ధిక్కారపు గొంతు ఎత్తిన ప్రతి యువకుడి మీదా రాజ్యం ఉక్కుపాదం మోపుతోంది. ఇప్పటి ఖమ్మంజిల్లాలోని పిండిప్రోలు అలాంటి ఒక గ్రామం. నిర్బంధాన్ని భరించలేక నిండా రెండు పదులు నిండని ఒక బ్రాహ్మణయువకుడు అరచేతుల్లో ప్రాణాల్ని దాచుకొని భాగ్యనగరం చేరుకున్నా డు భార్యతో. నగరం బతుకు అతనికీ, ఆమెకీ కొత్త. పూటకి ఠికానా [...]
Read Full Post »
Posted in తెలంగాణ వైతాళికులు on Nov 19th, 2006
తెలంగాణలో సాంస్కృతిక పునర్వికాసానికి నిరంతర కృషి సల్పిన మహనీయుడు మాడపాటి హన్మంతరావు. భావదాస్యంతో భషాదాస్యంతో మగ్గిపోతున్న తెలంగాణ ప్రజలల్ల చైతన్యాన్ని నూరిపోసి ఉద్యమాలు నిర్మించిండు మాడపాటి. కృష్ణా జిల్లాలో జన్మించినప్పటికీ పెరిగి పెనవేసుకున్న జీవితం అంతా తెలంగాణలనే. ఆయన తపనా కృషీ అంతా స్థానిక ఉద్యమాలతో కొనసాగింది.
Read Full Post »
Posted in తెలంగాణ వైతాళికులు on Nov 19th, 2006
తెలంగాణ రైతుల జీవితాన్ని సాహిత్యంగా మలిచిన మహనీయుడు గంగుల శాయిరెడ్డి. పోతన వారసత్వాన్ని ఆవాహన చేసుకొని వ్యవసాయ జీవితంలోని కడగండ్లను పరిష్కరించటానికి ఒక చేత హలం మరొక చేత కలం పట్టిన కవి శాయిరెడ్డి. తెలంగాణ సాహిత్య చరిత్ర మొదటి వరుసలో పేర్కొనదగిన శాయిరెడ్డికి ఆంధ్ర సాహిత్య చరిత్రకారులు సముచిత స్థానమివ్వలేదు.
Read Full Post »
Posted in తెలంగాణ వైతాళికులు on Nov 19th, 2006
తెలంగాణ రాజకీయ, సాంఘీక చైతన్యం అంటే వెంటనే గుర్తుకు వచ్చే పేరు సురవరం ప్రతాపరెడ్డి. పత్రికా సంపాదకుడుగా, పరిశోధకుడుగా, పండితుడుగా, రచయితగా, ప్రేరకుడుగా, క్రియాశీల ఉద్యమకారుడుగా బహుముఖాలుగా సాగిన ప్రతాపరెడ్డి ప్రతిభా, కృషీ అనన్యమైనది. స్థానిక చరిత్రల గురించి, స్థానిక ప్రజల కడగండ్ల గురించి ఆయన పడిన నిరంతర తపనకు ప్రతి అక్షరం ప్రత్యక్ష సాక్ష్యం. తెలంగాణ సాంస్కృతిక చరిత్రలో సురవరం ప్రతాపరెడ్డి ఒక అధ్యాయం.
Read Full Post »
Posted in తెలంగాణ వైతాళికులు on Nov 19th, 2006
తెలంగాణ ప్రజల కన్నీళ్లను ‘అగ్నిధార’ గా మలిచి నిజాం పాలన మీదికి ఎక్కుపెట్టిన మహాకవి దాశరథి. పద్యాన్ని పదునైన ఆయుధంగా చేసుకొని తెలంగాణ విముక్తి కోసం ఉద్యమించిన దాశరథి ప్రాతఃస్మరణీయుడు. ‘నా తెలంగాణ కోటీ రతనాల వీణ’ అని గర్వంగా ప్రకటించి ఇప్పటి ఉద్యమానికీ ప్రేరణనందిస్తున్న కవి దాశరథి.
Read Full Post »
Posted in తెలంగాణ వైతాళికులు on Nov 19th, 2006
తెలంగాణ రైతాంగ ఉద్యమంల నిర్మాణాత్మక పాత్ర మగ్దుం మొహియుద్దీన్. కమ్యూనిస్టు పార్టీ నిర్మాణంల, ట్రేడ్ యూనియన్ సంస్థల నిర్మాణంల మగ్దుం కృషి మరువరానిది. కవిత్వాన్ని అంతర్జాతీయ స్థాయిల నిలిపిన మగ్దుం తెలంగాణకు గర్వకారణం. ప్రజలల్ల ఆయనకున్న అభిమానం, స్థానిక చరిత్ర నిర్మాణంల అయన చొరవ అనన్య సాధ్యం.
Read Full Post »
Posted in తెలంగాణ వైతాళికులు on Nov 19th, 2006
తెలంగాణ ప్రజాసాహిత్యానికి పాదులు వేసి ప్రాణం పోసినవాడు వట్టికోట ఆళ్వారుస్వామి. రచయిత. సేవాశీలి. ఉద్యమకర్త. కమ్యూనిస్టు నేత. ప్రచురణకర్త. పాత్రికేయుడు. ప్రచారకుడు ఆయన. భాషాసాహిత్యాల దగ్గర్నుంచి పౌరహక్కుల దాకా వట్టికోట అన్ని ఉద్యమాలల్ల పాలుపంచుకున్నడు.
Read Full Post »
Posted in తెలంగాణ వైతాళికులు on Nov 19th, 2006
కలమే ఆయుధంగా ప్రజలల్ల చైతన్యం విస్తరింపజేసిన వ్యక్తి వెల్దుర్తి మాణిక్యరావు. ఒక పక్క రచయితగా మరొక పక్క పాత్రికేయుడుగా ఆయన కృషి చిరస్మరణీయం. ఆంధ్రమహాసభ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తూనే పలు పత్రికలల్ల రచనా బాధ్యతలు నిర్వహిస్తూ స్వాతంత్ర్యోద్యమ పిపాసను రేకెత్తించిండు. తెలంగాణ ప్రజల చైతన్యం కోసం ఆయన బహుముఖాలుగా కృషి చేసిండు.
Read Full Post »
Posted in తెలంగాణ వైతాళికులు on Nov 19th, 2006
ప్రాంతీయ విద్యావికాసంల విశేషమైన కృషి సల్పిన సేవాపరాయణుడు కె.సి.గుప్త. గ్రంధ ప్రచురణా కర్తవ్యాన్ని స్వీకరించిన ఘనుడు గుప్త. తెలుగు చదువునుంచి దూరం చేయబడిన తెలంగాణ ప్రజలకు చదువులను, సాహిత్యాన్ని పంచిన గుప్తది భిన్నమైన వ్యక్తిత్వం. ఇక్కడి రాజకీయ పరిస్థితుల పరిణామంల తనదైన ముద్రతో భాగస్వామ్యం వహించిండు గుప్త.
Read Full Post »
Posted in తెలంగాణ వైతాళికులు on Nov 19th, 2006
తెలుగులో తొలి టాకీ చిత్రం ‘భక్త ప్రహ్లాద’కు పాటలు రాసిన తొలి సినీగేయ రచయిత చందాల కేశవదాసు. తెలంగాణలోని ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జక్కేపల్లిల 1876 జూన్ 20వ తేదీన జన్మించిండు. చందాల లక్ష్మి నారాయణ, పాపమ్మలు తల్లిదండ్రులు. కేశవదాసు నటుడు, గాయకుడు, హరికథా కళాకారుడు, నాటకకర్త. భక్త ప్రహ్లాద, కనకతార చిత్రాలకు కేశవదాసు మాటలు, పాటలు రచించి, సినీరంగంల ఖ్యాతిపతాక నెగురవేసిండు.
Read Full Post »
Posted in తెలంగాణ వైతాళికులు on Nov 19th, 2006
తెలంగాణ ప్రజల ప్రతీ ఉద్యమం ప్రతిధ్వని కాళోజి. రాజకీయ సాంఘీక చైతన్యాల సమాహారం కాళోజి. కవిత్వం రాసి ప్రజాకవి. హక్కులడిగి ప్రజల మనిషి. ఉద్యమం నడిపి ప్రజావాది. మొత్తంగా తెలంగాణ జీవిత చలన శీలి కాళోజి. పుటక చావులు కాకుండా బతుకంతా తెలంగాణకిచ్చిన మహనీయుడు, వైతాళికుడు కాళోజి.
Read Full Post »
Posted in తెలంగాణ వైతాళికులు on Nov 19th, 2006
పాకాల తిరుమల్ రెడ్డి చిత్రకళారంగంల పి.టి.రెడ్డిగా చిరపరిచితుడు. చిత్రకళారంగంల అంతర్జాతీయ ఖ్యాతినార్జించిన ప్రముఖులల్ల పి.టి.రెడ్డి ముఖ్యుడు. ఆరు దశాబ్దాలుగా చిత్రకళారంగంల అలుపెరుగని కృషి చేసిన మహనీయుడు ఆయన. మరణించే వరకు కుంచెలను రంగరించిన తెలంగాణ చిత్రకారుడాయన.
Read Full Post »