మీరెట్ల సాయపడొచ్చు
నవంబర్ 23rd, 2006 by డిస్కవర్ తెలంగాణ
తెలంగాణను ప్రతిఫలించే, సాహిత్యం, పత్రికలు, వ్యాసాలు, పుస్తకాలు, కళలు, సాంస్కృతిక అంశాలు, చరిత్ర – ఏదయినా సరే ఈ వెబ్‌సైటు ద్వారా అందరికి అందచేయాలనేదే మా ప్రయత్నం. ఈ వెబ్‌సైటును తెలంగాణ విజ్ఞాన సర్వస్వంగా తీర్చిదిద్దాలనేది మా ఆకాంక్ష. అయితే ఈ ప్రయత్నం మా ఒక్కరి వల్ల సాధ్యం కాదు. తెలంగాణ సాహితీ సంస్కృతులకోసం నిలబడే అనేక తెలంగాణ వాసుల సహాయ సహకారాలు లేకుండా ఇది సాధ్యం కాదు.
డిస్కవర్ తెలంగాణకు మీరంతా ఏట్ల సాయం చెయ్యొచ్చు ?!
- మన ఈ వెబ్‌సైటును ఇంకా ముందుకు తీసుకపోనీకి చురుకైన వాలంటీర్లు ముందుకు రావాలె. మీలో ఉన్న చిన్న నైపుణ్యమైనా మాకు ఎంతో సాయం చేస్తది. మీరు ఎట్లా సాయపడగలరో మాకు ఈమైల్ చెయ్యండి.
- ఎక్కడైనా తెలంగాణ సభలు జరిగినప్పుడు (చిన్నయైనా, పెద్దయైనా) ఈ కరపత్రం (డిస్కవర్ తెలంగాణ కరపత్రం) ప్రింట్లు పంచి సహకరించొచ్చు.
- మీ వెబ్‌సైట్, బ్లాగుల నుండి “డిస్కవర్ తెలంగాణ”కు లింకు చెయ్యండి. (Link to Us !)
- మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ లెక్క తెలియచేసి మేము చేస్తున్న తప్పొప్పులను సరిచెయ్యొచ్చు?
- పని చేయని లింకుల గురించి మాకు చెప్పి (by reporting Broken Links)




డిస్కవర్ తెలంగాణ గొప్ప సాహసం మిత్రమా … ఇది నాలుగు కొట్ల అమాయక తెలంగాణ ప్రజల గుండె చప్పుడు కావాలి. పైలం బిడ్డా..అంటు.. కళ్ల నీళ్లు కక్కుకునె ప్రతీ తల్లిదండ్రి సంతొశంతొ సాగనంపె రొజులు రావాలి. ఆ కల నెరవెరాలంటె..తెలంగాణ ప్రతీ బిడ్డా… డిస్కవర్ తెలంగాణ లొ పాలుపంచుకొవాలి…ఇందుకు మొదటి అడుగుగా నెను..ప్రతీ రొజు క్రమం తప్పకుండా ఫాలొ అవుతాను. నాకు వీలైనంతగా డిస్కవర్ తెలంగాణ కు సాయపడడానికి ప్రయత్నిస్తాను.
—- క్రిష్ణ సాయి (జర్నలిస్ట్ )