తిరుగుబాటు వీరుడు తుర్రేబాజ్‌ఖాన్ జ్ఞాపకాల విషాదంతో స్వామి కోఠీ చౌరస్త నుండి బయలుదేరి బ్యాంక్ స్ట్రీట్ల ఉన్న ఫిరోజ్‌గాంధీ పార్క్‌లకు ప్రవేశించినాడు. నరేష్, వేణు ఇంక రాలేదు.
జుహర్ నమాజుల కోసం మక్కా మసీదు ప్రాంగణంల అందరూ సమావేశమవుతున్నరు. కాని అందరి ముఖాలల్ల ప్రశాంతత కరువైంది. ఆందోళన, భయం అందర్నీ కమ్ముకొని ఉంది. దానికి కారణం మక్కా మసీదు గోడల మీద, తలుపుల మీద అంటించిన పెద్ద పెద్ద చేతిరాతల పోస్టర్లు. తెల్లని కాగితాల మీద ఆకుపచ్చ రంగుల రాతలు.
రెసిడెన్సీ నుండి స్వామి మళ్లీ నడక సాగించినాడు. ఆంధ్రా బ్యాంకును దాటి సుల్తాన్ బజార్ లేన్ల నుండి నడుస్తున్నడు. కాలు పెట్ట సందులేదు. అన్నీ ఫుట్‌పాత్ దుకాణాలు నడిచొచ్చి నడిరోడ్డును ఆక్రమించుకున్నై. సైకిళ్లు, రిక్షాలు పద్మవ్యూహంల అభిమన్యుడిలాగ సందు చేసుకొని ముందుకు దూసుకపోతున్నై. సకలం సమస్త సామానులు సరసమైన ధరలకే అక్కడ అమ్మబడును. పేదోళ్ల షాపింగు సెంటర్ మదీనా బజార్ లేదా జుమ్మెరాత్ బజార్. దండోళ్ల షాపింగు సెంటర్ ఆబిడ్స్.
ఉద్యమం ప్రారంభం అయ్యేనాటికి, ఇంకా మూడు నెలల సిలబస్ పూర్తి కావాల్సి ఉండేది. ఇప్పుడు ఒక నెలలనే హడావిడిగ సిలబస్ కంప్లీట్ చేసి డిసెంబరు నెలల పరీక్షలు నిర్వహించినారు. ఎంత చేసినా అప్పటికే ఒక విద్యా సంవత్సరం నష్టం అయ్యింది. ప్రాణత్యాగాలు కష్టనష్టాలతో పాటు ఇది కూడా ఒక త్యాగమే. విద్యార్థుల జీవితంల విలువైన ఒక సంవత్సరం వృధా కావటం వలన జీవితంల అన్ని రంగాలల్ల వారు ఒక సంవత్సరం వెనుకబడిపోయినారు.
స్వామి మనస్సంతా కేంద్రీకరించి శ్రద్ధతో శక్తి కొద్దీ పరీక్షలు సిద్ధం అయినాడు. ఆఖరి పేపరు రాసిన తర్వాత క్లాసు రాకున్నా ఫెయిల్ మాత్రం కానన్న నమ్మకంతో తృప్తిగ గాలి పీల్చుకున్నడు. కాలేజి నుండి చక్కగ ఇంటికి వెళ్లకుండ అఫ్జల్‌గంజ్‌ల బస్సు ఎక్కి కోఠీ బస్ స్టాపుల దిగినాడు. ఎదురుగ మాడ్రన్ టిఫిన్ రూం.
1969 జూన్ 27న ఉదయం 9 గంటలకు ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి తన పదవికి రాజీనామ చేసినాడు. ఆ రాజీనామా లేఖను రాష్ట్ర గవర్నర్‌కు పంపకుండ ఢిల్లీలోని కాంగ్రెస్ అధ్యక్షుడు నిజలింగప్పకు పంపినాడు. అదీ ఆయన కుటిల నీతి.
ఆరు నెలల సుదీర్ఘ తెలంగాణా ఉద్యమ పోరాట ఫలితమే ముఖ్యమంత్రి రాజీనామా. ఇది తెలంగాణ ప్రజల నైతిక విజయం.
ఏ బొంబై కా తమాషా దేఖో
ఏ చార్ దిన్కా తమాషా దేఖో
ఏ కల్కత్తా కాళీ మాతా దేఖో
ఏ బెజ్వాడా కనకదుర్గా దేఖో
ఏ చారానా తమాషా దేఖో
ఏ బార్ బార్ తమాషా దేఖో
ఏ బొంబై కా తమాషా దేఖో
స్వామి తన మిత్రబృందంతోటి ఆ బొంబై కా తమాషా ముందు నిలబడి ఉన్నడు.
1969 జూన్ నెలను తెలుగు పంచాంగం ‘రక్తాక్షిమాసం’ అని పేర్కొంది. ఆ పేరుకు తగ్గట్టు నిజంగనే తెలంగాణాల ఆ నెల అంతా రక్తం ప్రవహించింది. ఆ రక్తాక్షి మాసమంత పోలీసుల కాల్పులతోటి, తెలంగాణా ప్రజల బలిదానాలతోటి దద్ధరిల్లిపోయింది. జూన్ రెండవ తేదీ సోమవారం నుండి నాలుగు రోజులు కొనసాగిన అల్లర్లు, మారణకాండల ప్రభుత్వ లెక్కల ప్రకారమే నగరంల 30 మందికి పైగా మరణించినారు. వందలాది మందికి గాయాలైనాయి. అండ్ల కొందరు శాశ్వతంగ అవిటివారైనారు. అనధికార లెక్కలు తెలుసుకుంటే గుండెలు బద్దలయితయి. ఎన్ని సార్లు కర్ఫ్యూ విధించినా పరిస్థితి అదుపులకు రానందున 33 గంటల పాటు నిరవధిక కర్ఫ్యూ విధించినారు. జనజీవనం స్తంభించిపోయింది. అనేక జీవితాలు అల్లకల్లోలాలయినై. కుటుంబాలు కూలిపోయినై.
అట్ల ఆ డిమాండ్స్ డే - మే డే ఒక బ్లాక్ డేగ నగర చరిత్రల నిలిచిపోయింది. తెల్లారి మే రెండున జంటనగరాలల్ల సంపూర్ణ హర్తాల్, బంద్ జరిగింది. ఆ రోజు కూడా మళ్లీ అల్లర్లు జరిగినై. ఆ రోజు రాత్రి సికింద్రాబాద్‌ల జేమ్స్ స్ట్రీట్ నుండి ఓల్డ్ ఘాస్‌మండీకి పోతున్న పోలీసు వ్యాన్ మీద ఇద్దరు యువకులు బాంబులు విసిరితే ఒక జవాను అక్కడికక్కడే మరణించినాడు. వ్యాన్ల ఉన్న మిగిలిన వారు గాయపడినారు. నరేందర్ అనే ఆవుల మందకు చెందిన పాల వ్యాపారి, మల్కాజిగిరికి చెందిన కుమార్ అనే ప్రింటింగు ప్రెస్ కార్మికుడు ఆ బాంబులు వేసినారు.
“ఈ చిలుక పలుకదేమీ మనతో
మాటాడదేమీ మనతో
నిన్న మొన్నటి దాకా ఈ చిలుక
మాటలాడెను బాగా”
అర్ధరాత్రి దాటింది. నట్టింట్ల జెఫ్రీ శవం. అనంతశయనం. అతి దీర్ఘమైన పెను నిద్దుర. పెను విశ్రాంతిలకు పోయిన జోసెఫ్ మార్క్వెజ్ జెఫ్రీ కండ్లు తెరుచుకునే ఉన్నయి - రాబోయే తెలంగాణా కోసం నిరీక్షిస్తున్నట్లు. ప్రాణం పోయిన కొద్దిసేపట్లనే కనురెప్పల్ని మూయాలంట. లేకపోతే కండ్లు అట్లనే తెరుచుకొని ఉంటవని ఎవరో ముసలమ్మ అంటుంది.
ఆ రోజు మేడే. చికాగో వీధులల్ల తమ హక్కుల కోసం కార్మికులు రక్తం ధారపోసిన రోజు. తమ రక్తవర్ణంతోటి అరుణపతాకాన్ని సృష్టించిన రోజు. ఆ రోజుననే హైద్రాబాద్, సికింద్రాబాద్ జంటనగరాలల్ల తెలంగాణా ప్రజా సమితి ‘డిమాండ్ డే’ కోసం పిలుపిచ్చిన రోజు. తెలంగాణా కోసం ఊరేగింపు జరుపవలసిన రోజు.
నహారి, ఖుల్చా, పాయారోటీ, శీర్మాల్, బోటీ కబాబ్, ఖీమా, రుమాలి రోటీ… సర్వర్ దండకం చదవసాగినాడు. వాడి దాడి నుండి తప్పించుకోనీకి పాయారోటీకి ఆర్డరిచ్చి మళ్లీ తన మనోవల్మీకంలకు జారిపోయినాడు.
స్వామి ఇంటికి చేరుకొనేసరికి ఇంట్ల ‘భూకంపం’ వచ్చినంత పరిస్థితిని గమనించాడు. క్రిందటి రాత్రి స్వామి ఇంటికి రాకపోయేసరికి ఇల్లంత అతలాకుతలం అయిపోయింది. పోలీసులు అరెస్టు చేసి జైల్ల పడేసినారేమో, కాకపోతే ఏదైనా టక్కర్ అయ్యి దెబ్బలు తగిలి దవాఖాన్ల పడిండేమో అని అమ్మ ఏడుపులు. అరుపులు. నెత్తి కొట్టుకొని క్రింద నేలపై పడిపోయింది. స్వామి గురించి భయమేందోగని బాపుకు అమ్మను సముదాయించడమే కష్టమైపోయింది. ‘నా కొడుకును సక్కగ ఇంటికి తీసుకు రాకపోతివో నీ ముందే నా ప్రాణమిస్త’ అని పెరుమాండ్ల పటాలు నిలబెట్టిన గద్దె ముందు తలకొట్టుకునేసరికి ఆమె నొసటికి దెబ్బ తగిలి బొడిపెలు వచ్చినై. ఆ తర్వాత శాంతించి తమ ఇలవేలుపు చిల్పూరుగుట్ట బుగులు వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టింది.
సమస్య పట్ల అవగాహనా, భావోద్వేగాలకు లోనుగాకుండా తార్కికంగానూ దూరదృష్టితోనూ పరిష్కారం ఆలోచించగల వివేచనా కనిపించడం లేదు. ‘సమైక్యాంధ్ర’ బోలు నినాదం. ప్రత్యేక తెలంగాణ అంత తేలిగ్గా ఇవ్వరన్న నమ్మకంతో ఇన్నాళ్లూ అందుకు మద్దతు పలికిన రాజకీయ పార్టీలూ, ఉద్యమం జరుగుతున్నన్నాళ్లూ చోద్యం చూస్తూన్న ఇతర ప్రాంత ప్రజలూ ఇప్పుడు సమైక్యాంధ్ర అంటూ గొంతు చించుకోవడం విచిత్రం. Read Completely >>
ఆ రోజు పొద్దుపొద్దున్నే స్వామి ఇంకా నిద్ర లేవకముందే గోపి సైకిలేసుకుని, చెమటలు కారంగ, దమ్ములు పోసుకుంట శాలీబండాకు వచ్చినాడు. శాలీబండా చడావ్ మీద సైకిల్ తొక్కడమంటే మజాక్ కాదు. కాళ్ల పిక్కలల్ల మస్తుగ బలం ఉండాలె. శరీరానికి తాఖత్ గావాలె. కలేజాల ఖువ్వత్ ఉండాలె. అమ్మ వాడిని దివాన్‌ఖానాల ఉన్న ఆరామ్ కుర్చీల కూచుండబెట్టి కాశీ నుండి తెచ్చిన రాగిచెంబుల చల్లటి మంచి నీళ్లు, గుండ్రటి తెల్లటి కోపుల పొగలు గక్కే గరం గరం ఛా ఇచ్చింది. దివాన్ఖానా పక్కనే బాయి ఉంది. ఇనుప బొక్కెన చప్పుడు, దాని గొలుసు, గిరిక చేసే వింత వింత చప్పుళ్లతో గమ్మత్తు సంగీతాన్ని వింటూ వాడు ఛాను ఊదుకుంటూ, చప్పరిస్తూ గుటకలు మింగుతూ ఆనందిస్తున్నడు. బాయి గిరికకు నూనె పోయనట్టుంది. అది కీసుకీసుమని శబ్దం చేస్తుంది.
జనవరి ఇరవై నాలుగున సదాశివపేటల పోలీసులు కాల్పులు జరిపినారు. పద్నాలుగు మందికి దెబ్బలు తగిలినాయి. ఆ కాల్పులలో శంకర్ అనే పదిహేడు సంవత్సరాల యువకుడు మరణించినాడు. 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమంల శంకర్ తొలి అమరవీరుడు. శంకర్ అంత్యక్రియలలో మూడు వేల మంది విద్యార్థులు పాల్గొన్నరు. మిగిలిన క్షతగాత్రులందరినీ సికింద్రాబాదులోని గాంధీ దవాఖానాకు తరలించినారు. అక్కడ వాళ్లు కొసప్రాణాలతో మృత్యువుతో పోరాటం చేస్తున్నరు. శంకర్ సంస్మరణ సభ ఆ రోజు హైద్రాబాద్ల ఆర్ట్స్ కాలేజీ ముందు మైదానంల జరుగుతున్నది.
జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం
ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం
తరతరాల చరిత గల తల్లీ నీరాజనం
పది జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం
జై తెలంగాణ జై జై తెలంగాణ
జై తెలంగాణ జై జై తెలంగాణ ॥జయ జయహే॥
RT @yuvatelangana: The Tentacles of the Seemandhra Moneybags Run Deep and Wide - http://bit.ly/d9JA2ptelangana16 hours ago
Seema or Andhra, all the same to us telanganaites ! We want telangana and only telangana with no strings attached. RayalaTelangana -> BIG NO telangana19 hours ago
RT @SimplyTelangana: Private Member resolution on Telangana to be moved by Rajiv Pratap Rudy(BJP) on March 12th in? http://goo.gl/fb/jHaStelangana2010/03/10
RT @rede_reddy: Nice 2 c lot of ppl supporting telangana in twitter. I wish a lot more 2 join voices 4 #telangana telangana2010/03/09
RT @SimplyTelangana: Singareni Coal Fields the Most Visible Example of Seema Andhra Exploitation http://goo.gl/fb/fZIutelangana2010/03/09
All opinions and views expressed by third party content providers and shown here as preview are not that of Discover Telangana.
If you find any Content that is infringing, libelous, defamatory, obscene, abusive, offensive or otherwise violation of copyright law, alert us by emailing us at discover.telangana(at)gmail.com