Feed on
Posts
Comments

Category Archive for 'తెలుగు'

- అల్లం నారాయణ
జమ్మిచెట్టు మీద ఆయుధాలు దించుకో… నువ్వు ఎన్నో వాడివి. దసరనాడు పాలపిట్టకోసం చూసినట్టు తెలంగాణ కోసం ఎన్నినాళ్లు చూడమంటవ్‌. నిజమే. దేవేందర్‌ గౌడ్‌ సాబ్‌. ఆత్మాభిమానం దెబ్బతిన్నది. ఒకటా రెండా యాభై ఏళ్లయింది. కలిపినప్పుడే విచ్చుకుపోయింది తెలంగాణ ఆత్మ. పచ్చికుండ ఫటిల్లున పగిలిపోయినట్టు. కానీ.. తెలంగాణ మాత్రం రాలేదు.

Read Full Post »

తెలంగాణలో శ్రమజీవులను ‘పనిపాటలోల్లు’ అని వ్యవహరిస్తుంటారు. శ్రామికుల పనితోపాటు పాట సాగుతుంటుంది. పొలం పనుల్లో, ఇంటి పనుల్లో, వృత్తి పనుల్లో పాటలు వినిపిస్తూనే ఉంటాయి. పనిలోని అలసటను తగ్గించి, శ్రమను మరిపించి, ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని పంచి ఉత్పత్తిని పెంచే శక్తి పాటకుంది. పనిలోని లయననుసరించి, శ్రామికుని ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు అనుగుణంగా పాటకు లయ ఛందస్సు లేర్పడుతుంటాయి. శ్రామికుని జీవిత విధానం, మనోభావాల ఆధారంగా పాటలోని వస్తువు రూపుదిద్దుకుంటుంది. ఇటువంటి పనిపాటలు ప్రపంచంలోని అన్ని భాషల్లోనూ ప్రాంతాల్లోనూ వినిపిస్తుంటాయి.

Read Full Post »

- యం. కోదండరాం, కె. సీతారామారావు
I
భారతదేశంలో ఎన్నికలు, ఈమధ్యకాలంలో, కేవలం ప్రతినిధులను ఎన్నుకోవడానికే కాక విధాన నిర్ణయ ప్రక్రియలో ప్రజలు భాగస్వామ్యం పొందడానికి, విధాన నిర్ణయ ప్రక్రియను ప్రభావితం చేయడానికి కావలసిన శక్తిని, ప్రభావాన్ని పొందడానికి కూడా ఉపయోగపడుతున్నాయి. అందుకే ఇటీవల కాలంలో కొన్ని పార్టీలు సామాజిక మార్పుకు ఎన్నికలను సాధనంగా వాడుతున్నాయి.
మనరాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సాధనకు తెలంగాణ రాష్ట్ర సమితి ప్రధానంగా ఎన్నికలపైనే ఆధారపడింది. ఎన్నికల ద్వార సమైక్యవాదులను ఒంటరి చేసి, రాజకీయంగా దెబ్బకొట్టి తన […]

Read Full Post »

తెలంగాణ  యెన్జీవోస్‌ యూనియన్‌,   తెలంగాణ భవన్‌, నాంపెల్లి, హైదరాబాద్‌
అధిక ధరలకు నిరసనగా  కాగడాలతో ప్రదర్శన  తేది.9.6.2008
“కాగితంపై కలం కదిలించుటే కాదు … గళం విప్పి నిరసన జ్వాలలను గక్కిన … తెలంగాణ యెన్జీవోస్‌ యూనియన్‌ సభ్యులు“
ప్రభుత్వం అందిస్తున్నానంటున్న అభివృద్ది ఫలము, అందరికి అందని పండై, కొందరి నోటికి చెందేదైతే,  అది మన ప్రజాస్వామ్య వ్యవస్థకు మరియు సమసమాజ సిద్దాంతానికే విరుద్దమై వికటిస్తుంది. ఈనాడు మన అభివృద్దిరేటు పెరుగుదల మాట అటుంచితే, ద్రవ్యోల్బణం రేటు మాత్రం విపరీతంగా పెరిగింది. […]

Read Full Post »

మెట్‌పల్లి/ఇబ్రహీంపట్నం, కరీంనగర్, మే 18 (ఆన్‌లైన్‌): ఆ బాలిక పేరు మామిడి శివాని… వయస్సు నాలుగు సంవత్సరాలు… చదు వుయుకేజి… ఆమె వయస్సు పిల్లలకు మైక్‌ అన్నా తెలియదు… ఉపన్యాసమన్నా తెలియదు… ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే వారితో మాట్లాడడానికి జంకుతా రు… ఈ బాలిక మాత్రం వేల మంది ముందు మైక్‌ పట్టుకొని నిలబడి ధైర్యంగా మాట్లాడిం ది… పాడింది… చాక్లెట్లు, ఐస్‌క్రీం అడగాల్సిన వయసులో ఏకంగా ప్రత్యేక రాష్ట్రాన్ని అడిగింది… అద్భుత జ్ఞాపకశక్తి… అబ్బురపరిచే […]

Read Full Post »

- యం. కోదండరాం, కె. సీతారామారావు
I
 తెలంగాణ రాష్ట్ర సమితి తరపున శాసనసభకు, శాసన మండలికి, పార్లమెంటుకు ఎన్నికైన ప్రజా ప్రతినిధుల రాజీనామాతో తలెత్తిన పరిస్థితిని అంచనా వేసుకోకుండా తెలంగాణ రాష్ట్ర సాధనఉద్యమం అనుసరించవలసిన వ్యూహాన్ని ఖరారు చేసుకోలేము. రాజీనామాకు దారితీసిన కారణాలను తెలుసుకోవాలంటే ఆంధ్రప్రదేశ్‌ అనబడు సామాజికార్థిక, రాజకీయ వ్యవస్థ స్వరూప, స్వభావాలను అర్థం చేసుకోవాలె. తెలంగాణ పోరాటం, భాషా ప్రయుక్తత పేరుతో ఏర్పడిన ”ఆంధ్రప్రదేశ్‌” ఉమ్మడి వనరులను వాడుకొని ఎదిగి, సామాజికార్థిక వ్యవస్తలన్నింటిని శాసిస్తున్న ఆంధ్ర […]

Read Full Post »

తెలంగాణ కోసం ప్రజలు ఏ త్యాగాలకైనా సిద్ధమేనని, అంతర్జాతీయ సామ్రాజ్యవాదాన్ని, అంతర్గత వలసవాదాన్ని ఓడించేందుకు అవకాశవాద నాయకుల్ని కాదని ఉద్యమించాల్సిందేనని అంటున్నారు నాగోబా
భారతదేశం స్వాతంత్య్రం అందినాక దేశంలో జాతుల పోరాటాలు, ఉపజాతుల ఆకాంక్షలు పెల్లుబికాయి. బ్రిటిష్‌ ఇండియాలో ఏర్పడిన రాష్ట్రాలు, ప్రావిన్సులు, సంస్థానాలు ప్రజల ఆకాంక్షలను గౌరవించి, జాతుల, ఉపజాతుల ఆకాంక్షలకు అనుగుణంగా ఏర్పడినవి కావు. బ్రిటిష్‌ రాజ్యాధికారానికి, వారి వలస దోపిడీకి అనుకూలమైన రాజ్యవ్యవస్థనే వారు ఏర్పాటు చేసుకున్నారు.

Read Full Post »

ఏ పార్టీ వైఖరి ఎట్లున్నా తెలంగాణ అంశం అన్ని పార్టీలను ఒక చౌరస్తాలో నిలబెట్టిందనీ, ఉపఎన్నికల అనంతరం రాజకీయ పార్టీల పరిస్థితి సంక్షోభంలో పడనున్నదనీ అంటున్నారు నాగోబా
టి.ఆర్‌.ఎస్‌. ప్రజాప్రతినిధుల మూకుమ్మడి రాజీనామాలు తెలంగాణ రాజకీయోద్యమాన్ని కీలక మలుపు తిప్పింది. అదే సమయంలో సమైక్యవాదాన్ని సమర్థించే రాజకీయ పార్టీలలో తెలంగాణ వాదుల ఒత్తిడి తీవ్రతరమైంది. టి.ఆర్‌.ఎస్‌. ప్రజా ప్రతినిధుల రాజీనామాలను తెలంగాణ ప్రజలు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక వర్గాలు, మేధావులు, కవులు, రచయితలు, కళాకారులు, విద్యార్థులు స్వాగతించారు.

Read Full Post »

- యం. కోదండరాం, కె. సీతారామారావు
I
రెండవ ప్రపంచ యుద్ధానంతరం పేదరికాన్ని నిర్మూలించడానికి, అసమానతలు తొలగించడానికి ఎన్నో ప్రపంచ దేశాలు భూసంస్కరణల విధానాలను రూపొందించి అమలుచేయడం జరిగింది. కులం సామాజిక పునాదిగా గల భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని విస్తరించడానికి, ప్రతి వ్యక్తికి ఒక విలువను ఆపాదించడానికి భూసంస్కరణలు ప్రధాన విధాన సాధనాలయినవి. భూసంస్కరణల ప్రధాన లక్ష్యం ఆర్థిక సమానత్వం ద్వారా రాజకీయ ప్రజాస్వామ్యాన్ని విస్తరించడం.

Read Full Post »

- అల్లం నారాయణ
ఏటా కోటీ ఇరవైలక్షల మంది నీ గులాబీతోటను తొక్కుకుంటూ తోసుకుంటూ ఎగిరిపోతారిక లోహవిహంగాల రెక్కలపైన. నీ ఎకరం గులాబీ తోట పక్కవాళ్ళ వందలాది ఎకరాల చేనుచెలక, ఆ పక్కవాళ్ళ కూరగాయల మళ్ళను మాయం చేసి నాలుగున్నర కిలోమీటర్ల పెట్టున వేసినారు చూడు… అది రన్‌వే. అతి పొడవైనది. అదొక కొండచిలువకూడా. దానికడుపులో దాగున్న నీ గులాబీతోట, వేల ఎకరాల తోటలు వాడిపోయినయ్‌. ఆవుల చంద్రమ్మా, సుభద్ర, రాజవ్వ, మల్లవ్వ, రాజపోషవ్వ పేరేదైతేనేం భూమి పుత్రికా.

Read Full Post »

- సి.విఠల్, శ్రీధరరావు దేశ్‌పాండే
వెనుకబడిన ప్రాంతాల అభివృధ్ధికి ఒక చట్టబద్ద సంస్థను ఏర్పాటు చేస్తాం, దీనిపై మీరు చర్చకు సిద్ధమేనా అని ముఖ్యమంత్రి వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి పెద్ద పెద్ద పత్రికా ప్రకటనల ద్వారా చర్చకు తెరతీసారు. తెలంగాన ప్రజలకు ఇటువంటి తాయిలాలు ఆంధ్రా వలస ప్రభుత్వాలు ప్రకటించడం కొత్తకాదు. తెలంగాణ ఆకాంక్షలు బలంగా తలెత్తిన ప్రతిసారి ఇటువంటి తాయిలాలను వారు తెలంగాణ ప్రజలకు చూపిస్తూపోయారు.

Read Full Post »

- బోధనం నర్సిరెడ్డి, ఎలికట్టె శంకర్‌రావు, గౌస్‌ మొహియుద్దీన్‌
‘దారి తప్పుతున్నాం జాగ్రత్త’ అంటూ తెలంగాణా ప్రజలతో మమేకమైనట్టు ఎం.వి.రమణారెడ్డి రాసిన ఉపన్యాస వ్యాసం (ఫిబ్రవరి -వివిధ) ఉత్త వైరుధ్యాలపుట్టగానూ, కోస్తా పక్షపాతంగానూ ఉంది. తిరుపతిలో ఈ ఉపన్యాసం ఎంత దురుద్దేశ్యపూర్వకంగా, పక్షపాత ధోరణితో చేసిందో పత్రికలో రావడం ద్వారా తెలంగాణా ప్రజలకు తెలిసింది. ఇందులోని వైరుధ్యాలను, పక్షపాత వ్యాఖ్యానాలను ఒక్కటొక్కటే సోదాహరణంగా వివరిస్తాం.

Read Full Post »

2008, ఫిబ్రవరి 15న రామగుండం ఓపెన్‌ కాస్టు-3 బొగ్గు గని విస్తరణలో భాగంగా మంగళపల్లి - పెద్దంపేట గ్రామంలో సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో పర్యావరణ ప్రజాభిప్రాయసేకరణ జరిగింది. ఆ సభలో ప్రభుత్వ పర్యావరణ శాస్త్రవేత్తలతోపాటు కరీంనగర్‌ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌, సంబంధిత సింగరేణి అధికారులు, ప్రజాప్రతినిధులు, యూనియన్‌ నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Read Full Post »

- చుక్కా రామయ్య
కాలంతో పాటుగా వస్తోన్న అనేక రకాల కొత్త చదువులను తెలంగాణ యువత అందుకోలేకపోవడానికి కారణమేమిటి? దారిద్య్రం. తెలంగాణ వెనుకబాటుతనానికి, లేదా వెనుకబడేసిన సందర్భానికి కారణం ఆ ప్రాంతంలో తాండవిస్తున్న పేదరికాన్ని నామరూపాలు లేకుండా చేయలేకపోవడమే. నవాబులు, దొరల ఆధిపత్యం కింద శతాబ్దాలుగా నలిగిపోయిన తెలంగాణుల దుస్థితి ‘పోలీసు చర్య’ అనంతరం కూడా తొలగిపోలేదు. ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణరావు హైదరాబాద్‌ రాష్ట్రాన్ని సమైక్య ఆంధ్రలో విలీనం చేస్తూ సంతకం చేసిన ఐదు దశాబ్దాల తరువాత కూడా […]

Read Full Post »

- వెంకట్
వ్యాపార రంగానికి దూరంగా సామాజికతకు, సమ్స్యలకు అద్దంపడుతూ మానవ జీవన చిత్రాలను విలక్షణంగా ఆవిష్కరించిన 84 లఘు మరియు డాక్యుమెంటరీ సినిమాలతో కూడిన ద్వితీయ జాతీయ చిత్రోత్సవం మహానగరాలకు దూరంగా కరీంనగర్ లో నిర్వహించబడి ప్రేక్షకుల్ని విశేషంగా అలరించింది, ఆలోచింపజేసింది. జాతీయవేడుకగా నిర్వహించిన ఈ చిత్రోత్సవం కొత్త దర్శకులకు వేదికగా కూడా నిలిచింది.

Read Full Post »

- ఎం. కోదండరాం, కె. సీతారామారావు
వ్యవసాయం ప్రధాన జీవికగా ఉన్న దేశాలలో భూసంబంధాలే సమాజ పరిస్థితిని, రాజకీయ ఉద్యమాల స్థితిగతులను నిర్ణయిస్తాయి. తెలంగాణ ఉద్యమాన్ని అర్థం చేసుకోవాలన్నా ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయరంగంలో వచ్చిన మార్పులను పరిగణనలోకి తీసుకోకతప్పదు.
బ్రిటిష్‌ పాలనకు వెలుపల వున్న తెలంగాణ చరిత్రక్రమాన్ని 1956దాకా ఇక్కడి ప్రజలే నిర్ణయించుకున్నా 1956 నుండి కోస్తాంధ్ర పాలక వర్గాలు శాసిస్తున్నాయి, నిర్ధేశిస్తున్నాయి.

Read Full Post »

1956లో ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల విలీనం బేషరతు విలీనం కాదు. ఆంధ్ర ప్రాంత నాయకులు తెలంగాణ ప్రజలకిచ్చిన వాగ్దానాలలో అత్యంత ప్రధానమైనది ముల్కీ రూల్సు కొనసాగింపు. 1956 నుండి 1975 దాకా అంటే రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువడిన దాకా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఆచరణలో విఫలమైనా అధికారికంగా ముల్కీ రూల్సు అమలులో ఉన్నాయి. తెలంగాణ ప్రాంత ఉద్యోగాలలో, కళాశాలల్లో ప్రవేశం పొందడానికి అభ్యర్థులు తప్పనిసరిగా ముల్కీ సర్టిఫికేట్లు సమర్పించవలసి వచ్చేది. అయితే సమైక్యరాష్ట్రంలో ముల్కీ రూల్సు యధేచ్చగా ఉల్లంఘించబడినాయి. […]

Read Full Post »

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: మంగళవారం.. సమయం ఉదయం 11.30. శాసనసభ ఆవరణలో ఒక్కసారిగా కలకలం. పోలీసులు, మీడియా అందరూ కలకలం వినిపిస్తున్నవైపు పరుగులు. ఒకపక్క అసెంబ్లీ సందర్శకులు, మరోవైపు పాత్రికేయులు, ఇంకోవైపు పోలీసులు.. ఏం జరుగుతోందో తొలుత ఎవరికీ అర్థం కాలేదు. తెలంగాణ విద్యార్థి సంఘం, తెలంగాణ బహుజన విద్యార్థి సమాఖ్యలకు చెందిన సుమారు 15 మంది విద్యార్థులు మంగళవారం అసెంబ్లీ ఆవరణలో ప్రవేశించి నినాదాలు చేసినప్పుడు తొలుత నెలకొన్న పరిస్థితి ఇది.

Read Full Post »

-కట్టా శేఖర్‌రెడ్డి
ఇప్పటికిప్పుడు తెలంగాణపై అవుననో కాదనో చెప్పే అవకాశం ఏమాత్రం లేదు. ఇది తీవ్ర సమస్య. చత్తీస్‌ఘడ్‌ లాంటి చిన్న రాష్ట్రాల్లో తీవ్రవాదుల కద లికలు ఎక్కువై పరిస్థితి దారుణంగా తయారయింది. రాష్ట్రంలో కూడా నక్సలైట్లు ప్రత్యేక తెలంగాణ కోరుకుంటున్నందున ఉగ్రవాద సమస్య మరింత పెరిగే అవ కాశం ఉందని నిఘా సంస్థలు హెచ్చరించాయి…కాశ్మీర్‌ సమస్యపై పాక్‌తో భారత్‌ ఓ వైపు పోరాడుతూనే మరోవైపు ఇతర విషయాలపై చర్చలూ జరుపుతోంది. అలాగే మనమూ వ్యవహరిద్దాం.
-ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి

Read Full Post »

లెక్కల్లో హైదరాబాద్‌ ఎవరికి దక్కేను? వ్యాసానికి సి. శ్రీనివాస్‌ జవాబు
నాలుగు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన హైదరాబాద్‌ నగర నిర్మాణ పునాది నుంచి అణువణువునా తెలంగాణ ప్రజలతోపాటు కోస్తా, రాయలసీమ ప్రజల కష్టం కలగలిసి ఉంది. ఎవరో ఏదో చెప్పారనో లేదా కేవలం కొన్ని ప్రాంతాల నాయకులు హైదరాబాద్‌ను అభివృద్ధి పథంలో న డిపారనో దాని మీద కోస్తా, రాయలసీమవాసులకు హక్కుందని అంటున్నారన డం అర్థరహితం. గోల్కొండ కోట కట్టించింది నిడదవోలు వీర భద్రుడి బంధువులు ఆంధ్రనగరి పాలకులైన కాకతీయులైతే […]

Read Full Post »

- టి. శివాజీరావు
రాష్ట్రాభివృద్ధిలో భాగంగా భారీ వ్యయంతో నిర్మించ తలపెట్టిన పోలవరం ప్రాజెక్టు ప్రారంభం నుండీ వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. వ్యవసాయం, విద్యుదుత్పత్తి, త్రాగునీరు, పారిశ్రామికాభివృద్ధే పోలవరం ప్రాజె క్టు ముఖ్యోద్దేశమని గత అరవై ఏళ్ళుగా ప్రభుత్వం చబుతూనే ఉంది. ఈ ప్రాజెక్టు ను బ్యారేజిగా నిర్మించి దాదాపు 100 శతకోటి ఘనపుటడుగుల గోదావరి నీటిని కృష్ణానదిలోకి విజయవాడ వద్ద కలిసేటట్లు చేయవచ్చని ప్రఖ్యాత ఇంజనీర్లు ఎఎన్‌ ఖోస్లా 1953లోను, గుల్హటి 1963లోను కేంద్ర ప్రభుత్వానికి […]

Read Full Post »

- వరాల ఆనంద్
కరీంనగర్ ఫిలిం సొసయిటీ (KAFISO) ఆధ్వర్యంల ఫిబ్రవరి 13 న “2nd National Short & Documentary Film Festival” కరీంనగర్ ఫిలిం భవన్‌ల మొదలయింది. ఫిలిం మేకర్ బి.నరసింగరావు జ్యోతి వెలిగించి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టింరు. ఈ చిత్రోత్సవాలు ఫిబ్రవరి 18 వరకు కొనసాగుతది.

Read Full Post »

- సి. విఠల్‌, శ్రీధరరావు దేశ్‌పాండే
అసమ అభివృద్ధికి సంబంధించిన అసంతృప్తులు దేశంలోని అనే క ప్రాంతాలలో స్వాతంత్య్రసిద్ధి నాటినుంచి ఉన్నప్పటికీ ప్రత్యే క రాష్ట్రం కోసం తొలినుంచి డిమాండ్‌ చేసిన గడ్డ బహుశా తెలంగాణ ఒక్కటేనేమో? ప్రత్యేక తెలంగాణ ఆరాటంలో ముల్కీ ఉద్య మం (1952) తొలి దశ కాగా ప్రత్యేక తెలంగాణ ఉద్యమం (1969) మలి దశ. వర్తమాన తెలంగాణ ఉద్యమం (ఇది తుది, ఫలప్రదమైన దశ అవగలదని ఆశిద్దాం) 1990ల నుంచి నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ […]

Read Full Post »

- కట్టా శేఖర్‌ రెడ్డి
ఇప్పుడు తెలంగాణను తెచ్చుకున్నా అది దొరలపాలవుతుంది. బడుగులకు రాజ్యాధికారం దక్కదు. వై.ఎస్‌. నేతృత్వంలో పూర్తిస్థాయి అభివృద్ధి జరిగాక ప్రత్యే క రాష్ట్ర అంశం తెరపైకి రావాలి. ప్రస్తుత తరుణంలో ప్రత్యేక రాష్ట్రం కంటే అభి వృద్ధే ముఖ్యం.
-తెలంగాణ డిసిసి అధ్యక్షులు, ఎమ్మెల్సీలు
‘ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటయితే కోస్తాంధ్రుల పెత్తనం ఎక్కువయి పోతుంది. వారితో నెగ్గలేం. మాకు ప్రత్యేక రాష్ట్రం వద్దు. మద్రాసు రాష్ట్రం లోనే కొనసాగుతాం’- ఇది అప్పట్లో ఆంధ్ర రాష్ట్ర ఉద్య మానికి […]

Read Full Post »

అతడిది జిల్లా వరంగల్లు, మండలం మద్దూరు, ఊరు రేబర్తి.
అంటరానింటిలో అంటరానివానిగానే పుట్టాడు.
పాడితే కంఠనాళం తెగి పడాలి. పల్లవితో అంటుకునే అగ్ని కావాలి. అంతిమ చరణం శ్రోతల్లో బడబాగ్ని పుట్టించాలి. తాను జన్మించిన నేల, తన ప్రజలు, తన సాహిత్య కళారంగం పట్ల తనదైన బాధ్యత ఉందని నమ్మే కవి అందెశ్రీ

Read Full Post »

Next »

Buying fake viagra You need to know how to viagra online pharmacy Levitra verses viagra although the thought about viagra online cheap buy viagra drugs. Purchase sildenafil buy viagra pharmacy